ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ ఓటీటీ రివ్యూ- తెల్లారితే 3 హత్యలు, ఇద్దరు ఏసీపీలు- బలమైన కథనంతో క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్’. కేస్ 1 త్రీ హెడ్స్ టైటిల్‌తో వచ్చిన ఈ సిరీస్ 20 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మరి ఈ ఆహా ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందో నేటి ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ రివ్యూలో తెలుసుకుందాం.
తెలుగు ఓటీటీ రంగంలో వైవిధ్యమైన కంటెంట్‌తో దూసుకుపోతున్న ‘ఆహా’ నుంచి వచ్చిన తాజా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్’. ఈ ఓటీటీ సిరీస్‌లోని మొదటి కేసు 'త్రీ హెడ్స్ కేసు' (Three Heads Case) ఇప్పుడు ముగింపుకు చేరుకుంది. 20 ఎపిసోడ్‌ల పాటు సాగిన ఈ సుదీర్ఘ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందో ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దసరా నవ రాత్రులు జరుగుతుంటాయి. ఆ సమయంలో ఆ స్టేషన్‌కు కావాలని పోస్టింగ్ వేయించుకుని ఏసీపీగా వస్తాడు వెట్రి మారన్ (అశ్విన్ కుమార్). అతను చాలా స్ట్రిక్ట్ అని, అవినీతి అంటే పడదని గొప్ప పేరు ఉంటుంది. అదే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేసే మాసాని (పద్మినీ కుమార్) అమ్మవారి భక్తురాలు.
ఈ క్రమంలో తెల్లారితే మూడు హత్యలు జరుగుతాయని పోలీసులకు తెలుస్తుంది. ఆ హత్యలు ఎవరివి?, అవి ఎవరు? ఎందుకు చేశారు? అసలు పోలీసులకు హత్యలు జరుగుతాయని ఎలా తెలిసింది? ఈ కేసును సాల్వ్ చేసేందుకు ఇద్దరు ఏసీపీలు ఎందుకు నియామకం అయ్యారు? ఈ కేసులో ఎవరెవరిని అనుమానించారు? బయటపడిన నిజాలు ఏంటీ? మరి కేసును చేధించారా? అనేది తెలియాలంటే ఈ ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను చూడాల్సిందే.
విశ్లేషణ:
హత్యలు జరిగాక కేసు సాల్వ్ చేయడం అనేది రెగ్యులర్ స్టోరీనే. కానీ, ఏకంగా మూడు హత్యలు జరగబోతున్నాయని ముందే పోలీసులకు తెలిసి వాటిని చేధించే దిశగా సాగే స్టోరీతో వచ్చిన సినిమాలు, ఓటీటీ సిరీస్‌లు చాలా అరుదు. బలమైన కథనం ఉంటే ఎప్పటికీ సక్సెస్ సాధిస్తాయని మరోసారి నిరూపించిన సిరీస్ ఇది.
గతేడాది డిసెంబర్ 5 నుంచి ఒక్కో ఎపిసోడ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ తాజాగా 20వ ఎపిసోడ్‌తో కేస్ 1 సాల్వ్ అయింది. కేస్ 1 త్రీ హెడ్స్ టైటిల్‌తో ఓటీటీ రిలీజ్ అయిన ఈ ధూల్‌పేట పోలీస్ స్టేషన్ సిరీస్ ఆద్యంతం గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్‌గా సాగుతుంది.
కథనం, మేకింగ్
ఈ సిరీస్‌లోని ప్రధాన బలం దాని కథనం. ఒక సంక్లిష్టమైన కేసును పోలీసులు ఛేదించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను చాలా సహజంగా చూపించారు. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగుతూ, తదుపరి ఏం జరుగుతుందో అన్న ఆసక్తిని కలిగించడంలో దర్శకుడు విజయం సాధించారు. కథా గమనం, ఎక్కడా పట్టు కోల్పోకుండా పక్కాగా సాగడం వల్ల ఇది ఒక పర్ఫెక్ట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు.
నటీనటుల ప్రతిభ
3 హత్యలను చేధించేందుకు ఇద్దరు ఏసీపీలు నియామకం కావడం అనేది డిఫరెంట్ పాయింట్. అది చాలా బాగా చూపించారు. ఈ ఏసీపీ పాత్రల్లో నటించిన అశ్విన్ కుమార్, గురు లక్ష్మణ్ పోలీసు అధికారుల పాత్రల్లో ఒదిగిపోయారు. కేసును ఛేదించే క్రమంలో వారు చూపించిన హావాభావాలు, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తాయి.
అలాగే, కానిస్టేబుల్‌గా చేసిన పద్మినీ కుమార్ అద్భుతమైన నటనతో సిరీస్‌కు ఎమోషనల్ డెప్త్‌ను తీసుకొచ్చారు. ఆమె పాత్ర పండించిన భావోద్వేగాలు కథలో కీలకం అవుతాయి.
బోర్ కొట్టకుండా
కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ ఓటీటీ సిరీస్ మరోసారి నిరూపించింది. కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్‌గా మాత్రమే కాకుండా, లోతైన ఇన్వెస్టిగేషన్, పాత్రల మధ్య సంఘర్షణ, రాజకీయాలు, పగ ప్రతికారం వంటి అంశాలను అద్భుతంగా ఆవిష్కరించారు. 20 ఎపిసోడ్స్‌తో లాంగ్ ఫార్మాట్‌లో వచ్చినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ మొదటి కేసును ముగించడం బాగుంది.
డైరెక్టర్ జె జస్విన్ టేకింగ్, బ్రహ్మ జీ దేవ్ కథనం బాగా ఆకట్టునేలా ఉన్నాయి. అశ్వత్ అందించిన సంగీతం క్రైమ్ థ్రిల్లర్‌కు పర్‌ఫెక్ట్ అనేలా ఉంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
కేస్ 1 క్లోజ్.. కేస్ 2 లోడింగ్!
మొత్తం 20 ఎపిసోడ్‌ల పాటు సాగిన మొదటి కేసు అధికారికంగా ముగిసింది. అయితే ఈ కేస్ 1 తర్వాత రెండో కేస్ కూడా రానున్నట్లు క్లైమాక్స్‌లో మేకర్స్ ట్విస్ట్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఎంగేజ్ చేసే పర్‌ఫెక్ట్ ఆహా ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ కేస్ 1 త్రీ హెడ్స్‌పై లుక్కేయొచ్చు.
రేటింగ్: 2.75/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












