OTT Family: 2840 కోట్లు రాబట్టిన యానిమేషన్ సినిమా- పిల్లలతో పాటు ఫ్యామిలీ మొత్తం చూసేలా- ఏకంగా 4 ఓటీటీల్లో స్ట్రీమింగ్!

Migration OTT Streaming On 4 Platforms: పిల్లలతో కలిసి ఫ్యామిలీ మొత్తం వీకెండ్‌లో సరదాగా చూసేందుకు ఒక అద్భుతమైన యానిమేషన్ చిత్రం మైగ్రేషన్ ఏకంగా 4 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కంఫర్ట్ జోన్ వదిలి బయటకు వస్తే జీవితం ఎంత అందంగా ఉంటుందో చెప్పే మైగ్రేషన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో చూద్దాం.

Published on: Jun 22, 2026, 19:19:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Migration OTT Streaming On 4 Platforms: యానిమేషన్ సినిమాలకు వయసుతో సంబంధం ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఒక సరికొత్త అందమైన ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లే శక్తి వీటికి ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

2840 కోట్లు రాబట్టిన యానిమేషన్ సినిమా- పిల్లలతో పాటు ఫ్యామిలీ మొత్తం చూసేలా- ఏకంగా 4 ఓటీటీల్లో స్ట్రీమింగ్!
2840 కోట్లు రాబట్టిన యానిమేషన్ సినిమా- పిల్లలతో పాటు ఫ్యామిలీ మొత్తం చూసేలా- ఏకంగా 4 ఓటీటీల్లో స్ట్రీమింగ్!

4 ఓటీటీల్లో

ప్రస్తుతం మనం చెప్పుకునే ఈ చిత్రం 4 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. వారంతంలో కుటుంబంతో కలిసి ఇంట్లోనే హాయిగా చూసేందుకు ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఈ సినిమా కథ ఒక బాతుల కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఆ కుటుంబంలో మగ బాతు (తండ్రి) కొంచెం పిరికిది. తాముంటున్న చెరువును వదిలి బయటకు వెళ్తే ప్రమాదాలు ఎదురవుతాయని, ఉన్నచోటే ప్రశాంతంగా బతకాలని భావిస్తుంది. కానీ, ఆడ బాతు (తల్లి) ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉంటాయి.

బాతు కుటుంబం కథ

తన పిల్లలు బాహ్య ప్రపంచాన్ని చూడాలని, కొత్త విషయాలు నేర్చుకోవాలని, రకరకాల జీవులను కలవాలని ఆశిస్తుంది. తండ్రి బాతు పిల్లలకు కథలు చెప్తూ బయట ప్రపంచం ఎంత భయంకరంగా ఉంటుందో వివరిస్తుంటే, తల్లి బాతు మాత్రం ప్రపంచంలోని అందాలను చూపిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది.

న్యూయార్క్ నగరంలో బాతుల ఫ్యామిలీ

ఒకరోజు వలస వెళ్తున్న (మైగ్రేషన్) వేరే బాతుల గుంపు ఈ కుటుంబం ఉన్న చెరువులో కొద్దిసేపు ఆగుతుంది. ఆ గుంపును చూసిన పిల్ల బాతులు తాము కూడా ప్రపంచాన్ని చుట్టి రావాలని పట్టుబడతాయి. మొదట్లో తండ్రి నిరాకరించినప్పటికీ, మారిన పరిస్థితుల వల్ల చివరికి భార్యాపిల్లల మాటకు తలొగ్గుతాడు. అలా ఆ కుటుంబం తన గూడు వదిలి సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధమవుతుంది.

అయితే, మొదటిసారి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ బాతుల కుటుంబం దారి తప్పి, జనసమ్మర్దంగా ఉండే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ల్యాండ్ అవుతుంది. పల్లెటూరి ప్రశాంత వాతావరణం నుంచి ఒక్కసారిగా ఆకాశహర్మ్యాలు, వాహనాలతో నిండిన నగరంలోకి రాగానే వాటికి సరికొత్త సవాళ్లు ఎదురవుతాయని సినిమా చూస్తే అర్థమవుతుంది.

జీవిత సత్యాలు చెప్పే సినిమా

ఈ కష్టాల నుంచి గట్టెక్కి ఆ కుటుంబం క్షేమంగా ఇల్లు చేరిందా? అసలు తల్లి బాతు ఆలోచన తప్పా, తండ్రి బాతు భయం నిజమా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇంతకీ ఈ సినిమా పేరు మైగ్రేషన్. ఈ చిత్రం కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా జీవితానికి పనికొచ్చే ఎన్నో మంచి విషయాలను నేర్పుతుంది.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ..

"కంఫర్ట్ జోన్ దాటి బయటకు వస్తేనే జీవితంలోని అసలైన సవాళ్లు, అందాలు ఏంటో తెలుస్తాయి" అని ఈ చిత్రం ద్వారా దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు.

పిల్లల విషయంలో తల్లిదండ్రులు మితిమీరిన రక్షణ (ఓవర్ ప్రొటెక్టివ్‌నెస్) చూపించడం వల్ల వారి ఎదుగుదల ఎలా ఆగిపోతుందో కూడా ఇందులో ప్రాక్టికల్‌గా చూపించారు.

కుటుంబం అంతా కలిసికట్టుగా ఉంటే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవచ్చనే సందేశాన్ని ఇస్తుంది. ఇదిలా ఉంటే, బాక్సాఫీస్ వద్ద కూడా మైగ్రేషన్ సినిమా సంచలనాలు సృష్టించింది. దాదాపు రూ. 680 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన మైగ్రేషన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 2840 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

ఐఎమ్‌డీబీ రేటింగ్

ఇక ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎమ్‌డీబీ (IMDb)లో మైగ్రేషన్ సినిమాకు 6.6/10 రేటింగ్ లభించింది. ప్రస్తుతం మైగ్రేషన్ 4 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, యూట్యూబ్‌లలో మైగ్రేషన్ ఓటీటీ రిలీజ్ అయింది.

అయితే, అమెజాన్ ప్రైమ్, జీ5, యూట్యూబ్‌లలో రెంటల్ విధానంలో మైగ్రేషన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఒక్క జియో హాట్‌స్టార్ ఓటీటీలోనే ఎలాంటి అద్దె విధానం లేకుండా సబ్‌స్క్రైబర్స్ ఉచితంగా చూసేయొచ్చు.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

జియో హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్, హిందీ వంటి రెండు భాషల్లో మాత్రమే మైగ్రేషన్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. కానీ, పిల్లలు, పెద్దలు కలిసి కుటుంబంతో ఎంచక్కా చూసే బెస్ట్ ఓటీటీ యానిమేషన్ మూవీ ఇది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More