Zee5 OTT: పేరెంట్స్‌కు గుడ్ న్యూస్- పిల్లలు, పెద్దల కోసం రేపే జీ5 ఓటీటీ కిడ్స్ సిరీస్- హీరోలుగా మారే అసురులు- 6 భాషల్లో!

Shivlok Ke Kundakka Mandakka OTT Streaming On Zee5: పిల్లలు, పెద్దల కోసం జీ5 ఓటీటీ సంస్థ సరికొత్త యానిమేటెడ్ కిడ్స్ సిరీస్‌ను తీసుకురానుంది. రేపటి నుంచే జీ5లో శివలోక్ కె కుండక్క మండక్క ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఏకంగా 6 భాషల్లో పిల్లలు, పెద్దలు ఈ ఓటీటీ సిరీస్‌ను వీక్షించొచ్చు.

Published on: Jul 16, 2026, 18:36:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Shivlok Ke Kundakka Mandakka OTT Release On Zee5: ఎప్పటిక‌ప్పుడు వినూత్న‌మైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించే జీ5 ఓటీటీ పిల్లల కోసం సరికొత్త సిరీస్‌ను తీసుకు రానుంది. పిల్ల‌ల‌కు ఇష్టమైన, సుర‌క్షిత‌మైన‌, హాస్యాన్ని అందించేలా కిడ్స్ జెడ్ (KidZ).. కంటెంట్‌ను డిజైన్ చేసే ప్ర‌దేశంగా మారింది.

పేరెంట్స్‌కు గుడ్ న్యూస్- పిల్లలు, పెద్దల కోసం రేపే జీ5 ఓటీటీ కిడ్స్ సిరీస్- హీరోలుగా మారే అసురులు- 6 భాషల్లో!
పేరెంట్స్‌కు గుడ్ న్యూస్- పిల్లలు, పెద్దల కోసం రేపే జీ5 ఓటీటీ కిడ్స్ సిరీస్- హీరోలుగా మారే అసురులు- 6 భాషల్లో!

ఆనంద్ నీలకంఠన్ నవల ఆధారంగా

తాజాగా దీన్ని మ‌రింత‌గా బ‌లోపేతం చేస్తూ మ‌రో స‌రికొత్త యానిమేటెడ్ ఓటీటీ సిరీస్ ‘శివలోక్ కె కుండక్క మండక్క’ (SKM) ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ ఆనంద్ నీలకంఠన్ రాసిన అత్య‌ధికంగా అమ్ముడైన పిల్ల‌ల పుస్త‌కం ‘ ది వెరీ ఎక్స్‌ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫ‌ర్ కిడ్స్‌’ ఆధారంగా ఈ ఓటీటీ సిరీస్ రూపొందింది.

బాల అసురులు హీరోలుగా మారడం

ఇద్దరు బాల అసురులు హీరోలుగా మారడం, వారి అమాయకత్వం, చేష్టలు, మంచి మనసు వంటి అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. జీ5లో జూలై 17 నుంచి అంటే మరికొన్ని గంటల్లో శివలోక్ కె కుండక్క మండక్క ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

అయితే, మ‌న అందరికీ తెలిసిన పౌరాణిక ప్రపంచాన్ని ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా ఓటీటీ స్క్రీన్‌పై స‌రికొత్త‌గా అందించ‌నున్నారు. క‌థ విష‌యానికి వ‌స్తే.. కుండక్క‌, మండక్క అనే ఇద్దరు అల్లరి అసుర జంట చుట్టూ తిరుగుతుంది. వాళ్ల అల్లరి పనులు ధైర్యం, స్నేహం, తమను తాము తెలుసుకునే ఒక అద్భుతమైన అడ్వెంచర్‌లోకి తీసుకెళ్తాయి.

తెలిసిన కథలకే పరిమితం కాకుండా

రామాయణం, మహాభారతం వంటి తెలిసిన కథలకే పరిమితం కాకుండా, ఈ సిరీస్ భారతీయ పౌరాణిక సంపదలోని కొత్త పాత్రలు, ఇంకా అన్వేషించని లోకాలు, మాయాజాలంతో నిండిన అడ్వెంచర్లను పిల్లలకు, కుటుంబాలకు పరిచయం చేయ‌నుంది.

వినోదం, యాక్షన్, ఆకర్షణీయమైన యానిమేషన్ కలయికతో రూపొందిన ఈ సిరీస్ నేటి పిల్లల కోసం పౌరాణిక కథలను స‌రికొత్త‌గా ఆవిష్క‌రించ‌నుంది. హీరో అనే ప‌దం ఓ వ్య‌క్తి త‌ను తీసుకునే నిర్ణయాలతో నిర్ణయించబడుతాడనే అభిప్రాయాన్ని అందంగా అందరికీ తెలియ‌జేస్తుంది. ఇదొక పెద్ద యూనివర్స్‌కు ఆరంభం మాత్ర‌మే.

మరిన్ని కథలతో

‘శివలోక్ కె కుండక్క మండక్క’ భవిష్యత్తులో కొత్త పాత్రలు, కొత్త అడ్వెంచర్లు, మరిన్ని కథలతో విస్తరించే ప్రపంచానికి పునాది వేస్తుంది. పిల్లలు భారతీయ పౌరాణిక కథలను వినోదాత్మకంగా, కొత్త కోణంలో ఎంజాయ్ చేసేలా ఉంటుంది.

ఈ క‌థలో ఇద్దరు అల్లరి అసుర పాత్రలను పెట్టడం ద్వారా, అల్లరి పిల్లలకు విలువలు లేదా క్రమశిక్షణ ఉండవ‌నే అభిప్రాయాన్ని ప్ర‌శ్నిస్తుంది. కుండక్క, మండక్క చేసే సాహ‌సాల‌ ద్వారా ఆసక్తి, అల్లరి కూడా దయ, ధైర్యం, అనుభూతితో కలిసి ఉంటుంద‌ని మ‌న‌కు తెలుస్తోంది.

కుటుంబం మొత్తం కలిసి చూసేలా

కిడ్జ్ ద్వారా జీ5.. భారతీయ సంస్కృతి ఆధారంగా చేసుకుని ఆధునిక కథనాలతో పిల్లలు, కుటుంబాలకు సురక్షితమైన, వయస్సుకు తగ్గ వినోదాన్ని అందించే నమ్మకమైన డెస్టినేషన్‌గా ఎదుగుతోంది.

కుటుంబం మొత్తం కలిసి చూసేలా రూపొందించిన ఈ సిరీస్, వినోదంతో పాటు చిరస్థాయిగా నిలిచే విలువలను కూడా తెలియజేస్తూ పిల్లలు, తల్లిదండ్రులను ఒకే చోట కూర్చుని ఎంజాయ్ చేసేలా చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

జీ5 ఓటీటీలో

‘శివలోక్ కె కుండక్క మండక్క’ సిరీస్ హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్ వంటి 6 భాషల్లో జీ5లో ఓటీటీ రిలీజ్ అవనుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More