సంచలనం.. 1000 కోట్లు కొల్లగొట్టిన కొత్త సినిమా.. 21 రోజుల్లోనే రికార్డు.. బాక్సాఫీస్ బద్దలు
బాక్సాఫీస్ బద్దలు అనే మాట సాధారణంగా వింటుంటాం. ఈ కొత్త సినిమా విషయంలో మాత్రం అది నిజమైంది. బాక్సాఫీస్ బద్దలైంది. 21 రోజుల్లోనే రూ.1000 కోట్లు కొల్లగొట్టిన ఆ సినిమానే దురంధర్. ఈ స్పై థ్రిల్లర్ లో రణ్‌వీర్ సింగ్ హీరో.
లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ దురంధర్ హిస్టరీ తిరగరాస్తూనే ఉంది. బాక్సాఫీస్ ను బద్దలు కొడుతూ రికార్డుల మోత మోగిస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తాజాగా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది. 21 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.

దురంధర్ కలెక్షన్లు
డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఆదిత్య ధర్ దర్శకత్వంలోని దురంధర్ మూవీ బాక్సాఫీస్ ఊచకోత కొనసాగుతోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీ ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మూడవ వారం కూడా క్రిస్మస్ రోజున భారీ వసూళ్లను రాబట్టిన ఈ స్పై థ్రిల్లర్ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది.
క్రిస్మస్ రోజు
దురంధర్ మూడో వారం కూడా బాక్సాఫీస్ దగ్గర తన సత్తాచాటుతోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమాకు భారీ వసూళ్లు దక్కాయి. గురువారం ఈ సినిమా కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే నటించిన 'తు మేరీ మే తేరా మే తేరా తు మేరీ' సినిమా పోటీని సునాయాసంగా అధిగమించి రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. 21వ రోజు రూ.28.60 కోట్లు వసూలు చేసింది.
వసూళ్లు ఇళా
దురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల కలెక్షన్లు అందుకున్నట్లు ప్రొడక్షన్ హౌస్ జియో స్టూడియోస్ శుక్రవారం ప్రకటించింది. మొదటి వారంలో రూ. 218 కోట్లు, రెండవ వారంలో రూ. 261.5 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, మూడవ వారంలోకి ప్రవేశించినప్పుడు నెమ్మదిస్తుందని అనిపించింది. అయినప్పటికీ దురంధర్ 15 నుంచి 20 రోజులలో రూ. 160.70 కోట్లు, క్రిస్మస్ రోజున ఏకంగా రూ. 28.60 కోట్లు వసూలు చేసింది.
రూ.1000 కోట్లు
చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ప్రకారం దురంధర్ 21 రోజులలో 1006.7 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో రూ. 668.80 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. గ్రాస్ కలెక్షన్ల పరంగా చూస్తే ఇండియాలో రూ. 789.18 కోట్లు, విదేశాల్లో రూ.217.50 కోట్లు ఖాతాలో వేసుకుంది.
కలెక్షన్లలో యానిమల్, స్ట్రీ 2 వంటి చిత్రాలను అధిగమించిన దురంధర్ ఇప్పుడు బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, జవాన్, పఠాన్ వంటి చిత్రాల సరసన చేరింది. ఈ చిత్రం ఇప్పుడు కల్కి 2898 AD మూవీ రూ.1042.25 కోట్ల వసూళ్లను అధిగమించి ర్యాంకులలో పైకి ఎదగాల్సి ఉంది.
దురంధర్ గురించి..
దురంధర్ మూవీకి ఆదిత్య ధర్ డైరెక్టర్. ఇందులో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ తదితరులు నటించారు. దురంధర్ 2 మార్చి 19, 2026న అన్ని దక్షిణాది భాషలు, హిందీలో థియేటర్లలో విడుదల అవుతుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


