Shiva Rajkumar: హీరోయిన్లపై జూమ్ చేస్తూ అసభ్యకర కెమెరా యాంగిల్స్- ఆమెకు సపోర్ట్ చేసిన కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్

Shiva Rajkumar Supports Sapthami Gowda over Zooming: పబ్లిక్ ఈవెంట్లలో నటీమణుల శరీర భాగాలను అసభ్యకరంగా జూమ్ చేస్తూ ఫోటోలు, వీడియోలు తీయడంపై కన్నడ స్టార్ సప్తమి గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు మద్దతుగా కన్నడ కంఠీరవ శివ రాజ్‌కుమార్, ఆయన కుమార్తె నివేదిత నిలిచారు.

Mar 6, 2026, 10:15:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమా వేడుకల్లో నటీమణుల పట్ల కొందరు ఫోటోగ్రాఫర్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసింది. నటీమణుల ప్రతిభను పక్కనపెట్టి, వారి శరీర భాగాలను అసభ్యకర కోణాల్లో (Inappropriate angles), జూమ్ చేసి చిత్రీకరిస్తూ వైరల్ చేయడంపై కన్నడ హీరోయిన్ సప్తమి గౌడ నిప్పులు చెరిగారు.

హీరోయిన్లపై జూమ్ చేస్తూ అసభ్యకర కెమెరా యాంగిల్స్- ఆమెకు సపోర్ట్ చేసిన కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్
హీరోయిన్లపై జూమ్ చేస్తూ అసభ్యకర కెమెరా యాంగిల్స్- ఆమెకు సపోర్ట్ చేసిన కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్

#ActorsNotObjects: శివ రాజ్‌కుమార్ ఘాటు స్పందన

సప్తమి గౌడ గళానికి కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ తన మద్దతును ప్రకటించారు. ఈ వ్యవహారంపై శివ రాజ్‌కుమార్ సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను విడుదల చేశారు.

మన దౌర్భాగ్యం అది

"మహిళలను గౌరవించాలని ఈ కాలంలో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సి రావడం మన దౌర్భాగ్యం. కనీస మనస్సాక్షితో పని చేయండి. మహిళలను, నటీమణులను అగౌరవపరచకండి" అని శివ రాజ్‌కుమార్ హితవు పలికారు. ‘నటీనటులు వస్తువులు కాదు’ (#ActorsNotObjects) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన తన నిరసనను వ్యక్తం చేశారు.

అలాగే, శివ రాజ్‌కుమార్ కుమార్తె, నిర్మాత నివేదిత రాజ్‌కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ఏ వృత్తిలో ఉన్నా సరే, మహిళను కేవలం ఒక శరీరంగా చూడటం సరికాదు. మహిళలను ఎలా చిత్రీకరిస్తున్నాం, వారి గురించి ఎలా మాట్లాడుతున్నాం అనేది మన సమాజ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ప్రతి వ్యక్తి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి" అని నివేదిత పేర్కొన్నారు.

అసలేం జరిగింది?

బుధవారం (మార్చి 4) సప్తమి గౌడ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. "మేము సినిమా రంగంలో ఉన్నది మా ప్రతిభను చాటుకోవడానికి, కళను గౌరవించడానికి. కానీ పబ్లిక్ ఈవెంట్లలో కొందరు వ్యక్తులు మా పనిని వదిలేసి, అనవసరంగా మా శరీర భాగాలను జూమ్ చేస్తూ వీడియోలు, ఫోటోలు తీస్తున్నారు" అని రాసుకొచ్చారు సప్తమి గౌడ.

"ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి అసభ్యకర ప్రవర్తనను మేము సహించబోము" అని సప్తమి గౌడ స్పష్టం చేశారు. ప్రొఫెషనల్ జర్నలిజం ముసుగులో ఇలాంటి పనులు చేయడం మానుకోవాలని సప్తమి హెచ్చరించారు.

ఏకమైన నటీమణులు

దీంతో సప్తమి గౌడకు మద్దతుగా రుక్మిణి వసంత్, ఆషిక రంగనాథ్, దివ్య స్పందన వంటి తారలు కూడా గళమెత్తారు. "గౌరవాన్ని అలవాటు చేసుకుందాం.. ఉల్లంఘనను కాదు" అని ఆషిక రంగనాథ్ పేర్కొన్నారు. అయితే, గతంలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహి వంటి హీరోయిన్స్ కూడా ఇలాంటి 'జూమ్-ఇన్' సంస్కృతిపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Niveditha Shivarajkumar also stood in support of Sapthami Gowda.
Niveditha Shivarajkumar also stood in support of Sapthami Gowda.

జైలర్ 2లో శివన్న

ఇదిలా ఉంటే, సప్తమి గౌడ 2025లో నితిన్ ‘తమ్ముడు’, ‘శోధ’ చిత్రాలతో అలరించారు. త్వరలో ‘ది రైజ్ ఆఫ్ అశోక’లో సప్తమి గౌడ కనిపించనున్నారు. మరోవైపు అనారోగ్యాన్ని జయించిన శివన్న ‘జైలర్ 2’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More