రూ.2.2 కోట్ల రోలెక్స్ వాచ్ పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న వీడియో.. జూబ్లీహిల్స్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్
జూనియర్ ఎన్టీఆర్ ఓ అత్యంత ఖరీదైన వాచ్ ధరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ మ్యాన్ ఆఫ్ మాసెస్ గురువారం (నవంబర్ 6) జూబ్లీ హిల్స్ లో సందడి చేశాడు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గురువారం (నవంబర్ 6) రెండు వేర్వేరు వార్తలతో అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. అందులో ఒకటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ మరో షెడ్యూల్ కు రెడీ అవుతూ కనిపించడం. ఇక మరొకటి అతడు ఏకంగా రూ.2.2 కోట్ల విలువైన రోలెక్స్ వాచ్ పెట్టుకోవడం.

జూనియర్ ఎన్టీఆర్ రోలెక్స్ వాచ్
జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు కనులవిందు చేశాడు. గురువారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న కమల్ వాచ్ కంపెనీ షోరూమ్ కు అతడు వెళ్లాడు. అక్కడ ప్రముఖ బ్రాండ్ రోలెక్స్ కలెక్షన్ ను చూశాడు. అంతేకాదు ఏకంగా రూ.2.2 కోట్ల విలువైన ఓ వాచ్ అతడు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను కమల్ వాచ్ కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
తారక్ స్టైలిష్ లుక్ లో కారు దిగి షోరూమ్ లోకి అడుగుపెట్టడం, అక్కడ సిబ్బంది ఇచ్చిన ఆ ఖరీదైన వాచ్ పెట్టుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు. అతని స్టైలిష్ లుక్ కు ఆ వాచ్ మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ రోలెక్స్ వాచ్ తో అతడు ప్రత్యేకంగా ఫొటోలకు పోజులిచ్చాడు.
ఇందులో ఎన్టీఆర్ రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రాఫ్ డేటోనా లే మాన్స్ మోడల్ వాచ్ పెట్టుకున్నాడు. నిజానికి దీని ధర రూ.45.5 లక్షలు అయినా.. వాచ్ కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ధర ఏకంగా రూ.2.2 కోట్లకు చేరింది.
ఎన్టీఆర్.. వాచ్ లవర్
సెలబ్రిటీలు అయినా కూడా ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ కు కూడా వాచ్ లంటే ప్రాణం. గతంలో అతడు ఓ సందర్భంలో ఈ విషయం చెప్పాడు. తనకు బట్టల కంటే కూడా వాచ్ లంటే చాలా ఇష్టమని, అరుదైన వాచ్‌ల కలెక్షన్ సేకరించి, తన పిల్లలకు ఇవ్వాలనుకుంటున్నట్లు అతడు తెలిపాడు. తాజాగా జూనియర్ వాచ్ కలెక్షన్లో ఈ ఖరీదైన రోలెక్స్ కూడా చేరింది.
ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అతడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు టైటిల్ ను అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయకపోయినా డ్రాగన్ అని భావిస్తున్నారు. ఈ సినిమా మరో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ గురువారం (నవంబర్ 6) వెల్లడించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


