Welcome 3 OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన ఫారెస్ట్ కామెడీ డ్రామా- 2 వేల కోట్ల ఫేక్ మూవీ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Welcome To The Jungle OTT Streaming: నిన్న థియేటర్లలో రిలీజైన కామెడీ డ్రామా మూవీ వెల్‌కమ్ టు ది జంగిల్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై బజ్ క్రియేట్ అయింది. అక్షయ్ కుమార్, దిశా పటానీ జంటగా నటించిన ఈ సినిమాలో అడవిలో ఫేక్ ఆర్మీ చిక్కుకుపోతుంది. ఇలాంటి వెల్‌కమ్ 3 ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 27, 2026, 06:00:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Welcome To The Jungle OTT Release Details: బాలీవుడ్ యాక్షన్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో, ఏకంగా 34 మంది భారీ తారాగణంతో తెరకెక్కిన క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ 'వెల్‌కమ్ టు ది జంగిల్' (వెల్‌కమ్ 3) ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేసింది. నిన్న అంటే జూన్ 25న రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఓటీటీలోకి నిన్న రిలీజైన ఫారెస్ట్ కామెడీ డ్రామా- 2 వేల కోట్ల ఫేక్ మూవీ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన ఫారెస్ట్ కామెడీ డ్రామా- 2 వేల కోట్ల ఫేక్ మూవీ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వెల్‌కమ్ 3 ఓటీటీ వివరాలు

ప్రముఖ డైరెక్టర్ అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తుండగానే, అప్పుడే వెల్‌కమ్ టు ది జంగిల్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది.

అస్సలు ఊహించని విచిత్రమైన కథాంశం

ఈ సినిమా కథాంశం వినడానికి ఎంతో ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉంటుంది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఒక బాలీవుడ్ హీరో, తన కెరీర్‌ను ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక హిట్ హీరోయిన్‌తో కలిసి సినిమా చేయాలని ప్లాన్ చేస్తాడు. ఆ సినిమాకు బడ్జెట్‌గా రూ. 2 వేల కోట్లు పెడతారు. అంటే అది 2 వేల కోట్ల ఫేక్ మూవీగా తీస్తారు.

ఈ క్రమంలో చిత్ర యూనిట్ అంతా షూటింగ్ కోసం ఒక పల్లెటూరికి వెళ్తుంది. అయితే, ఆ గ్రామస్తులు సినిమా షూటింగ్‌ను చూసి, వీరంతా నిజమైన ఆర్మీ (భారత సైన్యం) అధికారులని పొరపాటు పడతారు. తమ ఊరిని వేధిస్తున్న ఒక లోకల్ గ్యాంగ్ లీడర్ బారి నుంచి కాపాడాలంటూ ఆ నకిలీ ఆర్మీని గ్రామస్తులు ఆశ్రయిస్తారు. ఆ తర్వాత అదే అడవిలో ఈ ఆర్మీ చిక్కుకుపోతుంది. ఈ గందరగోళం నేపథ్యంలో సాగే నవ్వుల ప్రయాణమే ఈ సినిమా.

మొదటి రెండు భాగాల్లో

సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన వెల్‌కమ్ టు ది జంగిల్ సినిమాను ఫారెస్ట్ కామెడీ యాక్షన్ డ్రామా జోనర్‌లో రూపొందించారు. అయితే,'వెల్‌కమ్' మొదటి రెండు భాగాలలో 'మజ్నూ భాయ్'గా అనిల్ కపూర్, 'ఉదయ్ శెట్టి'గా నానా పటేకర్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

వారిద్దరి కామెడీ ట్రాక్ ఈ ఫ్రాంచైజీకి ప్రాణంగా నిలిచింది. కానీ, ఈ మూడో భాగంలో వారు కనిపించకపోవడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది. దీనిపై అక్షయ్ కుమార్ పిటిఐ (PTI) ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు.

వెల్‌కమ్ 4 చేస్తే

"వెల్‌కమ్ అనేది ఒక పరిపూర్ణమైన కుటుంబం. ఇది నానా పటేకర్, అనిల్ కపూర్ సర్లతో పాటు మనందరికీ చెందింది. ఒకవేళ భవిష్యత్తులో 'వెల్‌కమ్ 4' కనుక రూపకల్పన చేస్తే, కచ్చితంగా అందులో మేమంతా మళ్లీ కలిసి నటిస్తాం" అని అక్షయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా వెల్‌కమ్ టు ది జంగిల్ సినిమాలో అక్షయ్ కుమార్‌తో పాటు సునీల్ శెట్టి, పరేష్ రావల్, అర్షద్ వార్సి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ, రవీనా టాండన్ వంటి భారీ తారాగణం నటించింది. వీరంత కలిసి నటించి థియేటర్లలో నవ్వులు పూయిస్తున్న వెల్‌కమ్ 3 ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.

ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్..

తాజా నివేదికల ప్రకారం, వెల్‌కమ్ టు ది జంగిల్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషనల్ కంటెంట్, టీజర్స్ ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ అధికారిక డిజిటల్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమైంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత జియో హాట్‌స్టార్‌లో వెల్‌కమ్ 3 ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల (రెండు నెలలు) తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించే వసూళ్లు, లాంగ్ రన్‌ను బట్టి ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో వెల్‌కమ్ టు ది జంగిల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై మేకర్స్ నుంచి అధికారిక తేదీ వెల్లడి కావాల్సి ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More