Ram Charan: బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్కలపై రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్.. పెద్ది మూవీ ఆ షాక్ నుంచి గట్టెక్కిస్తుందా?

Ram Charan About Box Office Collection: సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రాధాన్యతపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచి వసూళ్లు వస్తేనే తదుపరి చిత్రాల్లో కొత్త ప్రయోగాలు చేయడానికి నటీనటులకు అవకాశం దక్కుతుందన్నారు. జూన్ 4న పెద్ది రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ ఇలా అన్నారు.

Published on: May 29, 2026, 10:11:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Charan About Box Office Collection: ప్రస్తుత సినిమా ప్రపంచంలో ఒక చిత్రం ఎంతవరకు విజయం సాధించిందనేది కేవలం బాక్సాఫీస్ వసూళ్ల ఆధారంగానే అంచనా వేస్తున్నారు. కథలో బలం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే.. వంద కోట్ల క్లబ్, ఐదు వందల కోట్ల క్లబ్ అనే నంబర్ల చుట్టూనే పరిశ్రమ తిరుగుతోంది.

బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్కలపై రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్.. పెద్ది మూవీ ఆ షాక్ నుంచి గట్టెక్కిస్తుందా? (PTI)
బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్కలపై రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్.. పెద్ది మూవీ ఆ షాక్ నుంచి గట్టెక్కిస్తుందా? (PTI)

కలెక్షన్స్‌పై రామ్ చరణ్ కామెంట్స్

ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ కలెక్షన్లు ఒక నటుడి కెరీర్‌ను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశంపై టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్ చేశారు. తన తదుపరి భారీ చిత్రం 'పెద్ది' (Peddi) విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రాధాన్యతపై రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

నెంబర్స్ ముఖ్యం.. కానీ

బాక్సాఫీస్ కలెక్షన్లు ప్రతి నటుడికి ఎంతో కీలకమని రామ్ చరణ్ ఒప్పుకున్నారు. అయితే విజయానికి అది ఒక్కటే కొలమానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. "మంచి బాక్సాఫీస్ వసూళ్లు అనేవి మన తదుపరి సినిమాతో ముడిపడి ఉంటాయి. కలెక్షన్లు బాగుంటే, వచ్చే చిత్రాల్లో మరింతగా కొత్త ప్రయోగాలు చేయడానికి నటులకు స్కోప్ దక్కుతుంది. అందుకే నెంబర్స్ అనేవి ముఖ్యమే. కానీ , అవే సర్వస్వం కాదు" అని రామ్ చరణ్ పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా ప్రొడక్షన్ హౌస్‌లు, మీడియా మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు సైతం వసూళ్ల లెక్కల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ ట్రెండ్ సినిమా నాణ్యతను దెబ్బతీస్తోందనే వాదనలు కూడా ఉన్నాయి. గతంలో సీనియర్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఈ వసూళ్ల సంస్కృతిని తీవ్రంగా తప్పుపట్టారు.

బాక్సాఫీస్ భస్మాసురుడు

కమర్షియల్ నిర్మాతలు తమ స్వార్థం కోసం బాక్సాఫీస్ అనే ఒక 'భస్మాసురుడిని' సృష్టించారని, ఏదో ఒకరోజు ఈ అలవాటే పరిశ్రమను నిలువునా ముంచేస్తుందని మనోజ్ బాజ్‌పాయ్ హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా సినీ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

'గేమ్ ఛేంజర్' నష్టాల తర్వాత 'పెద్ది'పైనే ఆశలు

రామ్ చరణ్ గత చిత్రం 'గేమ్ ఛేంజర్' భారీ అంచనాలతో, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ సినిమా వల్ల నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి రామ్ చరణ్‌కు ఇప్పుడు 'పెద్ది' విజయం అత్యంత అవసరంగా మారింది.

కలెక్షన్లు వస్తేనే ప్రయోగాలు చేయవచ్చని చరణ్ చెప్పిన మాటలను బట్టి, ఈ సినిమాతో ఆయన మళ్లీ సాలిడ్ కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేసిన విషయం తెలిసిందే.

చార్ట్‌బస్టర్స్‌గా సాంగ్స్

ఇప్పటికే విడుదలైన పెద్ది ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా 'చికిరి చికిరి', 'హెల్లాల్లో' పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'ఎస్పీ పరశురామ్' చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.

చిరంజీవి - శ్రీదేవి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

ఇప్పుడు వారి వారసులుగా రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి నటిస్తుండటంతో అప్పటి మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ పోలికలపై జాన్వీ కపూర్ స్పందిస్తూ, క్లాసిక్ మూవీ 'జగదేకవీరుడు అతిలోకసుందరి'కి తానో పెద్ద ఫ్యాన్ అని, చరణ్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం సరికొత్త అనుభూతిని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది.

కాగా, పెద్ది సినిమాలో బాలీవుడ్ పాపులర్ నటులు బోమన్ ఇరానీ, దివ్యేందుతోపాటు సీనియర్ హీరో జగపతి బాబు, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పెద్ది సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More