Avatar 3 Ott: పండోరా విజువల్ వండర్ ఇప్పుడు మీ ఇంట్లోనే.. ఓటీటీలోకి అవతార్ 3.. కానీ స్ట్రీమింగ్ లో ట్విస్ట్

Avatar 3 Ott: విజువల్ వండర్ అవతార్ 3ని ఇక మీ ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ గా మారిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. 

Published on: Mar 31, 2026, 05:46:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన జేమ్స్ కామెరాన్ విజువల్ మాస్టర్‌పీస్ "అవతార్: ఫైర్ అండ్ యాష్" (Avatar: Fire and Ash) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడమే కాకుండా, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

అవతార్ 3 ఓటీటీ (x)
అవతార్ 3 ఓటీటీ (x)

అవతార్ 3 ఓటీటీ

అవతార్ 3 మూవీ ఓటీటీ రీలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ నిరీక్షణకు ఎండ్ కార్డు పడింది. ఈ విజువల్ వండర్ ఇవాళ (మార్చి 31) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ అవుతుంది. అయితే అవతార్ 3 కేవలం Digital Purchase/Rent (PVOD) పద్ధతిలో మాత్రమే అందుబాటులోకి వస్తుంది.

అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కొంత అమౌంట్ పే చేసి ఈ సినిమాను రెంట్ తీసుకుని చూడొచ్చు. మీకు సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ, ఈ పద్ధతిలో సినిమా చూడాలంటే విడిగా చెల్లించాల్సి ఉంటుంది.

జియోహాట్‌స్టార్‌లోనూ

మరి అందరూ ఎదురుచూస్తున్నట్లుగా, సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి అవతార్ ఫైర్ అండ్ యాష్ "ఫ్రీ"గా స్ట్రీమింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అనే ప్రశ్న రావడం కామన్. సమాచారం ప్రకారం, గ్లోబల్‌గా ఈ సినిమా Disney+ లో స్ట్రీమింగ్ కానుంది. మన దేశంలో మాత్రం జియోహాట్‌స్టార్‌ వేదికగా ఈ విజువల్ వండర్ అందుబాటులోకి రాబోతోంది.

అప్పుడే

సాధారణంగా డిజిటల్ రెంట్ మొదలైన 4 నుంచి 8 వారాల తర్వాతే మెయిన్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. ఆ లెక్కన చూసుకుంటే, ఏప్రిల్ నెలాఖరులో లేదా మే 2026 మొదటి వారంలో అవతార్ 3ని జియోహాట్‌స్టార్‌లో చూసే ఛాన్స్ ఉంది. అప్పుడు ఈ మూవీని తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ వీక్షించే అవకాశం ఉంది.

బాక్సాఫీస్ కలెక్షన్లు

"అవతార్ 2" మాదిరిగానే "అవతార్ 3" కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు $1.48 బిలియన్ల (సుమారు రూ.13,964 కోట్లు) వసూళ్లను సాధించి టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా, ఇటీవల జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల్లో (Oscars 2026) "Best Visual Effects" విభాగంలో అవార్డును గెలుచుకోవడం ఈ సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్‌కు నిదర్శనం. రిచర్డ్ బనేహామ్ నేతృత్వంలోని టీమ్ ఈ ఘనతను సాధించింది.

ఈసారి యుద్ధం ఎవరితో?

అవతార్ మూడో భాగంలో జేమ్స్ కామెరాన్ మనకు పండోరా గ్రహంలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేశారు. జేక్ సల్లీ, నేతిరి కుటుంబం ఈసారి అగ్నిపర్వత ప్రాంతాల్లో నివసించే 'యాష్ పీపుల్' (Ash People) అనే కొత్త తెగను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు మనం చూసిన నావి తెగలు శాంతంగా ఉంటే, ఈ 'యాష్ పీపుల్' మాత్రం చాలా అగ్రెసివ్‌గా ఉంటారు. వీరి నాయకురాలు ‘వరాంగ్’ పాత్ర ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More