Maa Inti Bangaaram OTT: ఓటీటీలో నేటి నుంచి సమంత యాక్షన్ షురూ- 100 కోట్ల మా ఇంటి బంగారం ఓటీటీ స్ట్రీమింగ్- 4 భాషల్లో!

Samantha Maa Inti Bangaaram OTT Streaming Today: బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు రాబట్టిన సమంత లేటెస్ట్ యాక్షన్ డ్రామా మా ఇంటి బంగారం ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లోనే మా ఇంటి బంగారం నేటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Jul 17, 2026, 06:22:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Samantha Maa Inti Bangaaram OTT Release Today: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయడానికి వచ్చేసింది.

ఓటీటీలో నేటి నుంచి సమంత యాక్షన్ షురూ- 100 కోట్ల మా ఇంటి బంగారం ఓటీటీ స్ట్రీమింగ్- 4 భాషల్లో!
ఓటీటీలో నేటి నుంచి సమంత యాక్షన్ షురూ- 100 కోట్ల మా ఇంటి బంగారం ఓటీటీ స్ట్రీమింగ్- 4 భాషల్లో!

స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే

జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మా ఇంటి బంగారం కేవలం 28 రోజుల్లోనే ఓటీటీ రిలీజ్ కావడం విశేషం. తెలుగు చిత్ర పరిశ్రమలో సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే రూ. 100 కోట్ల క్లబ్ సాధ్యమనే అంచనాలను ఈ చిత్రం పూర్తిగా తలకిందులు చేసింది.

100 కోట్ల మైలురాయి దాటి

ప్రతిభావంతురాలైన దర్శకురాలు నందిని రెడ్డి మార్క్ సున్నితమైన కథనానికి, విభిన్న కథా చిత్రాల సృష్టికర్త రాజ్ నిడిమోరు స్క్రీన్ ప్లే తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. ఒక మహిళా ప్రధాన తెలుగు చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మైలురాయిని దాటిన మొట్టమొదటి సినిమాగా 'మా ఇంటి బంగారం' సరికొత్త రికార్డును లిఖించింది.

పక్కింటి అమ్మాయిగానే కాకుండా

ఇందులో సమంత 'స్వర్ణ' అనే పక్కింటి అమ్మాయి లాంటి పాత్రతో పాటు అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ చేశారు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత మొదటిసారి తన భర్త అనిరుధ్ సొంత ఇంటికి వెళ్లే స్వర్ణ కథ ఇది. కొత్త కుటుంబంలో అడుగుపెట్టి, అత్తమామల మనసులు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమెకు ఒక ఊహించని సవాలు ఎదురవుతుంది.

స్వర్ణ గతానికి సంబంధించి ట్విస్టులు

స్వర్ణ గతానికి సంబంధించిన ఒక వ్యక్తి హఠాత్తుగా ప్రవేశించి ఆమె రహస్య జీవితాన్ని బయటపెడతానని బెదిరిస్తాడు. ఈ క్రమంలో తన కుటుంబాన్ని, తనను తాను కాపాడుకోవడానికి స్వర్ణ ఏం చేసింది? ఎలాంటి పోరాటం సాగించింది? అనే ఆసక్తికర కథాంశంతో ఈ యాక్షన్ డ్రామా సాగుతుంది.

సమంత హోమ్ బ్యానర్ నుంచే

'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' (Tralala Moving Pictures) బ్యానర్‌పై సమంత స్వయంగా రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వురుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా సమంత భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

మా ఇంటి బంగారం నటీనటులు

ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, యాంకర్ శ్రీముఖి, మంజూష ముళ్లపూడి, సీనియర్ హీరోయిన్ గౌతమి కీలక పాత్రలు పోషించారు. స్టార్ కంపోజర్ సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్

ఇక నేటి నుంచి ఓటీటీలో సమంత యాక్షన్ స్టార్ట్ కానుంది. జియో హాట్‌స్టార్ (JioHotstar)లో మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ అయింది. జూలై 17 అర్థరాత్రి నుంచే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి 4 భాషల్లో మా ఇంటి బంగారం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

సమంత యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, నవ్వించే కామెడీతో మెప్పించిన మా ఇంటి బంగారం సినిమాను ఎంచక్కా జియో హాట్‌స్టార్ ఓటీటీలో వీక్షించేయండి. ఫ్యామిలీ అంతా కలిసి చూసేందుకు ఓటీటీలో వీకెండ్‌కి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More