OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లోనే 30 సినిమాలు- 21 చూసేందుకు స్పెషల్, తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?

OTT Release Movies New: ఓటీటీలోకి 2 రోజుల్లోనే ఏకంగా 30 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 21 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో 11 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్ తదితర ఓటీటీల్లో హారర్, కామెడీ వంటి జోనర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాలేంటో చూద్దాం.

Published on: Jun 28, 2026, 15:50:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release Movies New: ఈ వారం 40కిపైగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కాగా వాటిలో రెండు రోజుల్లోనే ఏకంగా 30 మూవీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చాయి. ఈటీవీ విన్ నుంచి సన్ నెక్ట్స్ వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి 2 రోజుల్లోనే 30 సినిమాలు- 21 చూసేందుకు స్పెషల్, తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి 2 రోజుల్లోనే 30 సినిమాలు- 21 చూసేందుకు స్పెషల్, తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?

ఈటీవీ విన్ ఓటీటీ

కొత్త కొత్తగా (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూన్ 25

డియర్ కేరళ కుట్టి (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 25

జీ5 ఓటీటీ

ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

మమ్మట్టియాన్ స్టార్స్ (తమిళ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

ముతస్సీ (మలయాళ ఫోక్ హారర్ సూపర్‌నాచురల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

బ్లాస్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 25

అవతార్: ది లాస్ట్ ఎయిర్‌బెండర్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 25

రాజా శివాజీ (మరాఠీ హిస్టారికల్ యాక్షన్ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- జూన్ 26

క్రిస్ అండ్ మార్టినా: ది ఫైనల్ సెట్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 26

లిటిల్ బ్రదర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ సినిమా)- జూన్ 26

బాహుబలి: ది టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ చిత్రం)- జూన్ 26

ఏజెంట్ కిమ్ రియాక్టివేటెడ్ (సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్) జూన్ 26

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ది మంకీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 25

లింగం (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

లైఫ్, ల్యారీ అండ్ ది పర్స్యూట్ ఆఫ్ అన్‌హ్యాపీనెస్ (ఇంగ్లీష్ హిస్టారికల్ స్కెచ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 26

ఎఫ్ఎక్స్ ది బేర్ ఫైనల్ సీజన్ (ఇంగ్లీష్ సైకలాజికల్ వర్క్ ప్లేస్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

బ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ బ్లాక్ కామెడీ డ్రామా మూవీ)- జూన్ 26

ది యెతి (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మాన్‌స్టర్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 26

దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 26

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

క్యాంప్ స్నూపీ సీజన్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ ఫ్యామిలీ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- జూన్ 25

దూరదర్శిని (తెలుగు రూరల్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జూన్ 26

అలియన్స్ (హిందీ సోషల్ స్ట్రాటజీ రియాలిటీ సిరీస్)- జూన్ 26

సన్ నెక్ట్స్ ఓటీటీ

మూండ్రమ్ కన్ (తమిళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- జూన్ 26

రివాల్వర్ రింకో (మలయాళం రూరల్ అడ్వెంచర్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూన్ 26

మొహబ్బతీ రత్ (పంజాబీ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- చౌపల్ ఓటీటీ- జూన్ 25

కప్: లవ్ ఆల్ ప్లే (మలయాళ స్పోర్ట్స్ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూన్ 25

పర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ ఫ్యామిలీ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- జూన్ 26

కుండ్డాల పురాణం (మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- సైనా ప్లే ఓటీటీ- జూన్ 26

భలోబషర్ బరి సీజన్ 2 (బెంగాలీ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూన్ 26

ఓటీటీలోకి 30 సినిమాలు

ఇలా గురువారం (జూన్ 25), శుక్రవారం (జూన్ 26) రెండు రోజుల్లో ఏకంగా 30 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో దూరదర్శిని, బ్లాస్ట్, కొత్త కొత్తగా, డియర్ కేరళ కుట్టి, మూండ్రమ్ కన్, కుండ్డాల పురాణం, పర్ఫెక్ట్ ఫ్యామిలీ, కప్, ది యెతి, ది మంకీ, లింగం, నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో, లిటిల్ బ్రదర్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

చాలా స్పెషల్‌గా 21

వీటితోపాటు ప్రేమల కండీషన్స్ అప్లై, రాజా శివాజీ, బాహుబలి ది టార్చ్ బేరర్, ముతస్సీ, అవతార్: ది లాస్ట్ ఎయిర్‌బెండర్ 2, మమ్మట్టియాన్ స్టార్స్, దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ, ఏజెంట్ కిమ్ రియాక్టివేటెడ్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 21 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

తెలుగులో 11 ఇంట్రెస్టింగ్

వీటిలోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 11 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 8 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం అని చెప్పుకోవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More