OTT Horror: 3 ఓటీటీల్లో సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్- 7.1 రేటింగ్, 100 శాతం ఫ్రెష్ కంటెంట్- తెలుగులోనే స్ట్రీమింగ్!

The Call OTT Streaming On 3: 100 శాతం ఫ్రెష్ కంటెంట్, 7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో సూపర్ హిట్ సాధించిన సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా ది కాల్ మరో ఓటీటీలోకి తెలుగులో వచ్చేసింది. ఒక్క ఫోన్ కాల్‌తో నరకం అనుభవించే నలుగురు స్నేహితుల కథతో తెరకెక్కిన ది కాల్ 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Jul 11, 2026, 09:39:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Horror Thriller The Call Release: వారంతం వచ్చిందంటే చాలు ఓటీటీ ప్రియులు సరికొత్త సినిమాల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను జల్లెడ పడుతుంటారు. ముఖ్యంగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. థియేటర్లలో మిస్ అయిన విదేశీ భయానక చిత్రాలను ఓటీటీల్లో చూసేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు.

3 ఓటీటీల్లో సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్- 7.1 రేటింగ్, 100 శాతం ఫ్రెష్ కంటెంట్- తెలుగులోనే స్ట్రీమింగ్!
3 ఓటీటీల్లో సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్- 7.1 రేటింగ్, 100 శాతం ఫ్రెష్ కంటెంట్- తెలుగులోనే స్ట్రీమింగ్!

ఓటీటీలోకి ది కాల్

అలాంటి వారి కోసమే ఓ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ 3 ఓటీటీల్లోకి వచ్చేసింది. ఇదివరకే రెండింట్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమా తాజాగా నిన్న (జూలై 10) ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే ది కాల్. సౌత్ కొరియన్ సైన్స్ ఫిక్షన్, సైకలాజికల్, హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది కాల్ హాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది.

ది కాల్ సినిమా 2020లో అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల అయింది. థియేట్రికల్ రిలీజ్ అయిన నెలకు నెట్‌ఫ్లిక్స్‌లోకి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది ది కాల్ మూవీ. 2020 నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ది కాల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, అప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ది కాల్ తెలుగు భాషలో అందుబాటులో లేదు.

ఇదివరకు రెండింట్లో రిలీజ్

నెట్‌ఫ్లిక్స్ తర్వాత మరో అమెజాన్ ప్రైమ్‌లో ది కాల్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇదే ఏడాది ఏప్రిల్ 11న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది ది కాల్. అయితే, ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్, కొరియన్ ఇతర భాషలతోపాటు తెలుగులోనూ ది కాల్ అందుబాటులోకి వచ్చింది. అంటే, సుమారు 6 సంవత్సరాల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చింది ది కాల్.

ఇప్పుడు తాజాగా ఇంకో ఓటీటీలో కూడా ప్రత్యక్షమైంది ఈ వణుకు పుట్టించే ది కాల్ సినిమా. జియో హాట్‌స్టార్ ఓటీటీలో నిన్నటి (జూలై 10) నుంచి ది కాల్ ప్రసారం అవుతోంది. హాట్‌స్టార్‌లోకి కూడా తెలుగులో ది కాల్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. జియో హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగు, ఇంగ్లీష్, తమిళం, హిందీ వంటి నాలుగు భాషల్లో ది కాల్ అందుబాటులో ఉంది.

కథేంటంటే?

ఇక ది కాల్ కథ విషయానికొస్తే.. ఒక మారుమూల గ్రామంలో ఎడిత్ క్రాన్స్‌టన్ (లిన్ షేయ్) అనే వృద్ధురాలు టీచర్‌గా పనిచేసి రిటైర్ అవుతుంది. అయితే, ఆమె ఒంటరిగా జీవిస్తూ కొన్ని వింత పనులు చేస్తుండటంతో, ఆమె ఒక మాంత్రికురాలని ఆ ఊరిలోని పిల్లలు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలోనే క్రిస్, టోంకా, బ్రూనో, జాక్ అనే నలుగురు స్నేహితులు ఆమెను నిరంతరం వేధిస్తూ, మానసికంగా హింసిస్తుంటారు.

వారి తట్టుకోలేని వేధింపుల కారణంగా ఎడిత్ క్రాన్స్‌టన్ ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె మరణం తర్వాత భార్యను కోల్పోయిన భర్త (టాబిన్ బెల్) ఆ నలుగురు స్నేహితులను తన ఇంటికి పిలుస్తాడు. తన భార్య చనిపోయే ముందు ఒక వీలునామా రాసిందని, అందులో ఉన్న ఒక చిన్న సవాలును పూర్తి చేస్తే భారీగా డబ్బు ఇస్తానని ఆశ చూపుతాడు. ఆ ఆఫర్‌కు ఆకర్షితులైన ఆ నలుగురు స్నేహితులు దానికి అంగీకరిస్తారు.

ఆ ఒక్క ఫోన్ కాల్.. ఊహించని నరకం!

ఆ సవాలు ప్రకారం.. ఆ ఇంటి పై అంతస్తులో ఉన్న ఒక పాత ఫోన్ బూత్‌లోకి వెళ్లాలి. అక్కడ ఉన్న ఒక నంబర్‌కు డయల్ చేసి, అవతలి వైపు ఉన్న వ్యక్తితో దాదాపు 60 సెకన్ల పాటు (ఒక నిమిషం) కాల్ కట్ చేయకుండా మాట్లాడాలి. డబ్బు ఆశతో ఆ స్నేహితులు ఒక్కొక్కరుగా పైకి వెళ్లి ఫోన్ చేయడం ప్రారంభిస్తారు. అయితే ఆ ఫోన్ లైన్ నేరుగా నరకానికి, చనిపోయిన ఆ వృద్ధురాలి ఆత్మకు కనెక్ట్ అవుతుంది.

ఆ తర్వాత ఆ ఫోన్ మాట్లాడిన వారికి ఎలాంటి భయానక పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ 60 సెకన్ల కాలంలో వారి జీవితాలు ఎలా తలకిందులయ్యాయి? అనేదే ఈ ది కాల్ సినిమా క్లైమాక్స్. వెన్నులో వణుకు పుట్టించే సౌండ్ ఎఫెక్ట్స్, ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో సాగే ఈ చిత్రానికి రొట్టెన్ టోమాటోస్ నుంచి ఏకంగా 100 శాతం ఫ్రెష్ కంటెంట్ అని సర్టిఫికేట్ వచ్చింది.

3 ఓటీటీల్లో చూసేయొచ్చు

అలాగే, ఐఎమ్‌డీబీలో ది కాల్ సినిమాకు పదికి 7.1 రేటింగ్ ఉంది. ఇంతటి క్రేజీ హారర్ థ్రిల్లర్ ది కాల్ మూవీని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి 3 ఓటీటీల్లో ఎంచక్కా చూసేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More