OTT Movies: ఓటీటీలోకి నిన్న రిలీజైన సమంత మా ఇంటి బంగారం, వడ్డే నవీన్ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Maa Inti Bangaram And Transfer Trimurthulu OTT Streaming: ఓటీటీలోకి నిన్న థియేటర్లలో విడుదలైన సమంత మా ఇంటి బంగారం, హీరో వడ్డే నవీన్ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు స్ట్రీమింగ్ అవనున్నాయనే టాక్ జోరుగా సాగుతోంది. డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కిన ఈ రెండు సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Maa Inti Bangaram And Transfer Trimurthulu OTT Release Platforms: ఎప్పుడు కొత్త సినిమా ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తుంటారు డిజిటల్ స్ట్రీమింగ్ ఆడియెన్స్. అలాగే, థియేటర్లలో విడుదలైన వెంటనే ఆ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, స్ట్రీమింగ్ డేట్ తెలుసుకోవాలనే కుతుహలంతో తెగ ఉంటారు.

ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్‌పై
ఈ క్రమంలోనే నిన్న అంటే జూన్ 19న థియేటర్లలో విడుదలైన రెండు సినిమాల ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్‌పై క్యూరియాసిటీ నెలకొంది. ఆ సినిమాలే సమంత రూత్ ప్రభు నటించిన మా ఇంటి బంగారం, సీనియర్ హీరో వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ ఇచ్చిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు.
సమంత నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రమే మా ఇంటి బంగారం. ఇందులో సమంత మెయిన్ లీడ్ రోల్ చేయగా గుల్షన్ దేవయ్య, యాంకర్లు శ్రీముఖి, మంజూష, శ్రీనివాస్ గవిరెడ్డి, సీనియర్ హీరోయిన్ గౌతమి, లక్ష్మీ, దిగంత్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
మా ఇంటి బంగారం ఓటీటీ స్ట్రీమింగ్
సమంత భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించగా.. ఆయన హిమాంక్ దువ్వూరుతో కలిసి మా ఇంటి బంగారం మూవీని నిర్మించారు. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి అంచనాలతో జూన్ 19న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది.
సమంత యాక్షన్ సీన్స్, ఎమోషనల్, డ్రామా బాగా వర్కౌట్ అయ్యాయని కామెంట్స వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మా ఇంటి బంగారం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ప్రముఖ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ మా ఇంటి బంగారం ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
అంటే, జియో హాట్‌స్టార్‌లో మా ఇంటి బంగారం ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తి అయిన సుమారు 4 నుంచి 6 వారాల తర్వాత జియో హాట్‌స్టార్‌లో మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అలాగే, మా ఇంటి బంగారం శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుందని టాక్.
ఇక సమంత సినిమాతో పాటు నిన్న విడుదలైన మరో మూవీ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. సీనియర్ హీరో వడ్డే నవీన్ చాలా కాలం గ్యాప్ తర్వాత కథానాయకుడుగా కమ్‌బ్యాక్ ఇచ్చిన సినిమా ఇది. తెలుగు పొలిటికల్ యాక్షన్ కామెడీ చిత్రంగా ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మూవీ తెరకెక్కింది.
20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ
కమల్ తేజ నర్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వడ్డే నవీన్‌కు జోడీగా గ్లామరస్ బ్యూటీ రాశీ సింగ్ హీరోయిన్‌గా చేసింది. ఆడుకాలం నరేన్, శిల్పా తులస్కర్, రఘు బాబు, బాబా భాస్కర్, దేవీ ప్రసాద్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అంతేకాకుండా వడ్డే నవీన్ నిర్మాతగా మారి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.
దాదాపు 20 ఏళ్ల తర్వాత వడ్డే నవీన్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా కావడంతో ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులుపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ, మూవీకి మాత్రం నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. స్టోరీ చాలా బాగున్నా టేకింగ్ పరమ రొటీన్, అనవసరపు ఫైట్స్, సాంగ్స్‌తో నింపేశారని పలువురు రివ్యూలు ఇచ్చారు.
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఓటీటీ రిలీజ్
ఈ క్రమంలోనే ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఆసక్తి నెలకొంది. జీ5 ఓటీటీ సంస్థ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన జీ5లో ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
సమంత మూవీలాగే నెల రోజులు లేదా అంతకు ముందు, తర్వాత ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. బాక్సాఫీస్ కలెక్షన్స్, మౌత్ టాక్‌ను బట్టి ఈ రెండు సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్స్ మారే ఛాన్స్ ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


