4 రోజుల్లో 1230 కోట్లు కొల్లగొట్టిన చిన్న హారర్ మూవీ- ఇండియన్ హీరో హీరోయిన్ల ప్రశంసలు- అబ్సెషన్ సక్సెస్‌కు కారణాలు ఇవే!

Obsession Success Reasons And 4 Days Worldwide Collection: పరిమిత బడ్జెట్‌తో రూపొంది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది హాలీవుడ్ సైకలాజికల్ హారర్ చిత్రం అబ్సెషన్ నాలుగు రోజుల్లోనే 1230 కోట్లు కొల్లగొట్టి అబ్సెషన్. మరి ఈ సినిమా సక్సెస్‌కు కారణాలు ఏంటీ, ఇండియాలో కలెక్షన్స్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 2, 2026, 10:00:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Obsession Success Reasons And 4 Days Worldwide Collection: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు వచ్చి ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంటాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి సంచలనమే సృష్టిస్తోంది 'అబ్సెషన్' (Obsession) అనే సైకలాజికల్ హారర్ చిత్రం.

4 రోజుల్లో 1230 కోట్లు కొల్లగొట్టిన చిన్న హారర్ మూవీ- ఇండియన్ హీరో హీరోయిన్ల ప్రశంసలు- అబ్సెషన్ సక్సెస్‌కు కారణాలు ఇవే!
4 రోజుల్లో 1230 కోట్లు కొల్లగొట్టిన చిన్న హారర్ మూవీ- ఇండియన్ హీరో హీరోయిన్ల ప్రశంసలు- అబ్సెషన్ సక్సెస్‌కు కారణాలు ఇవే!

సున్నితమైన అంశాల చుట్టూ

సమాజంలో మహిళలపై జరిగే మానసిక వేధింపులు, సమ్మతి (Consent), వారి స్వేచ్ఛ వంటి సున్నితమైన అంశాల చుట్టూ తిరిగే ఈ కథ యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం 1 మిలియన్ డాలర్ల (తెరకెక్కించినప్పుడు మన కరెన్సీలో దాదాపు 7.3 కోట్ల రూపాయలు) లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 148 మిలియన్ డాలర్ల (సుమారు 1,230 కోట్ల రూపాయలు) కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం నోరెళ్లబెట్టేలా చేసింది.

భారతీయ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు

అయితే, ఈ అబ్సెషన్ చిత్రం అంతర్జాతీయంగానే కాకుండా భారతీయ మార్కెట్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థ 'సాక్‌నిల్క్' నివేదిక ప్రకారం.. మనదేశంలో ఈ సినిమా ఇప్పటివరకు 11.52 కోట్ల రూపాయల గ్రాస్, 9.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సాధించింది.

మే 29న ఇండియాల విడుదలైన అబ్సెషన్ సినిమా మొదటి రోజు 1.75 కోట్ల రూపాయలతో పర్వాలేదనిపించినా.. వీకెండ్‌లో భారీగా పుంజుకుంది. శనివారం 2.75 కోట్ల రూపాయలు, ఆదివారం ఏకంగా 3.25 కోట్ల రూపాయల వసూళ్లతో అదరగొట్టింది. వర్కింగ్ డే అయిన సోమవారం నాడు కలెక్షన్లలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, 2.00 కోట్ల రూపాయలు రాబట్టి ఇండియాలో కూడా తన కలెక్షన్ల పరంపర మొదలుపెట్టింది అబ్సెషన్ సినిమా.

బాలీవుడ్ చిత్రాలకు గట్టి పోటీ

సోమవారం కలెక్షన్లలో ఈ హాలీవుడ్ చిత్రం ఏకంగా నేరుగా బాలీవుడ్ సినిమానే వెనక్కి నెట్టింది. లక్ష్య, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించి, రెండో వారంలో నడుస్తున్న 'చాంద్ మేరా దిల్' సినిమా సోమవారం కేవలం 78 లక్షలు మాత్రమే వసూలు చేయగా, 'అబ్సెషన్' రెండు కోట్ల రూపాయలతో దూసుకుపోయింది.

అంతేకాకుండా అబ్సెషన్ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రశంసలు కురిపిస్తూ.. "ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ హారర్ సినిమాల్లో ఇది ఒకటి" అని కొనియాడారు. నటి అనన్య పాండే కూడా ఈ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ను అద్భుతమైన చిత్రంగా అభివర్ణించింది.

కోరికలు కోరిన వింత బొమ్మ.. అంతుచిక్కని భయం!

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మ్యూజిక్ స్టోర్‌లో పనిచేసే బేర్ (మైఖేల్ జాన్‌స్టన్) అనే యువకుడికి తనతో పాటు పనిచేసే నిక్కీ (ఇండే నవరెట్) అంటే ఇష్టం. అయితే తన మనసులోని ప్రేమను ఆమెకు చెప్పలేకపోతాడు. ఈ క్రమంలో అతనికి ఒక వింత శక్తులున్న బొమ్మ దొరుకుతుంది. అది యజమాని కోరుకునే ఒక కోరికను నెరవేరుస్తుంది.

నిక్కీ తనను ప్రేమించేలా చేయాలని బేర్ ఆ బొమ్మను కోరడంతో, అక్కడి నుంచి కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ కోరిక ఎలాంటి భయంకరమైన పరిణామాలకు దారితీసింది, వారి జీవితాలు ఎలా అతలాకుతలమయ్యాయి అనేదే మిగతా కథ.

మహిళల స్వేచ్ఛను ప్రశ్నించే కొత్త తరం హారర్

గతంలో హారర్ సినిమాలు అంటే కేవలం దెయ్యాలు, భూతాల హంగామా మాత్రమే ఉండేది. కానీ, జోర్డాన్ పీలే, డానీ బోయ్ వంటి దర్శకులు ఈ జోనర్‌కు సరికొత్త అర్థాన్ని ఇచ్చారు. 'అబ్సెషన్' చిత్రం ఆ ఒరవడిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రముఖ మీడియా సంస్థ హిందుస్థాన్ టైమ్స్ ఈ చిత్రానికి ఐదుకు ఐదు రేటింగ్ ఇచ్చింది.

సక్సెస్‌కు కారణాలు

"మహిళల సమ్మతిని, వారి స్వేచ్ఛను గౌరవించని మగవాడే సమాజంలో అన్నింటికంటే భయంకరమైన మృగం" అని ఈ సినిమా నిరూపించిందని విశ్లేషకులు స్పష్టం చేశారు. ప్రేమ పేరుతో చేసే మానసిక వేధింపులను కళ్లకు కట్టినట్లు చూపించడమే ఈ సినిమా విజయానికి అసలు కారణం అని సమాచారం.

అలాగే, సమాజంలో మహిళలపై జరిగే మానసిక వేధింపులు, సమ్మతి, వారికి ఇవ్వాల్సిన స్వేచ్ఛ వంటి సున్నితమైన అంశాలను ఈ సినిమాలో బాగా చూపించారు. అందుకే ఈ సినిమాకు మహిళలతో పాటు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సక్సెస్ కారణాలతోనే విడుదలైన రోజు నుంచే అంతర్జాతీయంగా కలెక్షన్లతో సత్తా చాటుతోంది స్మాల్ బడ్జెట్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ అబ్సెషన్.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'అబ్సెషన్' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసింది?

ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 148 మిలియన్ డాలర్లు (సుమారు 1,230 కోట్ల రూపాయలు) వసూలు చేసింది.

2. భారతదేశంలో ఈ సినిమా టోటల్ కలెక్షన్ ఎంత?

భారతదేశంలో ఈ చిత్రం ఇప్పటివరకు 11.52 కోట్ల రూపాయల గ్రాస్, 9.75 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది.

3. ఈ సినిమా బడ్జెట్ ఎంత?

ఈ హాలీవుడ్ హారర్ చిత్రాన్ని కేవలం 1 మిలియన్ డాలర్ల (దాదాపు 8.3 కోట్ల రూపాయలు) లోపు అత్యంత పరిమిత బడ్జెట్‌తో రూపొందించారు.

4. ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించింది ఎవరు?

మైఖేల్ జాన్‌స్టన్ (బేర్ పాత్రలో), ఇండే నవరెట్ (నిక్కీ పాత్రలో) ప్రధాన పాత్రలు పోషించారు.

5. అబ్సెషన్ విజయానికి అసలు కారణాలు ఏంటీ?

ప్రేమ పేరుతో చేసే మానసిక వేధింపులను కళ్లకు కట్టినట్లు చూపించడమే ఈ సినిమా విజయానికి అసలు కారణం. అలాగే, మహిళళ స్వేచ్ఛ, సమ్మతి చాలా ముఖ్యం అని ఈ సినిమా చెబుతుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More