OTT Horror: 2 ఓటీటీల్లో తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్- రక్తం ఇస్తే డబ్బు ఇచ్చే కుర్చీ- ఈ ఒక్కదాంట్లో ఫ్రీగా చూసేయండి!
The Devil's Chair OTT Streaming On 2 Platforms: తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ ది డెవిల్స్ చైర్ సినిమా 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకదాంట్లో సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు చూడగలిగితే మరోదానిలో ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగా చూసేయొచ్చు. మరి ది డెవిల్స్ చైర్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.
The Devil's Chair OTT Released In 2 Platforms: డిజిటల్ మీడియా విప్లవం తర్వాత పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు, సరికొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో వచ్చే సినిమాలకు ఓటీటీ వేదికగా మారుతోంది. థియేటర్లలో పెద్దగా ప్రచారం లేకపోయినా, ఓటీటీలోకి వచ్చిన తర్వాత వీక్షకులను ఆకట్టుకుని ట్రెండింగ్‌లోకి వెళ్లిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి.

కమెడియన్ అదిరే అభి హీరోగా
అలా 2 ఓటీటీల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ది డెవిల్స్ చైర్' (The Devil's Chair). బుల్లితెర పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న కమెడియన్ అదిరే అభి ఈ సినిమాలో హీరోగా నటించాడు.
అలాగే, అదిరే అభికి జోడీగా స్వాతి మందల్ హీరోయిన్‌గా చేసింది. గతేడాది ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ది డెవిల్స్ చైర్ సినిమాకు బాగానె రెస్పాన్స్ వచ్చింది. కానీ, ఊహించిన స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోలేకపోయింది. రక్తం ఇస్తే డబ్బులు ఇచ్చే ఓ కుర్చీ వంటి డిఫరెంట్ కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.
ది డెవిల్స్ చైర్ కథేంటంటే?
ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. విక్రమ్ (అదిరే అభి) ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అయితే అతనికి క్రికెట్ బెట్టింగ్, ఇతర జూదాలకు అలవాటు పడి పీకల్లోతు అప్పుల్లో మునిగిపోతాడు. ఈ క్రమంలోనే ఈజీ మనీ కోసం తాను పని చేసే కంపెనీకి చెందిన రూ. కోటి నిధులను కొట్టేసి బెట్టింగ్‌లో పెడతాడు.
ఈ మోసం బయటపడటంతో కంపెనీ యాజమాన్యం విక్రమ్‌ను ఉద్యోగం నుంచి తీసేయడమే కాకుండా చట్టపరమైన చర్యల కోసం పోలీస్ కేస్ పెడుతుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో, లీగల్ చిక్కుల్లో ఉన్న విక్రమ్‌ను అతని ప్రియురాలు రుధిర (స్వాతి మందల్) ఆదుకుంటుంది. అతనికి ఆశ్రయం కల్పించి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. కానీ, ఒకానొక సమయంలో రుధిర కూడా ఓపిక కోల్పోతుంది.
కుర్చీ వెనుక ఉన్న భయంకర రహస్యం
ఈ క్రమంలోనే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. రుధిర ఒకరోజు ఎంతో ఇష్టపడి ఒక పురాతన యాంటిక్ కుర్చీని (Antique Chair) కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటుంది. అయితే, ఆ కుర్చీలో ఒక దుష్టశక్తి (డెవిల్) ఆవహించి ఉంటుంది. ఓ రోజు కూరగాయలు కట్ చేస్తుంటే అనుకోకుండా విక్రమ్ రక్తం చుక్క కుర్చీపై పడుతుంది.
దాంతో ఆ కుర్చీలో దుష్ట శక్తి కూర్చుని కనిపిస్తుంది. అదే సమయంలో విక్రమ్ టేబుల్‌పై డబ్బు కూడా ఉంటుంది. ఆ డెవిల్ కేవలం విక్రమ్‌కు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇక విక్రమ్ అప్పుల బాధను, బలహీనతను ఆసరాగా చేసుకుని, కొన్ని షరతులతో అతనికి అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం ప్రారంభిస్తుంది.
ప్రియురాలిని కూడా చంపేందుకు
ఆ తర్వాత ఏమైంది చైర్‌కు విక్రమ్ ఎలా బానిస అయ్యాడు విక్రమ్‌ను ఆ కుర్చీ ఎలా లొంగదీసుకుంది ఇతరులు ఆ కుర్చీలో కూర్చుంటే ఏమవుతుంది ఆఖరికి ప్రియురాలు రుధిరను కూడా విక్రమ్ చంపేందుకు ఎందుకు రెడీ అయ్యాడు అనేదే మిగతా సినిమా కథ.
ఆహా ఓటీటీలో
ఇలా ఇంట్రెస్టింగ్ హారర్, మిస్టరీ ఎలిమెంట్స్ ఉన్న ది డెవిల్స్ చైర్ 2 ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ఆహాలో సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు మాత్రమే చూసేలా ది డెవిల్స్ చైర్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, యూట్యూబ్‌లోనూ ది డెవిల్స్ చైర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి సబ్‍స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా యూట్యూబ్‌లో ది డెవిల్స్ చైర్ సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


