OTT Mythology Crime Thriller: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మైథాలజీ క్రైమ్ థ్రిల్లర్- దేవుడి హత్యలు, ఆచారాలతో నలిగిపోయే పోలీస్!

OTT Mythology Crime Thriller Today: ఓటీటీలోకి ఇవాళ మైథాలజీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దేవ్‌ఖేల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆచారం అని చెప్పి దేవుడి పేరుతో హత్యలు జరుగుతుంటాయి. హంతకులను పోలీస్ ఎలా కనిపెట్టాడనే కథతో ఈ సిరీస్ తెరకెక్కింది. మరి ఈ దేవ్‌ఖేల్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jan 30, 2026, 20:19:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి వారం వారం సరికొత్త కథనాలతో సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఓటీటీ ఆడియెన్స్‌ను ఎక్కువగా ఇంప్రెస్ చేసే జోనర్లలో హారర్, క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ వంటివే ఎక్కువగా ఉంటాయి. అయితే, క్రైమ్ థ్రిల్లర్స్‌లో కథ ఎలా ఉన్నా టేకింగ్, గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ ఉంటే ప్రేక్షకుడు ఫుల్‌గా సంతృప్తి చెందుతాడు.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మైథాలజీ క్రైమ్ థ్రిల్లర్- దేవుడి హత్యలు, ఆచారాలతో నలిగిపోయే పోలీస్!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మైథాలజీ క్రైమ్ థ్రిల్లర్- దేవుడి హత్యలు, ఆచారాలతో నలిగిపోయే పోలీస్!

డిఫరెంట్ పాయింట్‌తో

అలాంటిది ఒక డిఫరెంట్ పాయింట్‌తోనే క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కితే. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓటీటీ సిరీస్. ఈ వెబ్ సిరీస్ పేరు దేవ్‌ఖేల్. అంటే దేవుడు ఆడే ఆట అని అర్థం వస్తుంది. మైథాలజీ పాయింట్‌తో క్రైమ్ థ్రిల్లర్స్ ఇప్పటివరకు బాగానే వచ్చాయి. ఆ మైథలాజీ క్రైమ్ థ్రిల్లర్‌లోనే డిఫరెంట్ పాయింట్‌తో దేవ్‌ఖేల్ చిత్రీకరించారు.

ఆచారాలతో నలిగిపోయే పోలీస్

దేవ్‌ఖేల్ ఓటీటీ సిరీస్ అంతా దేవుడు హత్యలు, గ్రామ ఆచారాలతో నలిగిపోయే పోలీస్ చుట్టూనే సాగుతుంది. ఓ ఊరిలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. పాపం చేసిన వాడిని శంకాసుర్ వచ్చి శిక్షిస్తుంటాడని గ్రామ ప్రజలు చాలా బలంగా నమ్ముతారు. అది తప్పు కాదని కూడా వారిస్తుంటారు.

శిక్ష పేరుతో హత్యలు

అయితే, శిక్ష పేరుతో వారిని హత్య చేస్తుంటారు. దేవుడి పేరుతో తప్పు చేసిన వారిని పలు విధాలుగా చంపుతుంటారు కొంతమంది. ఈ హత్యల మిస్టరీని, హంతకులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగుతారు. కానీ, మర్డర్స్ చేసే వారికంటే ఊరి ప్రజలతోనే పోలీసులకు చుక్కలు కనపడతాయి.

అమాయకపు ప్రజల్లోనే హంతకులు

ఏ ఒక్కరు కూడా పోలీసులకు సహాయం చేయరు. దేవుడు చేసే లీల అని, దేవుడే శిక్షిస్తున్నాడని, ఆచారాలను తప్పు పట్టొద్దని పోలీసులకు ఎదురు చెబుతారు. అమాయకంగా కనిపించే ఆ ప్రజల్లోనే హంతకులు ఉన్నారని పోలీసులు అనుమానించి లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు.

దేవ్‌ఖేల్ ఓటీటీ స్ట్రీమింగ్

మరి ఆ హంతకులు దొరికారా? అసలు హత్యలు ఎందుకు చేస్తున్నారు? శంకాసుర్ కథ ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే ఓటీటీలో నేటి (జనవరి 30) నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న మరాఠి వెబ్ సిరీస్ దేవ్‌ఖేల్ చూడాల్సిందే. సుమారు 25 నిమిషాల రన్‌టైమ్‌తో మొత్తం 7 ఎపిసోడ్స్‌తో దేవ్‌ఖేల్ ఓటీటీ రిలీజ్ అయింది.

జీ5 ఓటీటీలో

ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5లో దేవ్‌ఖేల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం కేవలం మరాఠి భాషలోనే దేవ్‌ఖేల్ ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చేసింది. కానీ, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ సిరీస్‌ను జీ5 ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారికి దేవ్‌ఖేల్ బెస్ట్ ఆప్షన్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More