తన కూతురికి వెరైటీ పేరు పెట్టిన గేమ్ ఛేంజర్ నటి కియారా.. అర్థమేంటో తెలుసుకునే పనిలో అభిమానులు

గేమ్ ఛేంజర్ నటి కియారా అద్వానీ, ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా తమ కూతురికి ఓ వెరైటీ పేరు పెట్టారు. ఈ మధ్యే వీళ్లకు కూతురు జన్మించిన విషయం తెలిసిందే. అయితే ఆ పాప పేరును తాజాగా రివీల్ చేయగా.. దానికి అర్థమేంటో తెలుసుకునే పనిలో అభిమానులు ఉన్నారు.

Published on: Nov 28, 2025, 11:44:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ కుమార్తెకు ఒక అందమైన పేరు పెట్టారు. శుక్రవారం (నవంబర్ 28) ఈ జంట తమ పాప పేరును అనౌన్స్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకున్నారు. ఈ సందర్భంగా వాళ్లు పోస్ట్ చేసిన ఫొటో కూడా చాలా క్యూట్ గా ఉంది.

తన కూతురికి వెరైటీ పేరు పెట్టిన గేమ్ ఛేంజర్ నటి కియారా.. అర్థమేంటో తెలుసుకునే పనిలో అభిమానులు
తన కూతురికి వెరైటీ పేరు పెట్టిన గేమ్ ఛేంజర్ నటి కియారా.. అర్థమేంటో తెలుసుకునే పనిలో అభిమానులు

కియారా, సిద్ధార్థ్ కూతురు సరాయా

తెలుగులో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ మూవీ చేసి అభిమానులకు దగ్గరైన నటి కియారా అద్వానీ. ఆమె ఈ మధ్యే ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వాళ్లు తమ పాపకు సరాయా అనే పేరు పెట్టినట్లు వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు. తమ కుమార్తె చిన్ని పాదాలను పట్టుకున్న ఒక ఫొటోను షేర్ చేస్తూ వారు ఇలా రాశారు. "మా ప్రార్థనల నుండి మా చేతుల్లోకి.. మా దివ్య ఆశీర్వాదం, మా రాకుమారి.. సరాయా మల్హోత్రా (Saraayah Malhotra)" అనే క్యాప్షన్ ఉంచారు.

ఈ జంటకు, వారి కుమార్తెకు అభిమానులు, స్నేహితుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తమ కుమార్తెకు 'సరాయా' అనే పేరు ఎందుకు పెట్టారనే విషయాన్ని ఈ జంట వెల్లడించనప్పటికీ.. ఈ పేరు హీబ్రూ పదం 'సారా' నుండి ప్రేరణ పొందిందని తెలుస్తోంది. 'సారా' అంటే రాకుమారి (Princess) అని అర్థం. తమ చిన్నారి రాకుమారికి సరిపోయేలా ఈ పేరును ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. అంతేకాదు సిద్ధార్థ్, కియారా ఇంగ్లిష్ అక్షరాలు కూడా వచ్చేలా వాళ్లు ఈ పేరు పెట్టారు.

కియారా, సిద్ధార్థ్ పాప గురించి..

సిద్ధార్థ్, కియారా జులై 15న తమకు కూతురు జన్మించినట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. "మా హృదయాలు నిండిపోయాయి. మా ప్రపంచం శాశ్వతంగా మారిపోయింది. మాకు కూతురి ఆశీర్వాదం లభించింది. మీ కియారా, సిద్ధార్థ్" అని రాశారు. ఆ తర్వాత తమ పాప ఫొటోలను తీయవద్దని ఫోటోగ్రాఫర్లను కోరారు.

ఈ జంట 2023లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో పెళ్లి చేసుకుంది. 2021లో విడుదలైన వార్ డ్రామా మూవీ ‘షేర్షా’లో వీరు కలిసి నటించారు. అప్పటి నుంచే వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్ల తర్వాత పెళ్లితో ఒక్కటి కాగా.. మరో రెండేళ్లకు పాప జన్మించింది.

కియారా, సిద్ధార్థ్ తదుపరి సినిమాలు

కియారా అద్వానీ చివరగా స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’లో కనిపించింది. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలను రాబట్టింది. ఆమె తర్వాత రణవీర్ సింగ్‌తో కలిసి 'డాన్' రీమేక్‌లో కనిపించనుంది.

సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవల 'పరమ్ సుందరి' చిత్రంలో నటించాడు. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన, దినేష్ విజన్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైంది. ఇందులో జాన్వీ కపూర్ కూడా నటించింది. అతడు తర్వాత తమన్నా భాటియాతో కలిసి ఒక హారర్ చిత్రంలో నటించనున్నాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More