ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారిపోయిన స్పై ఏజెంట్ శ్రీకాంత్.. అదిరింది
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది. స్పై ఏజెంట్ శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ బాజ్‌పాయీ తిరిగి రాగా.. ఈ కొత్త సీజన్ లో ప్రముఖ నటుడు జైదీప్ అహ్లావత్ విలన్ గా వస్తున్నాడు. నవంబర్ 21 నుంచి ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుంది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ మూడవ సీజన్ ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో శుక్రవారం (నవంబర్ 7) రిలీజ్ చేసింది. ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో ఈ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షో ద్వారా మన లవింగ్ స్పై ఏజెంట్ శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పేయి తిరిగి వచ్చాడు. ఈసారి శ్రీకాంత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా పరారీలో ఉండటం, అలాగే జైదీప్ అహ్లావత్ పోషించిన డ్రగ్ మాఫియా డాన్ తో ఫైట్ ఆసక్తి రేపుతోంది.

'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3' ట్రైలర్
అమెజాన్ ప్రైమ్ వీడియో శుక్రవారం మధ్యాహ్నం తమ సోషల్ మీడియాలో సీజన్ 3 ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ ప్రారంభంలోనే శ్రీకాంత్ (మనోజ్ బాజ్‌పేయి) తన కుటుంబానికి తాను ఒక గూఢచారిని అని చెప్పడంతో ఉత్కంఠ మొదలవుతుంది. అదే సమయంలో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ప్రకటించినట్లు చూపిస్తారు.
శ్రీకాంత్ తన కుటుంబంతో పాటు పారిపోతుండగా.. అతని అత్యంత నమ్మకస్తుడైన మ్యాన్ ఫ్రైడే జేకే (షరీబ్ హష్మి) సహాయం చేస్తాడు. అయితే తనను ఇరికించడానికి కుట్ర పన్నిందెవరో అని శ్రీకాంత్ ఆలోచనలో పడతాడు. ఇంతలో శ్రీకాంత్ పతనానికి మాస్టర్‌మైండ్ అయిన నిమ్రత్ కౌర్ పాత్ర రంగంలోకి దిగుతుంది. ఆమె తన ఆయుధాన్ని దేశంలో నార్త్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన భయంకరమైన డ్రగ్ స్మగ్లర్ (జైదీప్ అహ్లావత్ పోషించిన పాత్ర) రూపంలో కనుగొంటుంది. ఈ కొత్త ప్రమాదాన్ని శ్రీకాంత్ ఎలా ఎదుర్కొంటాడు అనేది సీజన్ 3 కథాంశం.
మూడో సీజన్‌కు మూడేళ్లు ఎందుకంటే?
ఈ పాపులర్ షో మూడవ సీజన్ రావడానికి మూడు సంవత్సరాలు పట్టడం అభిమానులను కొంత ఆశ్చర్యపరిచింది. విడుదల తేదీ ప్రకటన సందర్భంగా.. ఈ సిరీస్ క్రియేటర్స్, దర్శకులు అయిన రాజ్ & డీకే దీనిపై స్పందించారు. “సంవత్సరాలుగా ప్రేక్షకులు ‘ది ఫ్యామిలీ మ్యాన్’పై కురిపించిన ప్రేమ, అభిమానం నిజంగా అద్భుతమైనవి.
ప్రేక్షకులు ఓపికగా ఎదురుచూశారని మాకు తెలుసు. ఈ ఎదురుచూపుకు తగిన ప్రతిఫలం దక్కాలని మేము కోరుకున్నాము. ఈ సీజన్‌లో మరింత హై-ఆక్టేన్ యాక్షన్, గ్రిప్పింగ్ కథనం, అద్భుతమైన నటన, ఉత్కంఠను పెంచే అనుభవాన్ని అందించాలని మేము భావించాం” అని తెలిపారు.
'ది ఫ్యామిలీ మ్యాన్' గురించి మరిన్ని వివరాలు
ది ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ కథాంశంపై అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. “ఈ సీజన్‌లో ప్రమాదాలు మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. జైదీప్ అహ్లావత్ (రుక్మా), నిమ్రత్ కౌర్ (మీరా) రూపంలో కొత్త, భయంకరమైన శత్రువులు శ్రీకాంత్ తివారీకి ఎదురవుతారు. పరారీలో ఉన్న శ్రీకాంత్ దేశ సరిహద్దుల లోపల, వెలుపల నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కొంటూ, కొత్త ప్రదేశాలలో తనదైన శైలిలో సమస్యలను పరిష్కరించాలి” అని వెల్లడించింది.
ఈ సీజన్‌లో కీలక పాత్రల్లో షరీబ్ హష్మి, ప్రియమణి, ఆష్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా, శ్రేయా ధన్వంతరి, గుల్ పనాగ్ తిరిగి వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3' నవంబర్ 21 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


