Ram Charan: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డ్ గ్యారంటీ- కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కామెంట్స్- రవి కిషన్‌ది అదే మాట!
Shiva Rajkumar On Ram Charan In Peddi Press Meet: రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్.. రామ్ చరణ్ నటనను కొనియాడుతూ, ఆయనకు జాతీయ అవార్డు రావడం ఖాయమని జోస్యం చెప్పారు.
Shiva Rajkumar On Ram Charan In Peddi Press Meet: ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంట్ ఉన్న దర్శకులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. 'ఉప్పెన' చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ తన 16వ చిత్రంగా 'పెద్ది' (Peddi) అనే రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో నటించిన విషయం తెలిసిందే.

బెంగళూరులో పెద్ది ప్రెస్ మీట్
ఈ భారీ పాన్-ఇండియా చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో నిర్వహించిన పెద్ది మూవీ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న కన్నడ సూపర్ స్టార్, కంఠీరవ శివ రాజ్‌కుమార్.. ఈ సినిమా గురించి రామ్ చరణ్ అంకితభావం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
ఆ పాత్ర కోసం చరణ్ రెండేళ్లు కష్టపడ్డాడు
పెద్ది సినిమాలో రామ్ చరణ్‌కు శివ రాజ్‌కుమార్ కోచ్‌గా నటిస్తున్నారా అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కథలోని సస్పెన్స్‌ను రివీల్ చేయకుండానే.. తన పాత్రకు, రామ్ చరణ్ (పెద్ది) పాత్రకు మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ సినిమాకు ప్రధాన బలమని హింట్ ఇచ్చారు.
రామ్ చరణ్ పడ్డ కష్టాన్ని గుర్తుచేసుకుంటూ శివ రాజ్‌కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. "ఈ సినిమాకు గాను రామ్ చరణ్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం ఖాయమని నేను బలంగా నమ్ముతున్నాను. ఆ పాత్ర కోసం ఆయన మారిన విధానం, చూపించిన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ అద్భుతం" అని శివ రాజ్‌కుమార్ తెలిపారు.
"ఈ క్యారెక్టర్ కోసం ఆయన దాదాపు రెండేళ్ల సమయాన్ని కేటాయించి, పూర్తిగా లీనమైపోయారు. అత్యంత నిజాయితీతో, అంకితభావంతో చరణ్ నటించిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది" అని శివ రాజ్‌కుమార్ కొనియాడారు. పెద్ది మూవీ షూటింగ్ సమయంలో చిత్ర బృందం అంతా తనను ఒక సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
రవికిషన్ సైతం అదే మాట..
శివ రాజ్‌కుమార్ కంటే ముందే, ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు రవి కిషన్ కూడా చరణ్ నటనపై ఇలాంటి కామెంట్సే చేశారు. "రామ్ చరణ్ సార్.. ఏం యాక్టింగ్ అది! గతంలో ఆయన నిర్మించిన సినిమాలో నేను చేశాను, అప్పటికంటే ఈ సినిమాలో ఆయన నటన సరికొత్త స్థాయిలో ఉంది" అని రవి కిషన్ అన్నారు.
"వాళ్ల నాన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కల్యాణ్ గారు నాకు బాగా తెలుసు. కానీ ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ చూశాక జాతీయ అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు రావడం ఖాయమని నా కళ్లకు కనిపిస్తోంది" అని రవి కిషన్ గతంలో పేర్కొన్నారు. ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు దిగ్గజ నటులు అవార్డు ఖాయమని చెప్పడంతో మెగా అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
భారీ తారాగణం.. జూన్ 4న గ్రాండ్ రిలీజ్
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేసింది. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపిస్తారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


