OTT Telugu: మరో ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్- 9.2 రేటింగ్- 2 రోజుల్లో 3 ఓటీటీల్లోకి-ఎక్కడంటే?
Trikala OTT Streaming On 3 Platforms: టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్ నటించిన తెలుగు హారర్ థ్రిల్లర్ త్రికాల - ది స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ తాజాగా మరో ఓటీటీలోకి త్రికాల రిలీజ్ అయింది. మరి త్రికాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Trikala The Script Of God OTT Release On 3 Platforms: టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో మైథాలజీ, సూపర్ నేచురల్, సనాతన ధర్మం వంటి కాన్సెప్ట్‌లతో వచ్చే చిత్రాలకు మంచి ఆదరణ వస్తోంది. ఈ క్రమంలోనే హారర్ థ్రిల్లర్ సినిమాలకు మైథలాజికల్ టచ్ ఇస్తూ తెరకెక్కిస్తున్నారు. ఈ జోనర్‌లో కొంతమేర మేకర్స్ సక్సెస్ అవుతున్నారు.

12 రోజుల్లోనే ఓటీటీలోకి
అయితే, ఇదే కోవలో తెలుగులో మిస్టరీ ఎలిమెంట్స్, సైకలాజికల్ సస్పెన్స్, మైథలాజికల్ అంశాలతో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ చిత్రమే 'త్రికాల - ది స్క్రిప్ట్ ఆఫ్ గాడ్'. మే 28న థియేటర్లలో విడుదలైన ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ త్రికాల 12 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.
ఇదివరకే జూలై 9 నుంచి త్రికాల ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాంటిది ఇవాళ (జూలై 10) మరో ఓటీటీలోకి త్రికాల స్ట్రీమింగ్‌కు రావడం ఇప్పుడు విశేషంగా మారింది.
గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ ప్రధాన పాత్ర పోషించిన త్రికాల సినిమాకు మణి తెల్లగూటి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలతో పాటు ఎడిటర్‌గానూ వ్యవహరించడం విశేషం.
త్రికాల కథ
టాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్, సాహితి అవంచ, హీరో మాస్టర్ మహేంద్రన్, బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చక్రవర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెరిశారు.
ఇక త్రికాల సినిమా కథాంశం ఎంతో ఆసక్తికరమైన పౌరాణిక నేపథ్యంతో ప్రారంభమవుతుంది. పురాతన కాలంలో సముద్ర గర్భంలో కలిసిపోయినట్లు చెప్పే పురాణ భూభాగం 'కుమారి ఖండం' నేపథ్యంలో కథను మొదలుపెట్టారు.
అక్కడ ఉన్న శక్తివంతమైన మునులు అపారమైన దైవిక శక్తులు ఉన్న పవిత్ర గ్రంథాలను రక్షిస్తూ ఉంటారు. అయితే, ఆ రహస్యాలు గనుక దుష్టశక్తుల చేతుల్లోకి వెళ్తే సృష్టికే ప్రమాదమని భావించిన మునులు, ఒక అద్భుతమైన దైవిక ఆయుధాన్ని సృష్టిస్తారు. ఆ ఆయుధాన్ని రక్షించే బాధ్యతను 'త్రికాల వర్మ' అనే పరాక్రమవంతుడైన యోధుడికి అప్పగిస్తారు.
మాయా అండలో ఆత్మ
దుష్టశక్తులతో జరిగిన ఒక భీకర యుద్ధంలో మానవాళిని కాపాడటం కోసం త్రికాల వర్మ తన ప్రాణాలను త్యాగం చేస్తాడు. ఆ సమయంలో మునులు అతని పవిత్ర ఆత్మను ఒక రహస్యమైన 'మాయా అండం'లో భద్రపరుస్తారు.
కలియుగంలో ఎప్పుడైనా మళ్లీ చెడు శక్తులు విజృంభించినప్పుడు, వాటిని అంతమొందించడానికి త్రికాల వర్మ తిరిగి వస్తాడనే నమ్మకంతో ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ కాలగమన ప్రవచనానికి, ప్రస్తుత కాలంలో జరిగే సంఘటనలకు ఉన్న లంకె ఏంటి అనే మిస్టరీ చుట్టూ దర్శకుడు త్రికాల కథను నడిపించారు.
2 ఓటీటీల్లో త్రికాల స్ట్రీమింగ్
సినిమాలో ఎంచుకున్న పాయింట్, సనాతన ధర్మం, పునర్జన్మలు, చేతబడి వంటి అంశాలు బాగున్నప్పటికీ థియేటర్లలో ఈ చిత్రానికి అనుకున్న రేంజ్‌లో కమర్షియల్ హిట్ టాక్ రాలేదు. కానీ, ఐఎమ్‌డీబీలో మాత్రం 10కి ఏకంగా 9.2 రేటింగ్‌ను సాధించుకుంది త్రికాల సినిమా.
ఇలాంటి త్రికాల ప్రస్తుతం 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 9న అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్‌లో త్రికాల స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇప్పుడు తాజాగా శుక్రవారం (జూలై 10) నుంచి జియో హాట్‌స్టార్‌లోనూ త్రికాల ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంటే, రెండు రోజుల్లో 3 ఓటీటీల్లోకి అడుగుపెట్టింది త్రికాల సినిమా.
ఓటీటీ ట్రెండింగ్ లో
ఇలా అడుగుపెట్టగానే అలా ఓటీటీ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది త్రికాల సినిమా. 3 ఓటీటీల్లో త్రికాల ట్రెండ్ అవుతూ సత్తా చాటుతోంది. కాబట్టి, ఇలా మైథలాజికల్, సైకలాజికల్‌తోపాటు మిస్టరీ అంశాలు నచ్చేవారికి త్రికాల బెస్ట్ ఆప్షన్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


