మీ ఫ్రెండ్ హిట్టు కొట్టాడు కంగ్రాట్స్ అని నాకు మెసేజ్ చేస్తున్నారు, నేను నిర్మాతగా మూవీ తీస్తున్నా: హీరో సందీప్ కిషన్
హీరోగా, నటుడిగా మెప్పిస్తూ దూసుకుపోతున్నాడు సందీప్ కిషన్. అయితే, రీసెంట్‌గా ఆది సాయి కుమార్ నటించిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ శంబాల విజయోత్సవ వేడుకకు అతిథిగా హాజరయ్యాడు సందీప్ కిషన్. ఈ ఈవెంట్‌లో సందీప్ కిషన్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన ‘శంబాల’ చిత్రం ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు.

శంబాల విజయోత్సవ వేడుక
డిసెంబర్ 25న విడుదలైన హారర్ మిస్టరీ థ్రిల్లర్ శంబాల థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ క్రమంలో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన హీరో సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ .. "‘శంబాల’ హిట్ అవ్వడంతో అందరూ నాకు ఫోన్ చేసి ‘మీ ఫ్రెండ్ హిట్టు కొట్టాడు’ కంగ్రాట్స్ అని మెసెజ్ చేస్తున్నారు. నిజాయితీగా సినిమా తీస్తే, మంచి వ్యక్తి కష్టపడి సినిమా చేస్తే హిట్ ఇస్తారని ఆడియెన్స్ మరోసారి నిరూపించారు" అని అన్నాడు.
"ఓ మూవీ సక్సెస్ అయితే అది కేవలం టీంకే చెందదు. ఆ విజయం ఇండస్ట్రీలో ఎంతో మందిలో స్పూర్తిని నింపుతుంది. నిర్మాతలైన రాజశేఖర్ గారు, మహీధర్ గారికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. దర్శకుడు యుగంధర్ ముని చాలా అద్భుతంగా ఈ మూవీని తీశారు. రాజేష్ దండా ఈ మూవీని ముందే చూసి హిట్ అని చెప్పేశారు" అని సందీప్ కిషన్ తెలిపాడు.
సంపాదించి ఇవ్వలేరు
"ఆదికి సాయి కుమార్ సంపాదించి పెట్టినంత మంచితనం ఇంకెవ్వరూ సంపాదించి ఇవ్వలేరు. ఆదికి హిట్టు వస్తే.. నాకు వచ్చినట్టే. నేను నిర్మాతగా ఆదితో ఓ మూవీని తీస్తున్నాను. నా ప్రొడక్షన్‌లో అదే బెస్ట్ మూవీగా నిలుస్తుంది" అని సందీప్ కిషన్ వెల్లడించాడు.
ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. "శంబాల సక్సెస్ మీట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అడిగిన వెంటనే వచ్చిన అల్లు అరవింద్ గారికి థాంక్స్. సినిమా చూసి మరీ ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ జర్నీలో ఇండస్ట్రీలో నుంచి ఎంతో మంది నాకెంతో సపోర్ట్ చేశారు. మా ట్రైలర్ రిలీజ్ చేయడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ అని కూడా ప్రభాస్ గారు పోస్ట్ పెట్టారు. నాకు హిట్టు పడాలని అందరూ సపోర్ట్ చేశారు" అని అన్నాడు.
"మా డైరెక్టర్ యుగంధర్ గారు ఈ మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డారు. ప్రతీ క్రెడిట్ ఆయనకే దక్కాలి. యుగంధర్ పడిన కష్టమే ఇదంతా. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మాకు సపోర్ట్ చేసిన నిర్మాతలిద్దరికీ థాంక్స్. మళ్లీ మేమంతా కలిసి ఓ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అర్చన గారికి థాంక్స్" అని ఆది సాయి కుమార్ చెప్పాడు.
కొత్త ఆదిని చూస్తారు
"‘శంబాల’లో పని చేసిన, సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్క నటుడికి థాంక్స్. శ్రీ చరణ్ పాకాల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. ‘శంబాల’ కోసం టెక్నికల్ టీం చాలా కష్టపడింది. ‘శంబాల’ని థియేటర్లోనే చూడండి. కచ్చితంగా నిరాశపడరు" అని ధీమా వ్యక్తం చేశారు ఆది సాయి కుమార్.
"మంచి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆడియెన్స్‌ని కోరుతున్నాను. మా మూవీని ఇంతలా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు, మీడియాకి థాంక్స్. ఇకపై కొత్త ఆదిని చూస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని మంచి సినిమాలు చేస్తాను" అని ఆది సాయి కుమార్ చెప్పుకొచ్చాడు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


