Hero: తండ్రిగా విఫలమయ్యాను, పిల్లల బర్త్ డేలు కూడా గుర్తుండేవి కావు, నా భార్యే పెంచి పెద్ద చేసింది: అనిల్ కపూర్ ఎమోషనల్
Anil Kapoor Emotional Comments About Parenting: బాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు అనిల్ కపూర్ తన వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పిల్లల పెంపకంలో తండ్రిగా తాను తగినంత సమయం కేటాయించలేకపోయానని, ఆ బాధ్యతనంతా భార్య సునీత ఒక్కతే మోసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Anil Kapoor Emotional Comments About Parenting: బాలీవుడ్ వెండితెరపై సూపర్ హీరోగా, ఎనర్జిటిక్ యాక్టర్‌గా మెప్పించే అనిల్ కపూర్.. నిజ జీవితంలో తండ్రిగా మాత్రం తాను ఆశించిన స్థాయిలో లేనని ఒప్పుకున్నారు. ఇటీవల లిల్లీ సింగ్ నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో అనిల్ కపూర్ మాట్లాడుతూ.. తన పిల్లలైన సోనమ్ కపూర్, హర్షవర్ధన్ కపూర్, రియా కపూర్ల పెంపకంలో తన ప్రమేయం చాలా తక్కువని తెలిపారు.
తండ్రింగా విఫలం
"నేను షూటింగులతో బిజీగా ఉండి ఇంట్లో గడిపే సమయం చాలా తక్కువ. నా గురించి పిల్లలు మంచిగా మాట్లాడుతుంటే సంతోషంగా ఉంటుంది. కానీ, నిజాయితీగా చెప్పాలంటే తండ్రిగా నేను విఫలం అయ్యాను. ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. పిల్లలతో గడపాల్సిన ఎంతో విలువైన సమయాన్ని కోల్పోయాను. ఒక రకంగా చెప్పాలంటే సునీత ఒక 'సింగిల్ పేరెంట్' తరహాలో వారిని పెంచి పెద్ద చేసింది" అని అనిల్ కపూర్ మనసులోని మాటను పంచుకున్నారు.
బర్త్ డేలు కూడా గుర్తుండేవి కావు..
పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారు ఏ క్లాసు చదువుతున్నారు? వారి పుట్టినరోజులు ఎప్పుడు? అనే కనీస విషయాలు కూడా తనకు గుర్తుండేవి కావని అనిల్ కపూర్ ఎమోషనల్‌గా చెప్పారు. "నా భార్య గుర్తు చేస్తే తప్ప పిల్లల పుట్టినరోజులు నాకు తెలిసేవి కావు. పిల్లలు అప్పుడప్పుడు నన్ను ఆటపట్టిస్తూ 'నా బర్త్ డే ఎప్పుడో తెలుసా?' అని అడిగితే నేను మౌనంగా ఉండిపోయేవాడిని. అయినప్పటికీ నా పిల్లలు ఇప్పుడు మంచి వ్యక్తులుగా, సంతోషంగా ఉన్నారంటే అది పూర్తిగా సునీత పెంపకమే" అని తన భార్యపై ప్రశంసలు కురిపించారు.
అనిల్ కపూర్ కుటుంబం.. సినిమాల ప్రయాణం
1984లో కాస్ట్యూమ్ డిజైనర్ సునీత భవ్నానీని అనిల్ కపూర్ వివాహం చేసుకున్నారు. వీరి ముగ్గురు పిల్లలు కూడా సినిమా రంగంలోనే స్థిరపడ్డారు. పెద్దమ్మాయి సోనమ్ కపూర్ 2007లో 'సావరియా'తో హీరోయిన్‌గా పరిచయం కాగా.. కొడుకు హర్షవర్ధన్ 2016లో 'మిర్జియా'తో తెరంగేట్రం చేశాడు. ఇక రెండో అమ్మాయి రియా కపూర్ నటన వైపు వెళ్లకుండా 'ఐషా' వంటి చిత్రాలతో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా తన ముద్ర వేశారు.
కెరీర్ పరంగా ఫుల్ బిజీ..
60 ఏళ్లు దాటినా నేటికీ యువ హీరోలకు పోటీనిచ్చే అనిల్ కపూర్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ అయిన 'సుబేదార్' చిత్రంలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌గా ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
రియల్ లైఫ్ పాత్రలాగే
త్వరలోనే ఆయన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా'తో పాటు, షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'కింగ్' చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే, రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన యానిమల్ సినిమాలో తండ్రి పాత్రలో అనిల్ కపూర్ మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా బీజీగా గడిపే తండ్రిగా రియల్ లైఫ్ తరహాలోనే పోషించడం గమనార్హం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


