2025లో నంబర్ వన్.. కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. దురంధర్ బాక్సాఫీస్ ఊచకోత.. 21వ రోజూ కళ్లు చెదిరే కలెక్షన్లు

స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగిస్తోంది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన ఈ మూవీ 21వ రోజూ కళ్లు చెదిరే కలెక్షన్లు అందుకుంది. కొత్త సినిమాలు వచ్చినా రణ్ వీర్ సింగ్ మూవీ దూకుడు మాత్రం తగ్గడం లేదు.

Published on: Dec 26, 2025, 05:43:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాక్సాఫీస్ బరిలో కొత్త సినిమాలు దిగినా, అవతార్ 3 లాంటి పాపులర్ ఇంగ్లీష్ సినిమాలు వచ్చినా బాలీవుడ్ మూవీ దురంధర్ మాత్రం తగ్గేదే లేదంటోంది. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచిన ఈ స్పై థ్రిల్లర్ 21వ రోజూ కళ్లు చెదిరే కలెక్షన్లు అందుకుంది. గురువారం (డిసెంబర్ 25) క్రిస్మస్ సందర్భంగా కొత్త చిత్రాలు రిలీజ్ అయినా.. బాక్సాఫీస్ దగ్గర దురంధర్ దూకుడు మాత్రం తగ్గలేదు.

దురంధర్ సినిమాలో రణ్ వీర్ సింగ్
దురంధర్ సినిమాలో రణ్ వీర్ సింగ్

దురంధర్ కలెక్షన్లు

రణ్ వీర్ సింగ్ నటించిన దురంధర్ బాక్సాఫీస్ వద్ద ఆపలేని పరుగులో ఉంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూడు వారాల్లోనే భారతదేశంలో సులభంగా రూ.600 కోట్ల మార్కును అధిగమించగలిగింది. గురువారం (డిసెంబర్ 25) విడుదలైన కొత్త చిత్రాల నుంచి పోటీ ఉన్నా.. తనకు తిరుగులేదని దురంధర్ మరోసారి చాటింది. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం మరో సారి కలెక్షన్లను భారీగా పెంచుకుంది.

21వ రోజు కలెక్షన్లు

సాధారణంగా ఏ బ్లాక్ బస్టర్ సినిమా అయినా రెండు వారాల పాటు అదిరే కలెక్షన్లు అందుకుంటుంది. కానీ దురంధర్ మాత్రం మూడో వారంలోనూ సత్తాచాటుతోంది. 21వ రోజు ఏకంగా రూ.26 కోట్లు ఖాతాలో వేసుకుంది. ఇవి ఇండియాలోని నెట్ వసూళ్లు మాత్రమే. గురువారం దురంధర్ సినిమాకు రూ.26 కోట్ల కలెక్షన్లు వచ్చాయని సక్నిల్క్ తెలిపింది.

నంబర్ వన్

కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే నటించిన తు మేరీ మే తేరా మే తేరా తు మేరి రూపంలో కొత్త సినిమా రిలీజైనా దురంధర్ మాత్రం దూసుకెళ్తోంది. ఇప్పుడు ఇండియాలో ఈ సినిమా 21 రోజుల మొత్తం కలెక్షన్లు రూ.633.5 కోట్లకు చేరాయి. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీ ఇదే. ఈ చిత్రం మొదటి వారంలో రూ.207.25 కోట్లు, రెండవ వారంలో రూ.253.25 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల కలెక్షన్లకు దగ్గర్లో ఉంది.

ఈ సినిమాలు దాటి

దురంధర్ అనేక బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లను అధిగమించింది. ఇది స్త్రీ 2 (రూ.598 కోట్లు), ఛావా (రూ.601 కోట్లు) జీవితకాల ఇండియా కలెక్షన్లను దాటేసింది. దురంధర్ లో రణ్ వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజైంది. పార్ట్ 2 ఏమో 2026 మార్చి 19న రిలీజ్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More