Sign in

500 టికెట్లు ఫ్రీగా ఇస్తా-వివాహ భోజనంబు రెస్టారెంట్లలో 20 శాతం డిస్కౌంట్: కొత్త సినిమాకు సందీప్ కిషన్ బంపరాఫర్

మూవీ లవర్స్ కు హీరో సందీప్ కిషన్ బంపరాఫర్ ఇచ్చాడు. కొత్త సినిమా పతంగ్ కోసం ఫ్రీగా 500 టికెట్లు ఇవ్వడంతో పాటు తన వివాహ భోజనంబు రెస్టారెంట్లలో 20 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు. పతంగ్ సక్సెస్ మీట్ లో సందీప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

Published on: Dec 27, 2025, 18:01:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చిన్న సినిమాలను ప్రమోట్ చేయడంలో యంగ్ హీరో సందీప్ కిషన్ ఎప్పుడూ ముందే ఉంటాడు. తాజాగా పతంగ్ మూవీని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మూవీ లవర్స్ కు సందీప్ కిషన్ ఓ బంపరాఫర్ ఇచ్చాడు. పతంగ్ సినిమా 500 టికెట్లు ఫ్రీగా ఇవ్వడంతో పాటు తన వివాహ భోజనంబు రెస్టారెంట్లలో 20 శాతం డిస్కౌంట్ ఇస్తానని చెప్పాడు.

సందీప్ కిషన్ (x)
సందీప్ కిషన్ (x)

పతంగ్ సక్సెస్ మీట్

పతంగ్ మూవీ సక్సెస్ మీట్ లో సందీప్ కిషన్ కామెంట్లు వైరల్ గా మారాయి. ఇవాళ (డిసెంబర్ 27) పతంగ్ మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. దీనికి సందీప్ కిషన్ గెస్ట్ గా వచ్చాడు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కోసం నా సైడ్ నుంచి రేపు థియేటర్లో చూసేందుకు 500 టికెట్లు ఇస్తా. ఆదిత్య మేరుగు ట్విటర్ ఐడీ ఇస్తా. అతణ్ని సంప్రదించండి. ఇది కాకుండా మొన్న శంబాలకు కూడా చెప్పా. ఇప్పుడు కూడాపతంగ్ కు అదే చెప్తున్నా. ఈ సినిమా టికెట్ తీసుకుని వెళ్తే నా వివాహ భోజనంబు రెస్టారెంట్లలో 20 శాతం డిస్కౌంట్ ఇస్తా’’ అని తెలిపాడు.

టికెట్స్ కావాలంటే

పతంగ్ సినిమా డిసెంబర్ 25న రిలీజైంది. ఇది యూత్ ఫుల్ ట్రయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఈ సినిమాను ఆదివారం (డిసెంబర్ 28) చూడాలనుకుంటే, సందీప్ కిషన్ ఇచ్చే టికెట్లు పొందాలనుకుంటే ఇలా చేయండి. సందీప్ కిషన్ తన ట్విటర్ ఐడీలో పోస్టు కూడా పెట్టాడు. అతను చెప్పినట్లుగా ఆదిత్య మేరుగును కాంటాక్ట్ కావాలి.

అబ్బాయిలను ప్రేమించే అమ్మాయి

ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనగానే ఇద్దరు అమ్మాయిలను ప్రేమించే అబ్బాయి సినిమాలే గుర్తుకొస్తాయి. కానీ పతంగ్ మూవీ మాత్రం ఇద్దరు అబ్బాయిలను ఒకేసారి ప్రేమించే అమ్మాయి కథ. ఈ సినిమాలో వంశీ పూజిత్, ప్రణవ్ కౌవిక్, ప్రీతి పగడాల, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్పీబీ చరణ్ తదితరులు నటించారు. దీనికి ప్రణీత్ పత్తిపాటి డైెరెక్టర్.

సందీప్ సినిమాలు

2025లో మజాకా అంటూ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చాడు సందీప్ కిషన్. కానీ అది అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు సందీప్ తెలుగులో వైబ్, తమిళంలో సిగ్మా సినిమాలు చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ సినిమాలపైనా ఫోకస్ చేస్తున్నాడు సందీప్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More