ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు, తండ్రిగా డిస్టర్బ్ అయ్యా, నరకం నుంచి తేరుకోలేకపోయా- ఓటీటీ సిరీస్‌పై దర్శక నిర్మాత రివ్యూ

Karan Johar Review On Raakh OTT Streaming Series: భారతదేశాన్ని కుదిపేసిన గీతా, సంజయ్ చోప్రా కిడ్నాప్, హత్య ఉదంతం ఆధారంగా వచ్చిన వెబ్ సిరీస్ రాఖ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీ సిరీస్‌ను చూసిన దర్శక నిర్మాత కరణ్ జోహార్ రివ్యూ ఇచ్చారు. మరి కరణ్ రివ్యూ, రాఖ్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై లుక్కేద్దాం.

Published on: Jun 15, 2026, 11:52:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karan Johar Review On Raakh OTT Streaming Series: ఇటీవల ఓటీటీ వేదికలపై యథార్థ క్రైమ్ స్టోరీలకు ఎప్పుడూ ఆదరణ ఎక్కువే ఉంటుంది. అయితే, కొన్ని కథలు కేవలం వినోదాన్ని మాత్రమే ఇవ్వవు.. గుండెలను పిండేస్తాయి, సమాజంలోని చీకటి కోణాన్ని చూపిస్తూ భయాందోళనలకు గురిచేస్తాయి.

ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు, తండ్రిగా డిస్టర్బ్ అయ్యా, నరకం నుంచి తేరుకోలేకపోయా- ఓటీటీ సిరీస్‌పై దర్శక నిర్మాత రివ్యూ
ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు, తండ్రిగా డిస్టర్బ్ అయ్యా, నరకం నుంచి తేరుకోలేకపోయా- ఓటీటీ సిరీస్‌పై దర్శక నిర్మాత రివ్యూ

రాఖ్ ఓటీటీ స్ట్రీమింగ్

సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సరికొత్త సిరీస్ 'రాఖ్' (Raakh). మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఓటీటీ సిరీస్ చూసిన ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ అర్ధరాత్రి వేళ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకున్న తన నిర్ణయాన్ని పక్కనబెట్టి మరీ ఈ సిరీస్ గురించి సుదీర్ఘ పోస్ట్ పెట్టారు కరణ్ జోహార్. దేశ రాజధాని ఢిల్లీలో 1978లో జరిగిన గీతా చోప్రా, సంజయ్ చోప్రా అనే ఇద్దరు తోబుట్టువుల కిడ్నాప్, దారుణ హత్య ఆధారంగా ఈ షోను రూపొందించారు.

రంగా-బిల్లా అనే ఇద్దరు నేరగాళ్లు

అప్పట్లో 'రంగా-బిల్లా'లుగా పిలిచే ఇద్దరు నేరగాళ్లు సృష్టించిన ఈ దారుణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా, తల్లిదండ్రులలో పిల్లల భద్రతపై అపారమైన భయాన్ని నింపింది. యష్, రూహి అనే ఇద్దరు కవల పిల్లలకు సింగిల్ ఫాదర్‌గా ఉన్న కరణ్ జోహార్ ఈ ఓటీటీ సిరీస్ చివరి ఎపిసోడ్ చూశాక తన మనసులోని ఆవేదనను పంచుకున్నారు.

ఒక తండ్రిగా తట్టుకోలేకపోయాను

"ఇప్పుడు అర్ధరాత్రి ఒంటి గంట దాటి 35 నిమిషాలు అవుతోంది. 'రాఖ్' చివరి ఎపిసోడ్ చూసినప్పటి నుంచి నా మనసు అస్సలు బాలేదు. ఒక తండ్రిగా, ఒక మనిషిగా, ఈ సమాజంలో ఒక బాధ్యతగల పౌరుడిగా నేను తీవ్రంగా కలత చెందాను (డిస్టర్బ్). మానవత్వంలో దాగున్న అత్యంత క్రూరమైన, అసహ్యకరమైన కోణాన్ని ఈ ఓటీటీ సిరీస్ కళ్లముందుంచింది. చిన్నప్పుడు జరిగిన ఏదో ఒక చేదు అనుభవాన్ని సాకుగా చూపిస్తూ.. మనలో దాగున్న రాక్షసుడికి లొంగిపోవడాన్ని ఏ రకంగానూ సమర్థించలేం" అని కరణ్ జోహార్ పేర్కొన్నారు.

ఆ నరకం నుంచి తేరుకోలేకపోతున్నా

ఈ సిరీస్ తనపై చూపిన ప్రభావాన్ని వివరిస్తూ.. "ఈ మానసిక గాయం నుంచి నేను అంత త్వరగా కోలుకుంటానని అనుకోవడం లేదు. కానీ, దర్శకుడు ప్రోసిత్ రాయ్ కథను నడిపించిన తీరు, భావోద్వేగాలను ఎక్కడా డ్రామా చేయకుండా సహజంగా చూపించిన విధానాన్ని కచ్చితంగా అభినందించాలి. మేకింగ్ పరంగా ఇది అద్భుతమైన క్రాఫ్ట్" అని కరణ్ కొనియాడారు.

సోనాలి బింద్రే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్

తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే నటనను కరణ్ జోహార్ ప్రత్యేకంగా అభినందించారు. "నా మనసులో నుంచి అస్సలు చెరిగిపోనివి ఏవైనా ఉన్నాయంటే.. అవి సోనాలి బింద్రే, అమీర్ బషీర్ల నటన మాత్రమే. కొండంత విషాదాన్ని మోస్తున్న తల్లిదండ్రుల పాత్రల్లో వారిద్దరూ జీవించారు" అని కరణ్ జోహార్ పేర్కొన్నారు.

"ఆ బాధను, వేదనను వారు పలికించిన తీరు చూసి నేను నోరెళ్లబెట్టాను. వారు పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారు. నేను అనుభవించిన ఆ హృదయ విదారక అనుభూతిని మీరు కూడా పొందాలంటే వారి నటనను కచ్చితంగా చూడాల్సిందే. వారు అద్భుతంగా చేశారు.. శభాష్!" అంటూ ప్రశంసల జల్లు కురిపించారు కరణ్.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీకి థ్యాంక్స్

ముఖ్య పాత్ర పోషించిన అలీ ఫజల్ నటనతో పాటు ఆకాష్ మఖిజా, రమణ్‌దీప్ యాదవ్‌ల పనితీరును కూడా కరణ్ జోహార్ అభినందించారు. ఇంతటి బలమైన, ఆలోచింపజేసే ఓటీటీ సిరీస్‌ను వీక్షకులకు అందించినందుకు అమెజాన్ ప్రైమ్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సిరీస్ చూస్తున్నంతసేపు గుండె బరువెక్కుతుందని, అయినా ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరమైన కథ ఇదని బాలీవుడ్ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More