Avatar 3 OTT: అవతార్ 3 ఓటీటీ డేట్ ఫిక్స్.. ఆస్కార్స్ విన్నర్.. రూ.12 వేల కోట్ల సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే?

Avatar 3 OTT: జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్ ఫైర్ అండ్ యాష్’ ఓటీటీలోకి రాబోతుంది. సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ అవతార్ 3 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై లేటేస్ట్ న్యూస్ వైరల్ గా మారింది.

Published on: Mar 25, 2026, 08:51:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన 98వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుని ఈ చిత్రం సంచలనం సృష్టించింది. ఇక అవతార్ 3 ఓటీటీ బాట పట్టనుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రంగం సిద్ధమవుతోంది.

అవతార్ 3 ఓటీటీ (AP)
అవతార్ 3 ఓటీటీ (AP)

అవతార్ 3 ఓటీటీ

సామ్ వర్తింగ్టన్, జో సల్దానా ప్రధాన పాత్రల్లో నటించిన విజువల్ వండర్ అవతార్ 3 బాక్సాఫీస్ వద్ద బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరి రికార్డులు తిరగరాస్తోంది. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ అరంగేట్రానికి సిద్ధమైంది. అవతార్ 3 సాధారణ ఓటీటీ స్ట్రీమింగ్‌ కంటే ముందుగా ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (PVOD) పద్ధతిలో విడుదల కానుంది.

ఎక్కడ చూడాలంటే?

అవతార్ 3 ఓటీటీలోకి రాబోతుంది. అయితే ముందుగా రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులోకి రానుంది. మార్చి 31, 2026న రిలీజ్ కానుంది. ఆ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో డబ్బులు చెల్లించి ఈ అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమాను చూడవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ-సేల్స్ కూడా ప్రారంభమయ్యాయి.

అందరికీ అప్పుడే

ప్రీమియం రెంటల్ పద్ధతి ముగిసిన తర్వాతే సాధారణ ఓటీటీ సబ్ స్క్రైబర్లకు అవతార్ 3 అందుబాటులోకి వస్తుంది. జూన్ 2026 నాటికి ఈ సినిమా డిస్నీ ప్లస్ లో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది. ఇండియాలో అయితే జియోహాట్ స్టార్ లో రిలీజ్ కావొచ్చు. రీజినల్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాల ఆధారంగా దీనిపై స్పష్టత రానుంది. ఇంట్లోనే కూర్చుని ఈ అద్భుత ప్రపంచాన్ని వీక్షించాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు.

అవతార్ 3 గురించి

అవతార్ 3 కథ పండోరా గ్రహం మీద ఉండే అగ్ని తెగ (యాష్ పీపుల్) చుట్టూ తిరుగుతుంది. ఈసారి జేమ్స్ కామెరూన్ నీటి ప్రపంచం నుంచి అగ్ని పర్వతాల నేపథ్యానికి ప్రేక్షకులను తీసుకెళ్లారు. గత రెండు భాగాల కంటే ఇందులో యాక్షన్, ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విజువల్ గ్రాఫిక్స్ పరంగా హాలీవుడ్ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.

బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రభంజనం

ప్రపంచవ్యాప్తంగా అవతార్ 3 కలెక్షన్లు అదిరిపోయాయి. డిసెంబర్ 19, 2025న థియేటర్లలో అవతార్ ఫైర్ అండ్ యాష్ రిలీజ్ అయింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.486 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది.

ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఏకంగా రూ.12,482 కోట్ల కలెక్షన్లను అవతార్ 3 ఖాతాలో వేసుకుంది. ఇండియాలో కూడా థియేటర్లలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. జేమ్స్ కామెరూన్ మేకింగ్ స్టైల్, అద్భుతమైన నేపథ్య సంగీతం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More