ది ఫ్యామిలీ మ్యాన్ 4 కూడా వచ్చేస్తోంది.. మీ ప్రశ్నలన్నింటికి ఆన్సర్స్ అందులోనే.. హీరో మనోజ్ బాజ్‌పాయ్ ట్వీట్
మనోజ్ బాజ్‌పాయ్ లీడ్ రోల్‌లో నటించిన సూపర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ 3 సీజన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే ఆ సీజన్ 3 ఎండింగ్ సరిగా లేదని కామెంట్స్ రావడంతో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 4 కూడా వస్తోందంటూ హీరో మనోజ్ బాజ్‌పాయ్ ట్వీట్ చేశాడు.
ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ నుంచి మూడో సీజన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది.

మనోజ్ బాజ్‌పాయ్ యాక్టింగ్
అయితే, ది ఫ్యామిలి సీజన్ 3పై మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. కథ కొంచెం రొటీన్‌గా ఉందని, ఈశాన్య రాష్ట్రాలపై చేయించే దాడుల సీక్వెన్స్ కొత్తగా ఉన్నాయని, డ్రామా బాగానే ఉందని పలువురు కామెంట్స్ చేశారు. అలాగే, ది ఫ్యామిలి సిరీస్‌కు హీరో అయిన శ్రీకాంత్ పాత్ర చేసిన మనోజ్ బాజ్‌పాయ్ యాక్టింగ్ అదిరిపోయిందని అభిమానులు మెచ్చుకున్నారు.
అయితే, ఎపిసోడ్స్ బాగానే ఉన్న ఎండింగ్ మాత్రం అసంపూర్ణంగానే వదిలేశారని చాలా మంది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అభిమానులు పెదవి విరిచారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ విషయంపై భిన్నంగా స్పందించారు. ఈ కామెంట్ల నేపథ్యంలో మనోజ్ బాజ్‌పాయ్ ఓ ట్వీట్ చేశారు.
కన్మర్ఫ్ చేసిన హీరో
"ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌కు మరో సీజన్ ఉందా?" అని ఓ అభిమాని దర్శకనిర్మాతలను అడిగిన విధానం మనోజ్ బాజ్‌పాయ్‌ను అట్రాక్ట్ చేసింది. దాంతో ఎక్స్ (గతంలో ట్విట్టర్)లోకి వెళ్లిన మనోజ్ బాజ్‌పాయ్ ఆ అభిమానికి సమాధానంగా ట్వీట్ చేశారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 4 కూడా వచ్చేస్తోందని కన్ఫర్మ్ చేశారు మనోజ్ బాజ్‌పాయ్.
"రోజంతా కూర్చోని ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 చూశాను. మీరు ఓ క్లిప్ హ్యాంగర్‌ను వదిలేసి సీజన్ 3 ముగించారు. ఇది అసలైన ముగింపు కాదు. సీజన్ పూర్తయిపోయిందా లేదా మీరు ఇంకా కొన్ని ఎపిసోడ్స్ దాచి ఉంచారా. రాజ్ అండ్ డీకే (దర్శకులు) కనీసం మీరైనా చెప్పండి. ఏదేమైనా మీ అద్భుతమైన పనికి అభినందనలు" అమాన్ కర్బాస్ అనే అభిమాని ట్వీట్ చేశాడు.
మీ ప్రశ్నలకు సమాధానాలు
ఈ ట్వీట్‌కు హీరో మనోజ్ బాజ్‌పాయ్ బదులివ్వడం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌కు మనోజ్ బాజ్‌పాయ్ "మీ ప్రశ్నలన్నింటికి సమాధానాలు నాలుగో సీజన్‌లో ఉన్నాయి. త్వరలోనే కలుద్దాం" అని బదులిచ్చారు. దీంతో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 4 కూడా వచ్చేస్తోందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, 2019లో మొదటగా ది ఫ్యామిలీ మ్యాన్ ప్రారంభం అయింది. అమెజాన్ ప్రైమ్‌లో ది ఫ్యామిలీ మ్యాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అప్పటి నుంచి ఈ సిరీస్‌కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక ఈ సిరీస్ నుంచి రెండో సీజన్ 2021లో ఓటీటీ రిలీజ్ అయింది.
విలన్‌గా సమంత
ది ఫ్యామిలి మ్యాన్ సీజన్ 2లో విలన్‌గా స్టార్ హీరోయిన్ సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ సెకండ్ సీజన్ కూడా బాగానే హిట్ అయింది. ఇక నాలుగేళ్ల విరామం తర్వాత ది ఫ్యామిలీ మ్యాన్ నుంచి కొత్త సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో ది ఫ్యామిలీ మ్యాన్ 4 ఓటీటీ రిలీజ్ కానుందని మనోజ్ బాజ్‌పాయ్ ట్వీట్‌తో తెలుస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


