OTT: సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఓటీటీ ప్రీమియర్ గ్రాండ్ సక్సెస్- బిగ్ బాస్, జబర్దస్త్, సీరియల్స్, హీరో హీరోయిన్లతో సందడి!

Save The Tigers Season 3 OTT Premiere Success: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన సేవ్ ది టైగర్స్ 3 ఓటీటీ ప్రీమియర్ గ్రాండ్ సక్సెస్ అయింది. కార్తీక దీపం 2, బ్రహ్మముడి హీరోలతోపాటు బిగ్ బాస్, జబర్దస్త్ తారలు వచ్చి సందడి చేశారు.

Published on: Jun 18, 2026, 09:10:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Save The Tigers Season 3 OTT Premiere Success: సోమవారం (జూన్ 15) సాయంత్రం హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్‌లో జరిగిన తెలుగు ఓటీటీ సిరీస్ “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఈ వేడుక‌కు హాజ‌రు కాగా.. వారి న‌వ్వుల‌తో, సంద‌డితో సాయంత్రం ఆహ్లాదంగా మారింది.

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఓటీటీ ప్రీమియర్ గ్రాండ్ సక్సెస్- బిగ్ బాస్, జబర్దస్త్, సీరియల్స్, హీరో హీరోయిన్లతో సందడి!
సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఓటీటీ ప్రీమియర్ గ్రాండ్ సక్సెస్- బిగ్ బాస్, జబర్దస్త్, సీరియల్స్, హీరో హీరోయిన్లతో సందడి!

ప్రాంతీయ ఓటీటీ వినోదం

అతిథులు, సెలబ్రిటీలు, నటీనటులు, సాంకేతిక బృందం, క్రియేటర్లు.. ఇలా అంద‌రూ క‌లిసి ప్రాంతీయ ఓటీటీ వినోదంలో పెద్ద హిట్‌గా నిలిచిన సేవ్ ది టైగ‌ర్స్ ఫ్రాంచైజీలో భాగంగా వ‌చ్చిన సీజ‌న్‌3ను చూసి ఎంజాయ్ చేశారు.

తారల తళుకులతో మెరిసిన ఈ రెడ్ కార్పెట్ వేడుకకు టీవీ సీరియల్స్ నుంచి సినిమాల వరకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్లు, హై-ఫ్యాషన్‌లో సెలబ్రిటీల మెరిసే హాజరు, ఎక్స్‌క్లూజివ్ మీడియా ఇంటరాక్షన్లు, అలాగే ప్రీ స్క్రీనింగ్ గెట్-టుగెదర్స్.. ఇలా అన్నీ క‌లిసి సేవ్ ది టైగర్స్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభానికి అద్భుతమైన వేదికగా నిలిచాయి.

తారల సందడి

సేవ్ ది టైగ‌ర్స్ 3 స్పెష‌ల్ సెల‌బ్రిటీ ప్రీమియ‌ర్ వేడుక‌లో టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, బిగ్ బాస్ తెలుగు 5 విజేత వీజే సన్నీ, కల్యాణ్ పడాలా (బిగ్ బాస్ సీజన్ 9 విజేత), హీరో చైతన్య రావు, వెంకటేష్ కాకుమాను, కార్తిక్ రత్నం, ఆదిత్య మండల, శ్రీనాథ్ మాగంటి, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, కార్తీక దీపం 2 హీరో నిరుపమ్ పరిటాల, కిరీటి దామరాజు, బ్రహ్మముడి సీరియల్ హీరో మాన‌స్ స‌హా పలువురు ప్రముఖులు పాల్గొని ఓటీటీ ప్రీమియ‌ర్‌ను ఎంజాయ్ చేశారు.

ప్రియదర్శి, వెన్నెల కిషోర్, జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య, దేవియాని శర్మ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి వంటి నటీనటుల పెర్ఫామెన్స్‌ల‌కు ప్రేక్షకుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మూడు జంటల కథతో పాటు ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో వెన్నెల కిషోర్ న‌టించిన ఈ సిరీస్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది.

టైగర్స్ మళ్లీ వచ్చేశారు

సేవ్ ది టైగర్స్ సీజ‌న్‌3కి కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది. ఇది వ‌ర‌కు మేకర్స్ చెప్పినట్లుగానే, “రెండు ప్రపంచాలు ఢీకొట్టేలా చేసిన గర్జన! దీనిని దేవుడి ప్లాన్ అనాలా, లేక విధి అనాలా!… అందరి దృష్టిని ఆకర్షిస్తూ, పరిస్థితులను తలకిందులు చేస్తూ, ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందేలా టైగర్స్ మళ్లీ వచ్చేశారు.

జియో హాట్‌స్టార్‌లో జూన్ 19న సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఓటీటీ రిలీజ్ కానుంది. అంటే, అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. జూన్ 19 అర్థరాత్రి నుంచే జియో హాట్‌స్టార్‌లో సేవ్ ది టైగర్స్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

అతిపెద్ద తెలుగు ఓటీటీ సిరీస్

ఓటీటీల్లో వ్యూయ‌ర్‌షిప్ ప‌రంగా “సేవ్ ది టైగర్స్” అతిపెద్ద తెలుగు వెబ్ సిరీస్‌గా నిలిచింది. మొదటి రెండు సీజన్స్‌లోని కామెడీ, ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లు, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్నాయి.

దీంతో సీజ‌న్‌3పై ఆస‌క్తి మ‌రింత పెరిగింది. ఇప్పుడు ఈ కొత్త సీజ‌న్ స‌రికొత్త ఫ్యాంటసీ ట్విస్ట్‌తో మరింత ఉత్కంఠను పెంచేందుకు సిద్ధంగా ఉంది. కామెడీ ఫాంటసీగా తెరకెక్కిన సేవ్ ది టైగర్స్ సీజన్ 3లో ప్రియ‌ద‌ర్శి-జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌-దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం-పావ‌ని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్‌, రోహిణి త‌దిత‌రులు నటించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More