Ram Charan Salman Aamir: పెద్ది సినిమాకు సుల్తాన్, దంగల్ బ్లూ ప్రింట్స్- రామ్ చరణ్ కామెంట్స్-సల్మాన్, అమీర్‌కు థ్యాంక్స్

Ram Charan On Salman Khan Sultan Aamir Khan Dangal: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది ట్రైలర్ ముంబైలో అత్యంత ఘనంగా విడుదలైంది. ఈ సందర్భంగా బాలీవుడ్ ఐకానిక్ స్పోర్ట్స్ డ్రామాలు అయిన 'సుల్తాన్', 'దంగల్' చిత్రాలపై రామ్ చరణ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: May 19, 2026, 10:36:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Charan On Salman Khan Sultan Aamir Khan Dangal: 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, ఇప్పుడు సరికొత్త స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ముంబైలో సోమవారం (మే 18) జరిగిన 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలపై ప్రశంసల జల్లు కురిపించారు.

పెద్ది సినిమాకు సుల్తాన్, దంగల్ బ్లూ ప్రింట్స్- రామ్ చరణ్ కామెంట్స్-సల్మాన్, అమీర్‌కు థ్యాంక్స్
పెద్ది సినిమాకు సుల్తాన్, దంగల్ బ్లూ ప్రింట్స్- రామ్ చరణ్ కామెంట్స్-సల్మాన్, అమీర్‌కు థ్యాంక్స్

"సుల్తాన్, దంగల్ వంటి చిత్రాలతో మాకు సరికొత్త బాట చూపించిన సల్మాన్ ఖాన్ సర్, అమీర్ ఖాన్ సర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ సినిమాలు మా లాంటి మేకర్స్‌లో ఎంతో నమ్మకాన్ని నింపాయి. భారతీయ సినిమా హిస్టరీలో ఇలాంటి విభిన్నమైన క్రీడా నేపథ్య కథలు గతంలో అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి. మేము కూడా అదే నమ్మకంతో, అదే దారిలో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాం" అని రామ్ చరణ్ పేర్కొన్నారు.

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'దంగల్', 'సుల్తాన్'

పెద్ది సినిమాకు దంగల్, సుల్తాన్ సినిమాలు బ్లూ ప్రింట్స్ అన్న అర్థంలో రామ్ చరణ్ మాట్లాడారు. బాలీవుడ్ చరిత్రలో 2016లో విడుదలైన 'దంగల్', 'సుల్తాన్' చిత్రాలు క్రీడా ఆధారిత సినిమాలకు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాయి. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'దంగల్' భారతదేశంలోనే కాకుండా చైనా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించి, ఏకంగా రూ. 2000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఫోగట్ సిస్టర్స్ జీవిత ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్' కూడా ప్రపంచవ్యాప్తంగా రూ. 623 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ రెండు సినిమాలు ఇచ్చిన ఇన్స్పిరేషన్‌తోనే ఇప్పుడు 'పెద్ది' రూపకల్పన జరిగిందని రామ్ చరణ్ స్పష్టం చేశారు.

అస్తిత్వం కోసం 'పెద్ది' ఆరాటం.. బుచ్చిబాబు మ్యాజిక్

'ఉప్పెన' వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు బుచ్చిబాబు సాన పెద్ది మూవీకి దర్శకత్వం వహించారు. ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు చూపించిన నిబద్ధతను రామ్ చరణ్ అభినందించారు. తన పాత్ర గురించి రామ్ చరణ్ వివరిస్తూ.. ఇది ఒక సామాన్య వ్యక్తి తన గుర్తింపు (Identity) కోసం చేసే పోరాటమని చెప్పారు.

సమాజంలో బ్రతకడానికి ప్రతి ఒక్కరికీ ఒక అస్తిత్వం కావాలని, ఈ సినిమాలో హీరో ఒక పెద్ద ఆశయం కోసం తన ఐడెంటిటీ క్రైసిస్‌ను ఎలా దాటాడు అనేది ఆసక్తికరంగా ఉంటుందని వెల్లడించారు. ఒక క్రాస్‌ఓవర్ అథ్లెట్‌గా హీరో ప్రయాణం చాలా సహజంగా సాగుతూనే, పక్కా కమర్షియల్ హంగులతో అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

పెద్ది రిలీజ్ డేట్

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేయగా, బాలీవుడ్ పాపులర్ యాక్టర్స్ బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మతోపాటు జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భిన్నమైన స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పెద్ది' జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More