బైకును ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిన కన్నడ హీరోయిన్ దివ్య సురేష్- కేసు నమోదు, కారు సీజ్-యాక్సిడెంట్ వీడియో వైరల్
కన్నడ హీరోయిన్, బిగ్ బాస్ ఫేమ్ దివ్య సురేష్‌పై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. బైకును ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిన కేసులో దివ్య సురేష్‌పై కేసు ఫైల్ అయింది. అక్టోబర్ 4న నిత్యా హోటల్ సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్ తాలుకు సీసీటీవీ ఫుటేజ్‌ను చూసిన తర్వాత దివ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు.
కన్నడ హీరోయిన్, బిగ్ బాస్ ఫేమ్ దివ్య సురేష్‌పై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. అక్టోబర్ 4న తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బెంగళూరులోని నిత్యా హోటల్ సమీపంలో దివ్య సురేష్ కారు బైక్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ధృవీకరించిన తరువాత పోలీసులు దివ్యపై కేసు నమోదు చేశారు.

విచారణ చేపట్టిన పోలీసులు
అక్టోబర్ 7న బాధితుల కజిన్ కిరణ్ జి (25) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. కిరణ్ తన కజిన్స్ అయిన అనూషా (33), అనిత (24)లతో కలిసి బైక్ నడుపుతూ వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన నల్ల కారు వారిని ఢీకొట్టింది. దాంతో ముగ్గురు రోడ్డుపై పడ్డారు.
ఈ యాక్సిడెంట్‌లో అనిత కాలు తీవ్రంగా ఫ్రాక్చర్ అయింది. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే, కిరణ్, అనూషకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అనిత వైద్య సంరక్షణలో నిమగ్నమై ఉన్నందున ఫిర్యాదు దాఖలు చేయడంలో ఆలస్యం అయిందని కిరణ్ పోలీసులకు చెప్పాడు.
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి
అయితే, యాక్సిడెంట్ తర్వాత వారికి ఏమైందో అని కూడా చూడకుండా కారు నడిపిన వారు ఆపకుండా పారిపోయినట్లు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్)లో పేర్కొన్నారు. కిరణ్ కంప్లైంట్ మేరకు విచారణ చేపట్టిని పోలీసులు యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
యాక్సిడెంట్ చేసిన కారు దివ్య సురేష్‌దిగా గుర్తించిన పోలీసులు ఆమెను విచారించారు. అనంతరం కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. ఇక అనిత కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆస్పత్రిలో చేరినట్లు, ట్రీట్‌మెంట్‌కు రూ. 2 లక్షలు ఖర్చు అయినట్లు, తమకు న్యాయం చేయాలని కిరణ్ ఫిర్యాదులో కోరాడు.
సెక్షన్ 281, సెక్షన్ 125 కింద కేసులు
బుల్లితెర నటి దివ్య సురేష్‌పై చట్టపరమైన చర్యలు చేపట్టామని బయతారాయనపుర ట్రాఫిక్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎం.పుట్టమ్మ తెలిపారు. దివ్యపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్ 281 కింద నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు, ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్యలకు సెక్షన్ 125 ఏ కింద కేసు నమోదు చేశారు.
ఇకపోతే దివ్య సురేష్ చేసిన యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కిరణ్ వాళ్లు కలిసి బైక్‌లో ఆస్పత్రికి వెళ్తున్నారు. మరోవైపు దివ్య తన కారులో వస్తోంది. ఓ మూల వద్ద ఎదురుపడిన బైక్‌ను దివ్య తన కారుతో ఢీ కొట్టింది. దాంతో ముగ్గురు రోడ్డు పక్కన పడిపోయారు.
దివ్య సురేష్ సినిమాలు
ఇదిలా ఉంటే, దివ్య సురేష్ కన్నడలో చాలా సినిమాలు చేసింది. బిగ్ బాస్ షో ద్వారా కూడా అలరించింది. అలాగే, తెలుగులో టెంప్ట్ రాజా, థర్డ్ క్లాస్ వంటి సినిమాల్లో కూడా దివ్య సురేష్ హీరోయిన్‌గా చేసింది. రౌడీ బేబీ, హిరణ్య, టెంప్ట్ రాజా, 3rd క్లాస్, హులిరయ, 9 హిల్టన్ హౌజ్ వంటి సినిమాలతో పేరు తెచ్చుకుంది కన్నడ బ్యూటి దివ్య సురేష్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


