OTT Horror: ఓటీటీలోకి నెలరోజుల్లోనే 3 వేల కోట్ల సూపర్ హిట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్- 7 రేటింగ్- భయపెట్టే వింత గదులు!
Backrooms OTT Streaming 3 Platforms: థియేట్రికల్ రిలీజ్ అయిన నెలరోజులకే 3 ఓటీటీల్లోకి వచ్చేస్తోంది సూపర్ హిట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా బ్యాక్‌రూమ్స్. ఐఎమ్‌డీబీలో 7 రేటింగ్ పొందిన ఈ సినిమా 3 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇలాంటి బ్యాక్‌రూమ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.
Backrooms OTT Release 3 Platforms: హారర్ సినిమాలను ఇష్టపడే ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ 'A24' మార్కు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రాలతో మెప్పించే ఈ సంస్థ నుంచి వచ్చిన సరికొత్త సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సెన్సేషన్ 'బ్యాక్‌రూమ్స్' (Backrooms).

3 వేల కోట్ల కలెక్షన్స్
థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి బ్యాక్‌రూమ్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కేవలం 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 84 కోట్లు) స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన బ్యాక్‌రూమ్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 360 మిలియన్ డాలర్ల (రూ. 3024 కోట్లు) భారీ కలెక్షన్స్‌ను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది.
ఐఎమ్‌డీబీ రేటింగ్
జూన్ 12న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను వణికించిన ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌రూమ్స్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. యువ దర్శకుడు కేన్ పార్సన్స్ తెరకెక్కించిన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7 రేటింగ్ వచ్చింది.
ఇంటర్నెట్ వైరల్ మీమ్ ఆధారంగా..
ఒక ఫర్నిచర్ షోరూమ్‌లో అకస్మాత్తుగా ఒక వింత డోర్ ప్రత్యక్షమవుతుంది. ఆ తలుపు దాటి లోపలికి వెళ్తే అంతం లేని ఎన్నో వింత గదులు (బ్యాక్‌రూమ్స్) కనిపిస్తాయి. అక్కడ ఎదురయ్యే భయానక, ఉత్కంఠభరిత పరిస్థితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయిన 'క్రీపీపాస్టా' మీమ్, కేన్ పార్సన్స్ రూపొందించిన యూట్యూబ్ వెబ్ సిరీస్ ఆధారంగా ఈ ఫీచర్ ఫిల్మ్‌ను అద్భుతంగా మలిచారు.
మరింత థ్రిల్ ఇచ్చే హారర్ ఎక్స్‌పీరియెన్స్
"స్వల్ప బడ్జెట్‌తో వచ్చి ఇంత పెద్ద విజయం సాధించడం హారర్ జోనర్‌లోనే సరికొత్త రికార్డు" అని హాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు సైతం పేర్కొన్నారు. బ్యాక్‌రూమ్స్ సినిమా గురించి ముందే ఎక్కువ విషయాలు తెలుసుకోకుండా నేరుగా స్క్రీన్‌పై చూసినప్పుడే ఈ హారర్ ఎక్స్‌పీరియన్స్ మరింత థ్రిల్ ఇస్తుందని చిత్రయూనిట్ మొదటి నుంచి చెబుతోంది.
గ్లోబల్ ఓటీటీల్లో
థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్ అయిన వారికి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. బ్యాక్‌రూమ్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ వంటి ప్రముఖ గ్లోబల్ ఓటీటీల్లో బ్యాక్‌రూమ్స్ సినిమాను రెంట్ (అద్దె) ప్రాతిపదికన లేదా ప్రీ-ఆర్డర్ చేసుకుని వీక్షించవచ్చు.
3 ఓటీటీల్లో స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ ప్లస్‌తోపాటు వీడియో ఆన్ డిమాండ్‌లో కూడా బ్యాక్‌రూమ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అంటే, మూడింట్లో బ్యాక్‌రూమ్స్ ఓటీటీ రిలీజ్ అవనుంది. అయితే, ఈపాటికే బ్యాక్‌రూమ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కావాల్సింది. జూలై 7 నుంచి బ్యాక్‌రూమ్స్ ఓటీటీలోకి రానుందని ప్రకటించారు.
ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
కానీ, తాజాగా అనుకోని కారణాల వల్ల ఓటీటీ స్ట్రీమింగ్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు జూలై 14 నుంచి వీడియో ఆన్ డిమాండ్ ఓటీటీలో రెంటల్ విధానంలో బ్యాక్‌రూమ్స్ ప్రీమియర్ కానుంది. అలాగే, ప్రైమ్, యాపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో కూడా బ్యాక్‌రూమ్స్ అందుబాటులోకి రానుంది. థియేట్రికల్ రిలీజ్ అయిన నెలరోజులకే బ్యాక్‌రూమ్స్ 3 ఓటీటీల్లోకి రావడం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


