Hotstar OTT: జియో హాట్‌స్టార్‌లో టాప్ 5 ఓటీటీ మలయాళ థ్రిల్లర్స్- ఒక్కోటి ఒక్కోరకం, ట్విస్టులతో మైండ్ బ్లాక్- తెలుగులో!

Must Watch Top 5 Jio Hotstar OTT Malayalam Thrillers In Telugu: జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఎక్కువగా మలయాళ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో ఒక్కోటి ఒక్కో రకంగా మైండ్ బ్లాక్ ట్విస్టులతో సాగే మస్ట్ వాచ్ టాప్ 5 మలయాళ థ్రిల్లర్స్ ఉన్నాయి. తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు చూద్దాం.

Published on: Jun 20, 2026, 06:07:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Must Watch Top 5 Jio Hotstar OTT Malayalam Thrillers In Telugu: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి సరికొత్త కథాంశాలతో, మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి.

జియో హాట్‌స్టార్‌లో టాప్ 5 ఓటీటీ మలయాళ థ్రిల్లర్స్- ఒక్కోటి ఒక్కోరకం, ట్విస్టులతో మైండ్ బ్లాక్- తెలుగులో!
జియో హాట్‌స్టార్‌లో టాప్ 5 ఓటీటీ మలయాళ థ్రిల్లర్స్- ఒక్కోటి ఒక్కోరకం, ట్విస్టులతో మైండ్ బ్లాక్- తెలుగులో!

మైండ్ బ్లాక్ ట్విస్టులతో

ముఖ్యంగా జియో హాట్‌స్టార్ (Jio Hotstar / Disney+ Hotstar) ఓటీటీలో ఎక్కువగా మలయాళ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో ఎన్నో థ్రిల్లర్స్ ఉన్నాయి. అయితే, జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఒక్కోటి ఒక్కో రకంగా.. మైండ్ బ్లాక్ ట్విస్టులతో సాగే మస్ట్ వాచ్ టాప్ 5 థ్రిల్లర్స్ ఉన్నాయి.

తెలుగులోనూ స్ట్రీమింగ్

తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న మలయాళ థ్రిల్లర్ సినిమాలు, వాటి ఐఎమ్‌డీబీ రేటింగ్, స్టోరీ, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

1. సూక్ష్మదర్శిని (Sookshmadarshini)

ఐఎమ్‌డిబి రేటింగ్: 7.8/10

కథాంశం: ప్రియదర్శిని (నజ్రియా నజీమ్) అనే ఒక సాధారణ అమ్మాయి నివసించే కాలనీలోకి మాన్యువల్ (బాసిల్ జోసెఫ్) అనే యువకుడు కొత్తగా అద్దెకు వస్తాడు. అతని నడవడిక, రహస్య ప్రవర్తన చూసి ప్రియదర్శినికి అనుమానం వస్తుంది. దాంతో ఆమె అతనిపై ఒక కన్ను వేసి ఉంచుతుంది. ఈ క్రమంలో అతని గురించి ఆమెకు తెలిసిన కొన్ని భయంకరమైన నిజాలు, ఆ కాలనీ చుట్టూ ఉన్న మిస్టరీ ఏంటనేదే కథ.

ఆకట్టుకునే అంశాలు: ఇది నజ్రియా, బాసిల్ జోసెఫ్‌ల అద్భుతమైన కాంబినేషన్ సినిమా. ఇదొక డార్క్ హ్యూమర్ మిక్డ్స్ మిస్టరీ థ్రిల్లర్. స్లోగా మొదలై సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు మిమ్మల్ని మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయి.

2. తుడరుమ్ (Thudarum)

ఐఎమ్‌డిబి రేటింగ్: 7.5/10

కథాంశం: బెంజ్ అనే ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ తన కుటుంబం, తన అంబాసిడర్ కారుతో చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ, తన కుమారుడు లాకప్ డెత్ అవడం, అతని కారులోనే కొడుకు డెడ్ బాడీ తీసుకెళ్లడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ హత్యను బెంజ్ చేశాడని పోలీసులు ఇరికిస్తారు. ఆ తర్వాత ఏమైంది?, పోలీసులపై బెంజ్ ఎలా పగ తీర్చుకున్నాడు? అలాగే తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అసలు తన కొడుకు చావుకు కారణం ఏంటీ? వంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో సాగే క్రైమ్ రివేంజ్ ఫ్యామిలీ డ్రామానే తుడరుమ్.

ఆకట్టుకునే అంశాలు: ఒక సామాన్యుడి చుట్టూ అల్లిన క్రైమ్ రివేంజ్ అండ్ ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామా ఇది. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్.

3. సంభవం అధ్యాయం ఒన్ను (Sambhavam Adhyayam Onnu)

ఐఎమ్‌డిబి రేటింగ్: 7.4/10

కథాంశం: శిక్షాత్మక బదిలీ (Punishment Posting) పై ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తాడు సివిల్ పోలీస్ ఆఫీసర్ ఆనంద్. అక్కడ ఒక అపాయకరమైన రెస్క్యూ మిషన్ కోసం దట్టమైన, ఈరి (Eerie) వెల్లూర్క్కాట్ అడవిలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. అయితే ఆ అడవిలోకి వెళ్లిన తర్వాత 30 ఏళ్ల కింద మిస్ అయిన వ్యక్తులు తారసపడటం, అతీంద్రియ శక్తులు ఎదురవ్వడం వంటి వింత పరిణామాలు జరుగుతాయి. ఆనంద్ ఆ మిస్టరీని ఎలా ఛేదించాడనేదే కథ.

ఆకట్టుకునే అంశాలు: మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్, లూప్, ఫాంటసీ ఎలిమెంట్స్ కలగలిపిన సినిమా ఇది. అడవి నేపథ్యంలో సాగే సీన్స్ చూస్తున్నప్పుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాగే, లూప్ కాన్సెప్ట్, బ్రిటీషర్స్, కాకి కథ వంటి అంశాలు హుక్ అయ్యేలా చేస్తాయి.

4. డీస్ ఇరాయ్ (Diés Iraé)

ఐఎమ్‌డిబి రేటింగ్: 6.9/10

కథాంశం: రోహన్ అనే ఒక సంపన్న యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది. తన ఇంట్లోనే ఏదో ఒక అతీంద్రియ శక్తి, ఆత్మ తిరుగుతోందని అతను తీవ్రమైన భయానికి గురవుతుంటాడు. మొదట్లో అందరూ అది అతని భ్రమ అనుకున్నప్పటికీ, ఆ తర్వాత జరిగే కొన్ని వింత సంఘటనలు ఆ ఇంట్లో దాగున్న ఒక భయంకరమైన గతాన్ని, రహస్యాలను బయటకు వస్తాయి.

ఆకట్టుకునే అంశాలు: హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. సౌండ్ డిజైన్, లైటింగ్, సస్పెన్స్ అట్మాస్పియర్ సినిమా చూసే ప్రేక్షకుడికి అద్భుతమైన థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.

5. ప్రతిచ్ఛాయ (Prathichaya)

ఐఎమ్‌డిబి రేటింగ్: 5.7/10

కథాంశం: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పొలిటికల్ వారసత్వానికి, అతని కొడుకు కార్పొరేట్ వ్యాపారాల వెనుక ఉన్న చీకటి రహస్యాలకు సంబంధించిన కథ ఇది. ఒక పెద్ద స్కాండల్ బయటపడటంతో, మీడియా మేనేజ్‌మెంట్, పొలిటికల్ పవర్స్ మధ్య ఒక మైండ్ గేమ్ మొదలవుతుంది. ఆ స్కాండల్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు అనే మిస్టరీని పొలిటికల్ క్రైమ్ డ్రామాగా చూపించారు.

ఆకట్టుకునే అంశాలు: తండ్రి-కొడుకుల సెంటిమెంట్‌తో సాగే పవర్‌ఫుల్ పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డ్రామా ఇది. స్క్రీన్‌ప్లేలో వచ్చే పొలిటికల్ ఎత్తులు, పైఎత్తులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More