OTT Series: స్టార్ హీరో కొడుకు ఓటీటీ సిరీస్‌పై సీనియర్ నటి షాకింగ్ రివ్యూ- ఇంకాస్తా బెటర్‌గా తీయాల్సింది అంటూ!

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన తొలి ఓటీటీ సిరీస్ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. గతేడాది ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్‌పై సీనియర్ నటి ఫరీదా జలాల్ షాకింగ్ రివ్యూ ఇచ్చారు. ఆర్యన్ ఖాన్ డెబ్యూట్‌ను మెచ్చుకుంటూనే ఆ సిరీస్ ఏమనిపించిందో చెప్పారు.

Published on: Jan 22, 2026, 14:46:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ బాద్‌షా, స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నటుడిగా కాకుండా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన వెబ్ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ (The Ba***ds of Bollywood).

స్టార్ హీరో కొడుకు ఓటీటీ సిరీస్‌పై సీనియర్ నటి షాకింగ్ రివ్యూ- ఇంకాస్తా బెటర్‌గా తీయాల్సింది అంటూ!
స్టార్ హీరో కొడుకు ఓటీటీ సిరీస్‌పై సీనియర్ నటి షాకింగ్ రివ్యూ- ఇంకాస్తా బెటర్‌గా తీయాల్సింది అంటూ!

'వెల్‌కమ్ హోమ్' అంటూనే సున్నిత విమర్శలు

తాజాగా ఈ ఓటీటీ సిరీస్‌పై సీనియర్ నటి ఫరీదా జలాల్ షాకింగ్ రివ్యూ ఇచ్చారు. షారుక్ ఖాన్‌తో ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘కుచ్ కుచ్ హోతా హై’ వంటి క్లాసిక్ సినిమాల్లో నటించి, ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉన్న ఫరీదా జలాల్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆర్యన్ ఖాన్ డెబ్యూట్‌పై మాట్లాడారు. "సినిమా పరిశ్రమలోకి ఆర్యన్‌కు స్వాగతం. అతను ఇక్కడి వాడే, ఇంకా ఎక్కడికి వెళ్తాడు?" అంటూ ఆత్మీయంగా స్పందించారు ఫరీదా జలాల్.

అయితే, ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ సిరీస్ ఎలా ఉందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. "నేను సిరీస్ చూశాను. బాగుంది. కానీ, అతను ఇంకా మెరుగ్గా (బెటర్‌గా) తీసి ఉండొచ్చని నాకు అనిపించింది. ఓవరాల్‌గా ఇదొక మంచి ప్రయత్నం" అని ఫరీదా జలాల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఆర్యన్ ఖాతాలో అరుదైన రికార్డు

షారూఖ్‌లో ఉన్న టాలెంట్ ఆర్యన్ ఖాన్‌లో కూడా పుష్కలంగా ఉందని, తన తర్వాతి ప్రాజెక్టులతో ఆ విషయాన్ని నిరూపించుకుంటాడని ఆశిస్తున్నట్లు సీనియర్ నటి ఫరీదా జలాల్ పేర్కొన్నారు. కాగా, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని అధికార దాహం, బయటి వ్యక్తులు ఇక్కడ నిలదొక్కుకోవడానికి పడే కష్టాల నేపథ్యంలో ‘సెటైరికల్ కామెడీ’గా ఈ ఓటీటీ సిరీస్ రూపొందింది.

ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ వెబ్ సిరీస్‌లో లక్ష్య, రాఘవ్ జుయల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా 2025లో ఐఎమ్‌డీబీలో 'మోస్ట్ పాపులర్ ఇండియన్ సిరీస్'గా కూడా ఇది నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు భాషలో కూడా ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

బిజీగా ఉన్న ఫరీదా జలాల్

గతేడాది డిసెంబర్‌లో ‘ది గ్రేట్ శంసుద్దీన్ ఫ్యామిలీ’ ఓటీటీ వెబ్ ఫిల్మ్‌తో అలరించిన ఫరీదా జలాల్ త్వరలో వెండితెరపై కనిపించనున్నారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘ఓ రోమియో’ (O Romeo) చిత్రంలో ఫరీదా కీలక పాత్ర పోషించారు.

ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ సిరీస్‌పై ఫరీదా జలాల్ రివ్యూ
ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ సిరీస్‌పై ఫరీదా జలాల్ రివ్యూ

ఓ రోమియో సినిమాలో షాహిద్ కపూర్‌తో పాటు తృప్తి దిమ్రి, దిశా పటానీ, నానా పటేకర్, తమన్నా భాటియా, విక్రాంత్ మాస్సే వంటి స్టార్స్ నటించారు. ఓ రోమియో మూవీ ఫిబ్రవరి 13న వాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలోకి రానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More