OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 18 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 6 మాత్రం మరింత ఇంట్రెస్టింగ్- ఎందుకంటే?

OTT Telugu Release Movies New: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో మరింత ఇంట్రెస్టింగ్‌గా 6 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ తదితర ఓటీటీల్లో విభిన్న జోనర్లలో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలేంటో చూద్దాం.

Published on: Jun 29, 2026, 14:03:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Telugu Release Movies New: గత వారం తెలుగు భాషలో ఏకంగా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. క్రైమ్ మిస్టరీ, హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా, కామెడీ వరకు అన్ని రకాల జోనర్లలో ఆ సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి అమెజాన్ ప్రైమ్ వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం.

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 18 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 6 మాత్రం మరింత ఇంట్రెస్టింగ్- ఎందుకంటే?
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 18 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 6 మాత్రం మరింత ఇంట్రెస్టింగ్- ఎందుకంటే?

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఇన్ ది హ్యాండ్ ఆఫ్ డంటే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూన్ 24

బ్లాస్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 25

అవతార్: ది లాస్ట్ ఎయిర్‌బెండర్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 25

లిటిల్ బ్రదర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ సినిమా)- జూన్ 26

బాహుబలి: ది టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ చిత్రం)- జూన్ 26

నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్) జూన్ 26

జియో హాట్‌స్టార్ ఓటీటీ

హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ ఫ్యామిలీ యాక్షన్ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 22

అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- జూన్ 24

ది మంకీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 25

లింగం (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

ఈటీవీ విన్ ఓటీటీ

కొత్త కొత్తగా (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూన్ 25

డియర్ కేరళ కుట్టి (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 25

ఛాయచిత్రం (తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా)- జూన్ 26

ప్రియమైన అంజలికి (తెలుగు ఫ్యామిలీ లవ్ డ్రామా ఫిల్మ్)- జూన్ 28

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

ది యెతి (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మాన్‌స్టర్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 26

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ది షీప్ డిటెక్టివ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మిస్టరీ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 24

బ్రేక్‌ఫాస్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- జూన్ 24

దూరదర్శిని (తెలుగు రూరల్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జూన్ 26

మరింత ఇంట్రెస్టింగ్‌గా 6 సినిమాలు

ఇలా గత వారం (జూన్ 22 నుంచి 28 వరకు) తెలుగులో ఏకంగా 18 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గానే ఉన్నాయి.

అయితే, తెలుగు స్ట్రయిట్ సినిమాలు కావడం వల్ల బాహుబలి: ది టార్చ్ బేరర్, దూరదర్శిని, ప్రియమైన అంజలికి, ఛాయచిత్రం, డియర్ కేరళ కుట్టి, కొత్త కొత్తగా 6 మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More