చంద్రిక బతికే ఉంది- కనకం సెర్చింగ్- ఓటీటీలోకి వస్తున్న మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2- ట్రైలర్ రిలీజ్

గతేడాది ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మిస్టరీ క్రైమ్, హారర్ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో సీజన్ రాబోతుంది. ఈ రెండో సీజన్ ట్రైలర్ ఇవాళ రిలీజైంది. చంద్రిక బతికే ఉందని కనకం చెప్పడం హైలైట్ గా నిలిచింది. 

Published on: Jan 3, 2026, 21:53:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ తెలుగు సూపర్ హిట్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. 2025లో ఈటీవీ విన్ లోకి వచ్చిన ఈ మిస్టరీ క్రైమ్ హారర్ థ్రిల్లర్ అదరగొట్టింది. అనూహ్యమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ సీజన్ 1లో థ్రిల్ ఆడియన్స్ ను ఊపేసింది. ఇప్పుడు ఈ సిరీస్ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వచ్చేస్తోంది. ఇవాళ (జనవరి 3) ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2 (youtube)
ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2 (youtube)

కానిస్టేబుల్ కనకం సీజన్ 2

తెలుగు మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వచ్చేస్తోంది. జనవరి 8 నుంచి ఈటీవీ విన్ లో ఈ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ ను శనివారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో చంద్రిక బతికే ఉందని కనకం చెప్పడం హైలైట్ గా నిలిచింది. సీజన్ 2లోనూ అదే ఉత్కంఠ, సస్సెన్స్, థ్రిల్ కొనసాగించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

చంద్రిక బతికే ఉందని

కానిస్టేబుల్ కనకం సీజన్ 1లో కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి ఫ్రెండ్ చంద్రిక మిస్ అవుతుంది. కనిపించకుండా పోయిన మరో ముగ్గురు అమ్మాయిలు చనిపోయారని తెలుస్తుంది. కానీ చంద్రిక జాడ మాత్రం తెలియదు. ఇప్పుడు సీజన్ 2లో చంద్రిక కోసం కనకం సెర్చింగ్ కొనసాగిస్తోంది. ట్రైలర్ స్టార్టింగ్ లోనే చంద్రిక ఫైల్ సీపీ ఆఫీస్ కు వెళ్లిందని హెడ్ కానిస్టేబుల్ (రాజీవ్ కనకాల) చెప్తాడు.

సస్పెన్స్

చంద్రిక ఆచూకీ కోసం కనకం ఎంక్వైరీ కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో చంద్రిక డ్రైవర్ సతీష్ పై, ప్రెసిడెంట్ పై, తల్లిదండ్రులపై అనుమానం వస్తుంది. కానీ ట్రైలర్ మధ్యలో చంద్రిక బతికే ఉందని కనకం చెప్పడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. మరి ఇన్ని రోజులు చంద్రికకు ఏమైంది? ఎక్కడుంది? అసలు మిస్సింగ్ వెనుక ఉన్నది ఎవరు? అనేది ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు.

వర్ష బొల్లమ్మ

కానిస్టేబుల్ కనకం సిరీస్ లో టైటిల్ రోల్ లో వర్ష బొల్లమ్మ నటించింది. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, రమణ భార్గవ్ తదితరులు నటించారు. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ ప్రశాంత్ కుమార్ దిమ్మల. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించాడు. కొవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ ఈ సిరీస్ ను నిర్మించారు. మరి కానిస్టేబుల్ కనకం సీజన్ 2కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More