రూ. 40 కోట్ల ఆఫర్‌ను కాలదన్నిన సీనియర్ హీరో.. నా పిల్లలు, అభిమానుల గౌరవం కోసం ఆ పని చేయనంటూ సునీల్ శెట్టి మాస్ రిప్లై!

భారీ పారితోషికం వస్తుందని తెలిసినా ఓ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి నిరాకరించారు బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి. తన ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు, అభిమానుల గౌరవం ముందు ఆ రూ. 40 కోట్లు చాలా చిన్నవని సునీల్ శెట్టి పేర్కొన్నారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Jan 24, 2026, 10:12:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో నటించడంపై సోషల్ మీడియాలో ఎప్పుడూ పెద్ద చర్చ జరుగుతూనే ఉంటుంది. కోట్లాది మంది అభిమానులు ఉన్న సెలబ్రిటీలు ఇటువంటి హానికరమైన అలవాట్లను ప్రోత్సహించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తుంటారు.

రూ. 40 కోట్ల ఆఫర్‌ను కాలదన్నిన సీనియర్ హీరో.. నా పిల్లలు, అభిమానుల గౌరవం కోసం ఆ పని చేయనంటూ సునీల్ శెట్టి మాస్ రిప్లై!
రూ. 40 కోట్ల ఆఫర్‌ను కాలదన్నిన సీనియర్ హీరో.. నా పిల్లలు, అభిమానుల గౌరవం కోసం ఆ పని చేయనంటూ సునీల్ శెట్టి మాస్ రిప్లై!

బాలీవుడ్ అగ్ర హీరోలు అయిన అజయ్ దేవగన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి తారలు ఇప్పటికే ఈ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే, తాజాగా హిందీ సీనియర్ హీరో సునీల్ శెట్టి ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా, ఆయనపై గౌరవాన్ని పెంచుతోంది.

ఆరోగ్యమే నా దేవాలయం!

ఇటీవల 'పీపింగ్ మూన్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సునీల్ శెట్టి తాను పొగాకు (టొబాకో) ప్రకటనలకు ఎందుకు దూరంగా ఉంటారో వివరించారు. "నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా ఆరోగ్యం. నా శరీరం సహకరించడం వల్లే చిత్ర పరిశ్రమలో సునీల్ శెట్టి అనే ఒక గుర్తింపు వచ్చింది. నా శరీరాన్ని నేను దేవాలయంగా భావిస్తాను. అలాంటప్పుడు నేనే నమ్మని విషయాన్ని ఇతరులకు ఎలా ప్రచారం చేస్తాను? అలా చేస్తే నాపై నాకే నమ్మకం పోతుంది" అని సునీల్ శెట్టి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

రూ. 40 కోట్లు వదులుకున్నా..

తనకు వచ్చిన ఒక భారీ ఆఫర్ గురించి ప్రస్తావిస్తూ.. "ఒక పొగాకు బ్రాండ్ ప్రకటన కోసం నాకు ఏకంగా రూ. 40 కోట్లు ఆఫర్ చేశారు. నా దగ్గరకు వచ్చిన వారితో.. 'నేను వీటికి లొంగుతానని మీరు నిజంగా అనుకుంటున్నారా?' అని అడిగాను" అని సునీల్ శెట్టి తెలిపారు.

"నాకు డబ్బు అవసరం ఉండవచ్చు. కానీ, నా ఆశయాలను మాత్రం వదులుకోను. నేను పొగాకును ప్రమోట్ చేస్తే నా పిల్లలైన అహన్, అతియా శెట్టి, అల్లుడు కేఎల్ రాహుల్‌ (క్రికెటర్)కు ఏమని సమాధానం చెబుతాను? నేను బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు యాక్టివ్‌గా లేకపోయినా, ఇప్పటికీ 17 నుంచి 20 ఏళ్ల యువత నన్ను ఎంతో గౌరవిస్తారు. ఆ అభిమానుల గౌరవాన్ని నేను పోగొట్టుకోలేను. ఆ డీల్ రిజెక్ట్ చేసినప్పటి నుంచి ఎవరూ నా దగ్గరకు అటువంటి ఆఫర్లతో రావడానికి సాహసించడం లేదు" అని సునీల్ శెట్టి వివరించారు.

ఇలా తన పిల్లలు, అభిమానుల కోసం పొగాకు వంటి బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయలేనని, 40 కోట్ల ఆఫర్‌నే కాలదన్నినట్లు మాస్ రిప్లై ఇచ్చినట్లు స్టార్ హీరో, నటుడు సునీల్ శెట్టి పేర్కొన్నారు. అయితే, గతంలో అక్షయ్ కుమార్ కూడా ఇలాంటి ప్రకటనలో నటించి ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. కానీ, సునీల్ శెట్టి మొదటి నుంచీ తన పద్ధతి మార్చుకోకుండా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

వరుస సినిమాలతో బిజీ

సునీల్ శెట్టి ప్రస్తుతం అక్షయ్ కుమార్, సంజయ్ దత్, అర్షద్ వార్సీ వంటి భారీ తారాగణంతో కలిసి ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ (Welcome To The Jungle) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు, మోస్ట్ అవేటెడ్ మూవీ ‘హేరా ఫేరీ 3’ (Hera Pheri 3) కోసం కూడా సునీల్ సిద్ధమవుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More