Poorna Daughter: రెండోసారి తల్లి అయిన పూర్ణ- పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్- అల్లా కానుక అంటూ! పాప పేరు ఏంటంటే?

Poorna Blessed With Baby Girl And Name: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పూర్ణ (షమ్నా కాసిం) రెండోసారి తల్లి అయ్యారు. శనివారం (మార్చి 14) తెల్లవారుజామున పూర్ణ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తన గారాల పట్టికి పెట్టిన పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లా కానుక అంటూ పూర్ణ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Published on: Mar 15, 2026, 15:07:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు ప్రేక్షకులకు 'పూర్ణ'గా సుపరిచితురాలైన హీరోయిన్ షమ్నా కాసిం ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పూర్ణ రెండోసారి తల్లి అయింది. శనివారం (మార్చి 14) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు పూర్ణ. ఈ సంతోషకరమైన వార్తను ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా పాపకు అప్పుడే పేరు కూడా ఖరారు చేశారు.

రెండోసారి తల్లి అయిన పూర్ణ- పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్- అల్లా కానుక అంటూ! పాప పేరు ఏంటంటే?
రెండోసారి తల్లి అయిన పూర్ణ- పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్- అల్లా కానుక అంటూ! పాప పేరు ఏంటంటే?

అల్లా ఇచ్చిన అపురూప కానుక!

శనివారం తెల్లవారుజామున 4:25 గంటలకు అంటే ఫజర్ ప్రార్థనల సమయంలో పాప పుట్టినట్లు హీరోయిన్ పూర్ణ తెలిపారు. "ఈ రోజు అల్లా నా జీవితంలో మరో అపురూపమైన కానుకను అందించారు. మాకు ఆడబిడ్డ పుట్టింది. పాప పుట్టిన వెంటనే తన చెవుల్లో అజాన్, ఇకామత్ పఠించాము" అని పూర్ణ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

తమ గారాల పట్టికి 'దువా జమీలా' అని పేరు పెట్టినట్లు పూర్ణ వెల్లడించారు. "మా కుమార్తె ఆయురారోగ్యాలతో, మంచి వ్యక్తిగా ఎదగాలని, మా కుటుంబానికి ఆశీర్వాదంగా నిలవాలని కోరుకుంటున్నాను" అని హీరోయిన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన భర్త షానిద్ ఆసిఫ్ అలీ, కుమారుడు హమ్దాన్‌తో కలిసి ఉన్న క్యూట్ ఫోటోను షేర్ చేశారు.

వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన భర్త షానిద్

పూర్ణ భర్త, దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీ కూడా ఈ సంతోషాన్ని పంచుకుంటూ అల్లాకు కృతజ్ఞతలు తెలిపారు. "ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ జరిగినందుకు సంతోషంగా ఉంది. మా కుమారుడు హమ్దాన్‌కు ఒక చిన్న చెల్లెలు తోడైంది" అని పూర్ణ భర్త షానిద్ ఆసిఫ్ అలీ పేర్కొన్నారు. అలాగే తమకు అండగా నిలిచిన వైద్య బృందానికి, ఆస్టర్ హాస్పిటల్ సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పూర్ణ సినీ ప్రస్థానం

ఇకపోతే కేరళకు చెందిన పూర్ణ 2004లో మలయాళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగులో 'శ్రీ మహాలక్ష్మి'తో ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అల్లరి నరేష్ సీమ టపాకాయ్ సినిమాలో హీరోయిన్‌గా అలరించిన పూర్ణ అవును, అవును 2, సుందరి వంటి సినిమాలతో అట్రాక్ట్ చేసింది.

చివరిగా బాలకృష్ణ మూవీలో

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం'లో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌తో అలరించిన పూర్ణ చివరగా బాలకృష్ణ 'అఖండ 2: తాండవం'లో కనిపించారు. అలాగే, తెలుగు బుల్లితెరపై పలు టీవీ షోలలో కూడా పూర్ణ న్యాయ నిర్ణేతగా కనిపించి సందడి చేశారు.

సోషల్ మీడియాలో శుభాకాంక్షలు

2022 అక్టోబర్‌లో షానిద్‌ను వివాహం చేసుకున్న పూర్ణకు 2023 ఏప్రిల్‌లో మొదటి సంతానంగా కుమారుడు హమ్దాన్ జన్మించారు. ఇప్పుడు ఆడబిడ్డ పుట్టడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ దంపతులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More