OTT Horror: 3 ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్- గుమ్మడికాయ వింత శాపం, అన్నకోసం దిష్టిబొమ్మ రాక్షసుడితో తమ్ముడి పోరాటం-తెలుగులో!

RL Stine's Pumpkinhead OTT Streaming: 9 నెలలకు మూడో ఓటీటీలోకి నేరుగా వచ్చేసిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ సినిమా ఆర్ఎల్ స్టైన్స్ పంప్‌కిన్‌హెడ్. కనిపించకుండా పోయిన అన్న కోసం దిష్టిబొమ్మ రాక్షసుడితో తమ్ముడు చేసే పోరాటమే మూవీ కథ. 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న పంప్‌కిన్‌హెడ్ తెలుగులో అందుబాటులో ఉంది.

Published on: Jul 10, 2026, 05:30:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

RL Stine's Pumpkinhead OTT Release In 3 Platforms: భయానక నవలలు, గగుర్పొడిచే కథలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పాఠకులను అలరించిన విలక్షణ రచయిత ఆర్‌ఎల్ స్టైన్ (R.L. Stine) సృష్టించే సరికొత్త ప్రపంచం కోసం హారర్ ప్రేమికులు ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు.

9 నెలలకు మూడో ఓటీటీలోకి నేరుగా వచ్చిన హారర్ థ్రిల్లర్- అన్నకోసం దిష్టిబొమ్మ రాక్షసుడితో పోరాటం- తెలుగులోనే!
9 నెలలకు మూడో ఓటీటీలోకి నేరుగా వచ్చిన హారర్ థ్రిల్లర్- అన్నకోసం దిష్టిబొమ్మ రాక్షసుడితో పోరాటం- తెలుగులోనే!

ఓటీటీలో నేరుగా

గతంలో ఆర్ఎల్ స్టైన్ రాసిన 'గూస్‌బంప్స్' సిరీస్ పుస్తకాలు, సినిమాలు యావత్ ప్రపంచ సినీ ప్రేమికులను అలరించాయి. అందులో ఆయన రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ సినిమానే 'ఆర్‌ఎల్ స్టైన్స్ పంప్‌కిన్‌హెడ్' (R.L. Stine's Pumpkinhead).

గతేడాది అక్టోబర్‌లో నేరుగా పంప్‌కిన్‌హెడ్ ఓటీటీలో రిలీజ్ అయి పర్వాలేదనిపించుకుంది. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 5.8 రేటింగ్ సొంతం చేసుకున్న పంప్‌కిన్‌హెడ్ ఇప్పుడు 9 నెలల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 9 నుంచి ఆర్ఎల్ స్టైన్స్ పంప్‌కిన్‌హెడ్ డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

వింత శాపం.. మాయమైన అన్నయ్య

తండ్రి అకాల మరణం తర్వాత సామ్ (బీన్ రీడ్) తన తల్లి, అన్నయ్య నిక్‌తో కలిసి ఒక కొత్త ఊరికి మారతాడు. కొత్త వాతావరణంలో ఒంటరితనంతో బాధపడే సామ్, కాస్త అల్లరి చేయడం ప్రారంభిస్తాడు. ఆ క్రమంలోనే ఆ ఊరిలో ఎంతో పవిత్రంగా, రహస్యంగా భావించే ఒక గుమ్మడికాయను (Pumpkin) దొంగిలిస్తాడు. తమ్ముడు చేసిన తప్పు తెలుసుకున్న అన్నయ్య నిక్, దాన్ని తిరిగి ఇచ్చేయడానికి వెళ్లిన చోట ఊహించని విధంగా అదృశ్యమవుతాడు.

ఇక్కడే కథలో అసలైన ఉత్కంఠ రేకెత్తించే మలుపు వస్తుంది. అన్నయ్య మాయమవడమే కాకుండా, ఆ ఊరిలోని పెద్దవాళ్లెవరికీ అసలు నిక్ అనే ఒక అబ్బాయి ఉన్నాడనే విషయమే గుర్తుండదు. అందరి మెదడులోంచి, ఆఖరికి ఫొటోల్లో నుంచి కూడా అతని జ్ఞాపకాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి.

దీంతో సామ్ తన కొత్త స్నేహితురాలు బెక్కా (అడెలైన్ లో) సాయంతో ఆ భయంకరమైన శాపం వెనుక ఉన్న అసలు గుట్టును ఛేదించడానికి బయలుదేరతాడు. తన అన్నయ్యను కాపాడుకోవడానికి ఒక క్రూరమైన దిష్టిబొమ్మ (Scarecrow) రాక్షసుడితో సామ్ చేసిన సాహసోపేతమైన పోరాటమే ఈ సినిమా.

90ల నాటి నాస్టాల్జిక్ వైబ్

ఈ సినిమాను దర్శకుడు ఎంచుకున్న కాలం, సృష్టించిన వాతావరణం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో కాకుండా, ల్యాండ్‌లైన్ ఫోన్లు, ఫ్లిప్ ఫోన్లు ఎక్కువగా వాడే 1990ల కాలం నాటి రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ను ఇందులో చూపించారు. ఇది డ్రామాకు ఒక వినూత్నమైన నాస్టాల్జిక్ ఫీలింగ్‌ను జోడించింది.

హాలీవుడ్ సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' మొదటి సీజన్‌లో ఎలాంటి భయం, అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఉంటాయో.. దాదాపు అదే స్థాయిలో ఈ సినిమా కూడా సాగుతుంది. "సీరియస్ హారర్ ప్రియులకు ఇది కాస్త మెత్తగా అనిపించవచ్చు, కానీ కొత్తగా భయాన్ని ఆస్వాదించాలనుకునే టీనేజర్లకు మాత్రం ఇది పక్కా వినోదాన్ని ఇస్తుంది" అని సినిమా విమర్శకులు రివ్యూలు ఇచ్చారు.

అలాగే, పంప్‌కిన్‌హెడ్ సినిమాలో వాడిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అకస్మాత్తుగా వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను కలిగిస్తాయి. బీన్ రీడ్, అడెలైన్ లో తమ పాత్రల్లో చక్కటి నటనను కనబరిచారు. ఈ సినిమా ఒక విభిన్నమైన లైన్‌లో సాగుతుంది. విపరీతమైన రక్తపాతం, క్రూరమైన హత్యలు ఉండే హారర్ సినిమాలను కోరుకునే వారికి ఇది కాస్త సాధారణంగా అనిపించవచ్చు.

3 ఓటీటీల్లో స్ట్రీమింగ్

అయితే, ఫాంటసీ, వింత రాక్షసులు, అడ్వెంచర్ కథలను ఇష్టపడే వారికి మాత్రం ఈ వీకెండ్‌లో ఇదొక బెస్ట్ ఆప్షన్. సినిమా ముగింపును ఓపెన్‌గా వదిలేయడం వల్ల క్లైమాక్స్ విషయంలో కొందరికి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ 2025 ఫాంటసీ హారర్ థ్రిల్లర్ పంప్‌కిన్‌హెడ్ 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

2025లో అక్టోబర్ 17న టూబీ అనే ఓటీటీలో పంప్‌కిన్‌హెడ్ నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇప్పుడు తాజాగా జియో హాట్‌స్టార్‌లో పంప్‌కిన్‌హెడ్ ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగు, హిందీ, తమిళం 3 భాషల్లో హాట్‌స్టార్‌లో జూలై 9 అంటే నిన్నటి నుంచి పంప్‌కిన్‌హెడ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా

అలాగే, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా పంప్‌కిన్‌హెడ్ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ వంటి నాలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో పంప్‌కిన్‌హెడ్ ఓటీటీ రిలీజ్ అయింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More