OTT Horror: 7 లక్షలకు 3 వేల కోట్లు- 2 ఓటీటీల్లోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- సెన్సార్ కట్ సీన్లతోనూ- కానీ, అదొక్కటే మైనస్!
Obsession OTT Streaming On 2 Platforms: ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ అబ్సెషన్ ఎట్టకేలకు 2 ఓటీ ప్లాట్‌ఫామ్‌లలోకి అడుగుపెట్టింది. ఇండియాలో సెన్సార్ కట్ అయిన సీన్లు, బిహైండ్ సన్నివేశాలతోపాటు అబ్సెషన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అదెక్కడో తెలుసుకుందాం.
Obsession OTT Released In 2 Platforms: సినీ ప్రపంచంలో ఒక్కోసారి చిన్న బడ్జెట్ చిత్రాలు సృష్టించే సంచలనాలు అంతా ఇంతా కాదు. భారీ తారాగణం, కోట్లాది రూపాయల గ్రాఫిక్స్ లేకపోయినా కేవలం బలమైన కథ, ఉత్కంఠ రేపే కథనంతో బాక్సాఫీస్‌ను షేక్ చేయవచ్చని హాలీవుడ్ చిత్రం 'అబ్సెషన్' (Obsession) నిరూపించింది.

7 లక్షల బడ్జెట్‌తో
కేవలం రూ. 7 లక్షల అత్యల్ప బడ్జెట్‌తో తెరకెక్కి, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 370 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 3,100 కోట్లు) కలెక్షన్స్ రాబట్టిన ఈ హారర్ సెన్సేషన్ అబ్సెషన్ ఇప్పుడు 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయడానికి వచ్చేసింది.
20 ఏళ్ల యూట్యూబర్ సృష్టించిన అద్భుతం
కేవలం 20 ఏళ్ల వయసున్న కర్రీ బార్కర్ అనే యూట్యూబర్ ఈ చిత్రానికి కథ అందించి, తొలిసారిగా దర్శకత్వం వహించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఫోకస్ ఫీచర్స్' ఏకంగా 15 మిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. ఒక సాధారణ యూట్యూబర్ హాలీవుడ్‌లో ఈ స్థాయి విజయం అందుకోవడం విశేషం.
"సంబంధాలలో పరస్పర అంగీకారం, పురుషుల అహంకారం ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తాయో ఈ హారర్ డ్రామాలో చర్చించాం" అని దర్శకుడు కర్రీ బార్కర్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
వన్ విష్ విల్లో (One Wish Willow) అనే ఒక రహస్య శక్తులున్న వస్తువు సహాయంతో తాను ఇష్టపడిన అమ్మాయి నిక్కీ (ఇండే నవరెట్)ని ప్రేమలో పడేలా చేసుకుంటాడు హీరో బేర్ (మైఖేల్ జాన్‌స్టన్). ఆ తర్వాత ఆ ప్రేమ కాస్తా విపరీతమైన పిచ్చిగా, సైకోలాంటి అబ్సెషన్‌గా మారి ఎలాంటి భయంకరమైన పరిణామాలకు దారితీసిందనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.
భారత్‌లో సెన్సార్ కత్తెర.. అయినా సరే!
అబ్సెషన్ సినిమా భారతదేశంలో థియేటర్లలో విడుదలైనప్పుడు ఇక్కడి సెన్సార్ బోర్డ్ (CBFC) ఈ చిత్రానికి భారీగా కత్తెర వేసింది. సినిమాలో అత్యంత కీలకమైన, ఒక భయంకరమైన మరణానికి సంబంధించిన సీన్‌తో సహా రెండు ప్రధాన సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించింది.
ఈ కట్స్ పట్ల భారతీయ హారర్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఇక్కడి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లనే సాధించింది. ఇప్పుడు విడుదలైన ఓటీటీ వెర్షన్‌లో తెరవెనుక విశేషాలు (బిహైండ్ ది సీన్స్), సెన్సార్ కట్ సీన్స్, డైరెక్టర్ కామెంటరీ వంటి అదనపు కంటెంట్‌ను కూడా జోడించారు.
అదొక్కటే మైనస్
హారర్ సినీ ప్రియులను థియేటర్లలో వణికించిన అబ్సెషన్ అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ప్లాట్‌ఫామ్‌లలో జూన్ 30 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ డిజిటల్ ఎంట్రీ వెనుక ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదొక్కటే దీనికి మైనస్ అని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతానికి అబ్సెషన్ సినిమా ఓటీటీ సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా అందుబాటులో లేదు. కేవలం 'రెంట్' (అద్దె), 'బై' (కొనుగోలు) పద్ధతిలోనే అబ్సెషన్ మూవీని ఓటీటీ రిలీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రమాణాల ప్రకారం ఈ సినిమాను పూర్తిగా కొనుగోలు చేయడానికి 24.99 డాలర్లు, లేదా కేవలం వీక్షించడానికి 19.99 డాలర్లు చెల్లించి అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది.
ఫ్రీ ఓటీటీ స్ట్రీమింగ్
సాధారణ సబ్‌స్క్రైబర్ల కోసం అబ్సెషన్ ఫ్రీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఈ నెల ఆఖర్లో ప్రకటించనున్నారు. జూలై 14న బ్లూ-రే, 4K యూహెచ్‌డీ ఫిజికల్ మీడియా రూపంలో విడుదల కానున్న ఈ అబ్సెషన్ త్వరలోనే పీకాక్ (Peacock) ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


