ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2-ఇవాళ సీజన్ 1 ఫ్రీ స్ట్రీమింగ్-ఇక్కడ చూసేయండి
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 రాబోతుంది. మరో రోజులోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సీజన్ 1లోని అన్ని ఎపిసోడ్లను ఫ్రీగా చూసే బంపరాఫర్ ఇది. మరి ఎక్కడ చూడాలో ఓ లుక్కేయండి.
2025లో ఓటీటీని షేక్ చేసిన వాటిలో ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్ ఒకటి. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొట్టింది. చూపు తిప్పుకోనివ్వమని సస్పెన్స్, ఉత్కంఠతో ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఇప్పుడు ఈ సిరీస్ సీజన్ 2 రాబోతుంది. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ కనకం సీజన్ 1లోని అన్ని ఎపిసోడ్లు ఫ్రీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

కానిస్టేబుల్ కనకం ఓటీటీ
వర్ష బొల్లమ్మ లీడ్ రోల్ ప్లే చేసిన మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 2025లో అదరగొట్టింది. ఇప్పుడు రెండో సీజన్ రాబోతుంది. జనవరి 8 నుంచి ఈటీవీ విన్ లో ఈ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ ఒరిజినల్ గా తెరకెక్కింది.
సీజన్ 1 ఫ్రీ
కానిస్టేబుల్ కనకం సీజన్ 2 ఓటీటీ రిలీజ్ సందర్భంగా సీజన్ 1ను ఫ్రీగా చూసే అవకాశాన్ని ఈటీవీ విన్ కల్పిస్తోంది. ఈ రోజు అంటే జనవరి 7 నాడు కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ సీజన్ 1లోని అన్ని ఎపిసోడ్లను ఫ్రీగా చూడొచ్చు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది ఈటీవీ విన్. ‘‘కానిస్టేబుల్ కనకం సీజన్ 2లోకి అడుగుపెట్టేముందు ఇది ఎక్కడ ప్రారంభం అయిందో అక్కడికి వెళ్లండి. ఈటీవీ విన్ లో సీజన్ 1ని ఫ్రీగా చూడండి’’ అని పోస్ట్ చేసింది.
సీజన్ 2 ట్రైలర్
కానిస్టేబుల్ కనకం సీజన్ 2 ట్రైలర్ ను ఇటీవల డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేశారు. జనవరి 8 నుంచి ఇది ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. చంద్రిక బతికే ఉందని చూపించడం ఈ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. చంద్రిక కోసం కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి సెర్చింగ్ కొనసాగిస్తూనే ఉంటుంది. సీజన్ 2లోనూ ఉత్కంఠ, థ్రిల్, సస్పెన్స్ ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
కానిస్టేబుల్ కనకం స్టోరీ
వర్ష బొల్లమ్మ, మేఘ లేఖ, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించిన మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. దీనికి దిమ్మల ప్రశాంత్ డైరెక్టర్. అడవి గుట్ట చాలా ప్రమాదకరమని, అమ్మాయిలు అటు వైపు వెళ్లొద్దని చెప్తారు. ముగ్గురు అమ్మాయిలతో పాటు కనకం ఫ్రెండ్ చంద్రిక కూడా మిస్ అవుతుంది. తన ఫ్రెండ్ ను వెతికే క్రమంలో ఓ సీక్రెట్ బయటపెడుతుంది కనకం.
కానీ చంద్రిక ఆచూకీ మాత్రం దొరకదు. మిగతా ముగ్గురు అమ్మాయిలు చనిపోతారు. మరి చంద్రికకు ఏమైంది? ఎక్కడికి వెళ్లింది? అనే సస్పెన్స్ తో కానిస్టేబుల్ కనకం సీజన్ 1 ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


