OTT: గుండె ధైర్యం ఉంటేనే చూడండి- ఇవాళ మరో ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- అటకపై దొరికిన కోతి బొమ్మతో శాపం- తెలుగులోనే!

The Monkey OTT Streaming On 2 Platforms: ఇవాళ మరో ఓటీటీలోకి వణుకుపుట్టించే హారర్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అటకపై దొరికిన కోతి బొమ్మ తీసుకొచ్చే శాపంతో సాగే ఈ సినిమా తెలుగులోనే ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ది మంకీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 25, 2026, 19:22:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Monkey OTT Release Today In Telugu: హారర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు ఒక పసందైన సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మరో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది.

గుండె ధైర్యం ఉంటేనే చూడండి- ఇవాళ మరో ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- అటకపై దొరికిన కోతి బొమ్మతో శాపం- తెలుగులోనే!
గుండె ధైర్యం ఉంటేనే చూడండి- ఇవాళ మరో ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- అటకపై దొరికిన కోతి బొమ్మతో శాపం- తెలుగులోనే!

చిన్న కథ ఆధారంగా

హాలీవుడ్ దిగ్గజ హారర్ రచయిత స్టీఫెన్ కింగ్ కలం నుంచి జాలువారిన ఒక భయంకరమైన చిన్న కథ ఆధారంగా రూపొందిన ‘ది మంకీ’ (The Monkey) ఇవాళ (జూన్ 25) మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన ఈ చిత్రం ఇప్పుడు రెండో ఓటీటీ వీక్షకులను సైతం వణికించేందుకు సిద్ధమైంది.

బాల్య జ్ఞాపకాల వెనుక దాగున్న చీకటి కోణాలను, ఒక శపించబడిన వింత వస్తువు తెచ్చే వినాశనాన్ని ఈ సినిమాలో చాలా ఉత్కంఠభరితంగా చూపించారు. అటకపై దొరికే కోతి బొమ్మ తీసుకొచ్చే శాపంతో సాగే ఈ సినిమాను గుండె ధైర్యం ఉన్న వాళ్లే చూడాల్సిందిగా మేకర్స్ డిస్‌క్లేమర్ కూడా ఇదివరకు ఇచ్చారు.

గతేడాది బెస్ట్ హారర్ చిత్రాల్లో ఒకటిగా

"బాల్య జ్ఞాపకాలతో ముడిపడిన హారర్ ఎలిమెంట్స్, అంతుచిక్కని సైకలాజికల్ డ్రామా ఈ సినిమాను గతేడాది బెస్ట్ హారర్ చిత్రాల్లో ఒకటిగా నిలిపాయి" అని అంతర్జాతీయ సినిమా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

కోతి బొమ్మ తెచ్చిన శాపం.. ఇంతకీ కథేంటంటే?

ఈ సినిమా కథ అంతా 1980లో ప్రచురితమైన స్టీఫెన్ కింగ్ కథ చుట్టూ తిరుగుతుంది. హాల్, బిల్ అనే కవల సోదరులు చిన్నతనంలో తమ ఇంటి అటకపై ఒక పాత కాలపు వింత కోతి బొమ్మను చూస్తారు. చేతుల్లో డ్రమ్స్ పట్టుకుని ఉండే ఆ బొమ్మ వారి తండ్రికి చెందింది.

అయితే, ఆ బొమ్మ దొరికినప్పటి నుంచి వారి కుటుంబంలో, చుట్టుపక్కల ఊహించని రీతిలో దారుణమైన మరణాలు సంభవిస్తాయి. దాంతో ఆ కోతి బొమ్మకు ఏదో ఒక దుష్టశక్తి శాపం ఉందని గ్రహించిన ఆ సోదరులు, దాన్ని ఎవరికీ తెలియకుండా దూరంగా పారేస్తారు. ఆ భయానక గతం నుంచి బయటపడి, కాలక్రమేణా ఇద్దరూ విడిపోయి ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోతారు.

తిరగబడే శాపం

కథ ఇక్కడే ముగిసిపోదు. కొన్నేళ్ల తర్వాత వారు పెద్దయ్యాక, ఆ పాత శాపం మళ్లీ వారి జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ వింత కోతి బొమ్మ మళ్లీ వారి ముందుకు వస్తుంది. గతం, వర్తమానం మధ్య సాగే స్క్రీన్‌ప్లే ప్రేక్షకుడిలో తీవ్రమైన ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

ఆ కోతి బొమ్మ మళ్లీ ఎందుకు వచ్చింది? ఈసారి ఆ కవల సోదరులు ఆ దుష్టశక్తిని ఎలా అడ్డుకున్నారు? ఆ కోతి బొమ్మ శాపంతో ఎవరు చనిపోయారు? ఎలా చనిపోయారు? అనే అంశాలను దర్శకుడు ఓజ్‌గూడ్ పర్కిన్స్ స్క్రీన్‌పై చాలా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మలిచారు.

భారీ తారాగణంతో వణుకు పుట్టించిన నటీనటులు

ది మంకీ చిత్రంలో హాల్, బిల్ అనే రెండు భిన్నమైన కవల పాత్రల్లో హాలీవుడ్ నటుడు థియో జేమ్స్ తన నటనతో మెప్పించారు. చిన్నప్పటి సోదరులుగా క్రిస్టియన్ కాన్వెరీ నటించగా, లోయిస్ షెల్బర్న్ పాత్రలో టాటియానా మస్లానీ కనిపించారు.

వీరితో పాటు హాలీవుడ్ ప్రముఖ నటులు ఎలిజా వుడ్, కోలిన్ ఓబ్రెయిన్, రోహన్ కాంప్‌బెల్, సారా లెవీ, ఆడమ్ స్కాట్ కీలక పాత్రలు పోషించారు. సినిమా అంతటా కొనసాగే సైకలాజికల్ టెన్షన్ హారర్ ఓటీటీ లవర్స్‌కు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

ది మంకీ ఓటీటీ స్ట్రీమింగ్

ఇలాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన హారర్ మూవీ ది మంకీ రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. అది కూడా తెలుగులోనే ది మంకీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదివరకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ది మంకీ సినిమా ప్రీమియర్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ ఓటీటీల్లో

తాజాగా ఇవాళ (జూన్ 25) జియో హాట్‌స్టార్‌లో ది మంకీ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు, తమిళం, హిందీ వంటి నాలుగు భాషల్లో జియో హాట్‌స్టార్ ఓటీటీలో ది మంకీ స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ 2 ఓటీటీల్లో ది మంకీ సినిమాను తెలుగులోనే ఎంచక్కా చూసేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More