OTT Trending: 3 ఓటీటీల్లో ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న తెలుగు న్యూ హారర్ థ్రిల్లర్- 8.9 రేటింగ్- వణికించే విజువల్స్!
Trikala OTT Trending On 3 Platforms: ఏకంగా 3 ఓటీటీల్లో టాప్ ప్లేసుల్లో ట్రెండింగ్ అవుతోంది తెలుగు న్యూ హారర్ మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా త్రికాల. శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్ నటించిన త్రికాల ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే ట్రెండింగ్‌లోకి రావడం విశేషంగా మారింది. త్రికాల ఓటీటీ రిలీజ్ ఎక్కడో చూద్దాం.
Trikala OTT Trending On 3 Platforms: కొన్ని సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆదరణకు నోచుకోవు కానీ ఓటీటీ రిలీజ్ అయిన వెంటనే వైరల్‌గా మారతాయి. విశేష ఆదరణ సొంతం చేసుకుంటాయి. అలాంటి తెలుగు న్యూ హారర్ మైథలాజికల్ థ్రిల్లర్ సినిమానే త్రికాల. ఏ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అనేది క్యాప్షన్.

వణికించే విజువల్స్
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన మైథలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ‘త్రికాల’ సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించుకుంది. ఊహకందకుండా వణికించే విజువల్స్‌తో భయపెట్టిన త్రికాల సినిమా కంటెంట్ పరంగా బాగున్నా ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేదు.
కానీ, ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.9 రేటింగ్ (జూలై 12 నాటికి) సాధించుకుని సత్తా చాటుతోంది. అలాంటి త్రికాల ఏకంగా 3 ఓటీటీల్లో రిలీజ్ అయింది. ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే ట్రెండింగ్‌లో దూసుకుపోవడం విశేషంగా మారింది.
కర్మ సిద్ధాంతం, పునర్జన్మల వైవిధ్యం
టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ శ్రద్ధా దాస్, హీరోగా మారిన చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్, నటుడు అజయ్ ప్రధాన పాత్రలు పోషించిన త్రికాల సినిమాకు మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కేవలం డైలాగులకే పరిమితం కాకుండా కర్మ సిద్ధాంతం, గో సంరక్షణ అవసరాన్ని, పునర్జన్మల వైవిధ్యాన్ని విజువల్‌గా ఆవిష్కరించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
పౌరాణికతను ఆధునిక ప్రపంచంతో మేళవిస్తూ మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ అంశాలను సమన్వయం చేసిన దర్శకుడు మణి తెల్లగూటి ఈ సినిమాను ఒక విజువల్ వండర్‌గా మలిచారు. స్క్రిప్ట్ దశ నుంచే ప్రతి ఫ్రేమ్‌ను విజువల్‌గా డిజైన్ చేయడం ఆయన టెక్నికల్ నైపుణ్యాన్ని చాటుతోంది.
3 ఓటీటీల్లో త్రికాల
త్రికాల సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడంలో పవన్ చెన్న అందించిన డార్క్ విజువల్స్. అలాగే, షాజీద్ హ్యుమాయన్ అందించిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలాలుగా నిలిచాయి. అలాగే, విజువల్స్, వాటి క్రియేటివిటీ హారర్ థ్రిల్లర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి.
అలాంటి త్రికాల 3 ఓటీటీల్లోకి రావడమే కాకుండా టాప్ ప్లేసుల్లో ట్రెండింగ్ అవుతోంది. జూలై 9న మొదటగా సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్‌లలో త్రికాల ఓటీటీ రిలీజ్ అయింది. రిలీజ్ రోజునాడే సన్ నెక్ట్స్‌లో టాప్ 3 ప్లేసులో త్రికాల ఓటీటీ ట్రెండింగ్ అయింది.
త్రికాల ఓటీటీ ట్రెండింగ్
ఇప్పటికీ కూడా సన్ నెక్ట్స్‌తోపాటు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా త్రికాల టాప్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. అనంతరం జూలై 10న జియో హాట్‌స్టార్ ఓటీటీలోకి కూడా వచ్చేసింది త్రికాల సినిమా. ఇలా రావడంతోనే ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది తెలుగు న్యూ హారర్ థ్రిల్లర్ త్రికాల.
ప్రస్తుతం నేటికి జియో హాట్‌స్టార్‌లో తెలుగులో టాప్ 3 స్థానంలో త్రికాల ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. ఇలా రిలీజ్ అయిన 3 ఓటీటీల్లోనూ త్రికాల ట్రెండింగ్ అవడం ఆ సినిమా కంటెంట్ ఏంటో చెబుతోంది. జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్ ఈ 3 ఓటీటీలలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి 4 భాషల్లో త్రికాల అందుబాటులో ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


