OTT: ఓటీటీలో తెలుగు కామెడీ సిరీస్‌కు భారీ వ్యూయర్‌షిప్.. ఇక్కడ ఓటీటీ కల్చర్ అభివృద్ధి చెందలేదన్న షో రన్నర్ మహి వి రాఘవ్

Save The Tigers 3 OTT Viewership And Mahi V Raghav Comments: ఓటీటీలో తెలుగు ఫాంటసీ కామెడీ సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్ 3 దూసుకుపోతోంది. భారీ వ్యూయర్‌షిప్ సాధించిన సేవ్ ది టైగర్స్ 3పై షో రన్నర్, డైరెక్టర్ మహి వి రాఘవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలపై లుక్కేద్దాం.

Published on: Jun 22, 2026, 11:29:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Save The Tigers 3 OTT Viewership And Mahi V Raghav Comments: జూన్ 19న జియో హాట్‌స్టార్‌లో సేవ్ ది టైగ‌ర్స్ 3 ఓటీటీ రిలీజ్ అయి ప్రస్తుతం సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ స‌క్సెస్ సౌత్ సినిమాలో ఓటీటీ రంగానికి కేవలం మరో హిట్ మాత్రమే ఇవ్వలేదు.

ఓటీటీలో తెలుగు కామెడీ సిరీస్‌కు భారీ వ్యూయర్‌షిప్.. ఇక్కడ ఓటీటీ కల్చర్ అభివృద్ధి చెందలేదన్న షో రన్నర్ మహి వి రాఘవ్
ఓటీటీలో తెలుగు కామెడీ సిరీస్‌కు భారీ వ్యూయర్‌షిప్.. ఇక్కడ ఓటీటీ కల్చర్ అభివృద్ధి చెందలేదన్న షో రన్నర్ మహి వి రాఘవ్

భారీ వ్యూయర్‌షిప్

స్ట్రీమింగ్‌కు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ఓటీటీ సిరీస్ భారీ స్థాయిలో వ్యూయర్‌షిప్‌ను సాధించి.. దక్షిణ భారతంలోనే అతిపెద్ద డిజిటల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సాధారణంగా ఒక‌ సిరీస్‌కు వ‌రుస సీజ‌న్స్ వ‌స్తున్న‌ప్పుడు ఒత్తిడితో స‌క్సెస్ త‌గ్గిపోతుంది. కానీ, సేవ్ ది టైగ‌ర్స్ సిరీస్ మాత్రం ఇప్పటికే ఉన్న క్రేజ్‌ను సరిగ్గా ఉపయోగించుకుని ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై అద్భుతమైన ఫ‌లితాన్ని సాధించింది.

షో రన్నర్‌గా మరోసారి

వరుస విజయాలతో షో రన్నర్ మహి వి రాఘవ్ తన ప్రతిభను మరోసారి రుజువు చేస్తుకున్నారు. ‘సేవ్ ది టైగర్స్’ మొదటి రెండు సీజన్లు, అలాగే ‘సైతాన్‌’ వంటి థ్రిల్ల‌ర్ ప్రాజెక్టులతో ఇప్పటికే హిట్ ట్రాక్‌లో ఉన్న ఆయన వెబ్ స్పేస్‌లో హిట్ రికార్డ్‌ను కొనసాగిస్తున్నారు.

ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో

ఓ క‌థ‌ను కమర్షియల్‌గా, ఆక‌ట్టుకునేలా రూపొందించ‌టం అంత ఈజీ కాదు. కానీ, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో మహి సక్సెస్ అయ్యారు. దీంతో ఆయన లాంగ్-ఫార్మ్ స్టోరీ టెల్లింగ్‌లో దర్శకుడిగా త‌నేంటో మ‌రోసారి నిరూపించుకున్నారు.

వినోదం తగ్గించకుండా

‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’లాంటి సినిమాలు చేసిన మహి వి రాఘవ్‌కు ఒక ఫ్రాంచైజీని ఎలా స్ట్రాంగ్‌గా నడిపించాలో బాగా తెలుసు. అదే సమయంలో అసలు ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూస్‌ని ఏమాత్రం త‌గ్గించ‌కుండా రూపొందించ‌గ‌ల‌రు.

ఓటీటీ కల్చర్ అభివృద్ధి చెందలేదు

ముఖ్యంగా, అమెరికన్, కొరియన్ టీవీ లాంటి బలమైన సంప్రదాయం లేని ఈ ఫార్మాట్‌లో కొత్తదనం తీసుకురావడానికి మహి ప్రయత్నిస్తున్నారు. “ఇండియాలో టెలివిజన్ సిరీస్‌లకు మ‌న ప్రేక్ష‌కులు ఇంకా అల‌వాటు ప‌డలేదు. అందుకే మన దగ్గర ఓటీటీ కల్చర్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు” అని ఆయన ఇటీవల ఓ సంద‌ర్భంలో చెప్పారు.

రీజనల్ కంటెంట్‌ను డెవలప్

నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లడానికి ఎప్పుడూ సిద్ధ‌మే. మళ్లీ మళ్లీ చూసే పాత ఫార్ములాల‌తోనే కంటెంట్‌ను చేయ‌కుండా ప్రత్యేకమైన రీజినల్ కంటెంట్‌ను డెవలప్ చేయడంపైనే ఈ సంస్థ ఎక్కువ ఫోకస్ పెడుతోంది.

దర్శకుడు-సంగీతం

కొత్త తరహా బిజినెస్ మోడల్స్‌ను తీసుకురావడంలో కూడా ఈ టీమ్ యాక్టివ్‌గా పాల్గొంటోంది. అందుకే వీరి ప్రీమియం కంటెంట్ నేరుగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతూ మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటోంది. కాగా సేవ్ ది టైగర్స్ సీజన్ 3కి శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహించగా అజయ్ అరసాడ సంగీతం అందించారు.

2 విభిన్న లోకాలకు చెందిన కథ

సేవ్ ది టైగర్స్ 3లో ప్రియ‌ద‌ర్శి-జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌-దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం-పావ‌ని గంగిరెడ్డి జంటలుగా ప్రధాన పాత్రలు పోషించారు. వీరితోపాటు వెన్నెల కిశోర్, రోహిణి, శ్రీకాంత్ అయ్యర్ త‌దిత‌రులు ఇతర పాత్రల్లో మెప్పించారు. రెండు విభిన్న లోకాలకు చెందిన ముగ్గురు స్నేహితులు స్వాప్ అయి ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నదే సేవ్ ది టైగర్స్ సీజన్ 3 కథ.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More