Priyadarshi: 50 ఏళ్లుగా ఎంతో సేవ చేస్తున్న కుటుంబం వారిది, ఆ నిర్మాత సాంగ్స్ బాగా రాస్తారు.. హీరో ప్రియదర్శి కామెంట్స్
Priyadarshi In Suyodhana Teaser Launch Event: వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో ప్రియదర్శి. హీరోయిన్ ద్రిషిక చందర్‌తో ప్రియదర్శి జత కట్టి నటించిన లేటెస్ట్ మూవీ సుయోధన. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సుయోధన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో ప్రియదర్శి. కోర్ట్, మిత్ర మండలి, ప్రేమంటే, సారంగపాణి జాతకం వంటి సినిమాల తర్వాత ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ సుయోధన. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా హీరోయిన్ ద్రిషిక చందర్ నటించింది.

ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వీరితోపాటు సుయోధన మూవీలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించిన సుయోధన టీజర్ ఇటీవల విడుదల అయింది. దీనికి సంబంధించిన సుయోధన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సుయోధన, దుర్యోధన అని ఎందుకు
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. "చోటా కె ప్రసాద్ అన్న ఈ కథ నా దగ్గరకు పంపారు. స్క్రిప్ట్ విన్న తర్వాత ఇందులోని ఒక పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. ఒక మనిషి సుయోధన, దుర్యోధన అని ఎందుకు పిలవబడతాడు అనేది ఆసక్తి రేపింది" అని అన్నారు.
నిర్మాత ఒక రైటర్
"ఈ మూవీ ప్రొడ్యూసర్ బోసుబాబు గారు పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌తో ఇండస్ట్రీకి రాలేదు. కేవలం తన ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఆయన సుయోధన (నిర్మాత బోసుబాబు నిడిమోలు) ఒక రైటర్. సాంగ్స్ బాగా రాస్తారు. సినిమా మీద ఆయనకున్న ఇష్టం నన్ను బాగా ఇన్స్‌పైర్ చేసింది" అని ప్రియదర్శి తెలిపాడు.
ఏకగ్రీవంగా అనుకున్న పేరు
"ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ కథలో ఉన్న సుయోధన క్యారెక్టర్ కోసం మేమంతా ఏకగ్రీవంగా అనుకున్న పేరు సాయి కుమార్ గారు. 50 ఏళ్లుగా సినిమా పరిశ్రమకు ఎంతో సేవ చేస్తున్న కుటుంబం వారిది. సాయి కుమార్ గారు తన గొప్ప టాలెంట్‌ను మాలాంటి ముందు జనరేషన్స్‌కు ఇవ్వడం సంతోషంగా ఉంది" అని ప్రియదర్శి పేర్కొన్నాడు.
హీరోయిన్ హైదరాబాద్ అమ్మాయి
"డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డితో కలిసి పనిచేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ద్రిషిక హైదరాబాద్ అమ్మాయి. ఈ మూవీలో చాలా బాగా నటించింది. ఈ నెల 27న సుయోధన మూవీ చూడండి. మీరు బాగా ఎంటర్‌టైన్ అవుతారు" అని తన స్పీచ్ ముగించాడు హీరో ప్రియదర్శి.
సంహిత క్యారెక్టర్‌లో
ఇదే ఈవెంట్‌లో హీరోయిన్ ద్రిషిక చందర్ మాట్లాడుతూ.. "ఈ సుయోధన చిత్రంలో సంహిత అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. ఈ క్యారెక్టర్‌లో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్" అని చెప్పింది.
మంచి ఆర్టిస్టులతో స్క్రీన్ షేర్
"సాయి కుమార్, ప్రియదర్శి లాంటి మంచి ఆర్టిస్టులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ మూవీ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నెల 27న థియేటర్స్‌లో మీట్ అవుదాం" అని హీరోయిన్ ద్రిషిక చందర్ వెల్లడించింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


