Samantha: అత్యంత ఘోరమైన పతనం చూశా, పక్కన పెట్టేశారు, హీరోయిన్‌గా కష్టమన్నారు.. ట్రిపుల్ సక్సెస్‌పై సమంత ఎమోషనల్

Samantha On Career Struggles Pregnancy: స్టార్ హీరోయిన్ సమంత తన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' విజయంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ సరికొత్త ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్‌లో తన కెరీర్‌లోని ఒడిదుడుకులు, గర్భధారణ వార్తలపై సమంత ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Published on: Jun 26, 2026, 05:40:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Samantha On Career Struggles Pregnancy: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు గత కొన్నేళ్లుగా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి ఇప్పుడు సామ్ తన జీవితంలో అత్యంత సంతోషకరమైన దశలోకి అడుగుపెట్టారు.

అత్యంత ఘోరమైన పతనం చూశా, పక్కన పెట్టేశారు, హీరోయిన్‌గా కష్టమన్నారు.. ట్రిపుల్ సక్సెస్‌పై సమంత ఎమోషనల్
అత్యంత ఘోరమైన పతనం చూశా, పక్కన పెట్టేశారు, హీరోయిన్‌గా కష్టమన్నారు.. ట్రిపుల్ సక్సెస్‌పై సమంత ఎమోషనల్

మా ఇంటి బంగారం సక్సెస్ మీట్

సమంత నటించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ ఒక మధురమైన వార్త చెప్పారు. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత సమంత మొదటిసారి తల్లి కాబోతుంది. హైదరాబాద్‌లో జరిగిన 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్‌లో సమంత తన జీవితంలోని కష్టసుఖాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

మా ఇంటి బంగారం చిత్రంలో నటించడం ఒక నటిగా తనకు పెద్ద రిస్క్ అని సమంత పేర్కొన్నారు. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, కొత్తగా నిరూపించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఛాలెంజ్‌ను స్వీకరించినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తన వివాహం, ప్రెగ్నెన్సీ, సినిమా విజయంపై ఇండస్ట్రీతో పాటు అభిమానులు అభినందనలు కురిపిస్తుండటంపై సమంత స్పందించారు.

ఘోరమైన పతనం చూశాను

"ఈ రోజు నా ట్రిపుల్ సక్సెస్‌పై అందరూ నన్ను అభినందిస్తున్నారు. కానీ, నేను కెరీర్‌లో అత్యంత ఘోరమైన పతనాన్ని చూశాను. చాలా మంది నన్ను పక్కన పెట్టేశారు, నా పని అయిపోయిందని రాశారు. సమంత చాప్టర్ క్లోజ్, ఇక ఆమెను హీరోయిన్‌గా చూడటం కష్టమని ప్రచారం చేశారు" అని సమంత అన్నారు.

"ఆ మాటలు నన్ను కుంగదీయలేదు. కానీ, కొంతకాలం పాటు అదే నిజమన్నట్లుగా వాతావరణం కనిపించింది. వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ పోరాడే మనిషిని. అందుకే దీన్ని ఒక సవాల్‌గా తీసుకుని నా సర్వస్వం పెట్టి కష్టపడ్డాను. నాకు అందరూ అద్భుతంగా మద్దతు ఇచ్చారు" అని సమంత పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

అనారోగ్యం, మూడేళ్ల విరామంపై స్పష్టత

ఒకప్పుడు ఏడాదికి కనీసం మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ, అందులో ఒక బ్లాక్‌బస్టర్ సాధించే రేసులో ఉన్న సమంత.. హఠాత్తుగా మూడేళ్ల పాటు వెండితెరకు దూరం కావాల్సి వచ్చింది. ఈ సుదీర్ఘ విరామంపై ఒక విలేకరి ప్రశ్నించగా, ఆమె మనసులోని భయాలను బయటపెట్టారు.

2022లో సమంత 'మయోసైటిస్' అనే తీవ్రమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ బారిన పడ్డారు. దీనివల్ల కఠినమైన ఆహార నియమాలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించాల్సి వచ్చింది.

శాకుంతలం, ఖుషి కలెక్షన్స్

2023లో విడుదలైన 'శాకుంతలం' (ప్రపంచవ్యాప్తంగా రూ. 11 కోట్ల వసూళ్లు), 'ఖుషి' (ప్రపంచవ్యాప్తంగా రూ. 76 కోట్ల వసూళ్లు) చిత్రాల తర్వాత సామ్ లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. ఆపై 2024లో వచ్చిన 'సిటాడెల్: హనీ బన్నీ' ఓటీటీ సిరీస్‌లో మాత్రమే కనిపించారు.

"రేసులో ఉన్న నేను హఠాత్తుగా మూడేళ్ల పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, సినిమాలు లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ఎవరైనా సరే ఏం జరిగినా నమ్ముతారు. అది బలహీనమైన క్షణం. అప్పుడు మనపై మనకే అనుమానం వస్తుంది" అని సమంత పేర్కొన్నారు.

ఇలాంటి పతనాలు వస్తాయి

"ఏది సాధ్యం, ఏది నిజం అని ప్రశ్నించుకుంటాం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి పతనాలు వస్తాయి. అయితే ఆ బాధలోనే ఉండిపోవాలా లేక దాన్ని అధిగమించి ముందుకు రావాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి" అని సమంత వివరించారు.

ప్రస్తుతం సమంత నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం విడుదలైన వారం రోజులు కూడా కాకముందే ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More