OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు- తెలుగులో 3- రామ్ చరణ్ పెద్ది టు శ్రద్ధా దాస్ హారర్ థ్రిల్లర్!

OTT Release Movies Today: డిజిటల్ స్క్రీన్లపై వినోదాన్ని ఆస్వాదించే ఓటీటీ ప్రియుల కోసం గురువారం (జూలై 9) సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ వేదికలుగా ఓటీటీ రిలీజ్ అయిన 5 ఇంట్రెస్టింగ్ సినిమాల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 9, 2026, 10:30:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release Movies Today: థియేటర్లకు వెళ్లే ఓపిక లేనివారికీ, ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని కొత్త సినిమాలు చూడాలనుకునేవారికీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు విభిన్న జానర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేశాయి.

OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు- తెలుగులో 3- రామ్ చరణ్ పెద్ది టు శ్రద్ధా దాస్ హారర్ థ్రిల్లర్!
OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు- తెలుగులో 3- రామ్ చరణ్ పెద్ది టు శ్రద్ధా దాస్ హారర్ థ్రిల్లర్!

ఓటీటీలో 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు

అయితే, ఇవాళ (జూలై 9) ఒక్కరోజు 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో రామ్ చరణ్ పెద్ది నుంచి శ్రద్ధా దాస్ హారర్ థ్రిల్లర్ త్రికాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలపై లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌లో 'పెద్ది' యాక్షన్ హంగామా

యూత్‌కు నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలు ఈ మధ్య కాలంలో బాగా ఆకట్టుకుంటున్నాయి. అదే కోవలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈరోజు నుంచి పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్సులతో పాటు, జాన్వీ కపూర్, జగపతి బాబు, శివ రాజ్‌కుమార్ మెప్పించే నటనతో తెరకెక్కించిన ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఇష్టపడే ప్రేక్షకులకు మంచి ఎంపిక కానుంది.

లిటిల్ హౌస్ ఆన్ ది ప్రయిరే ఓటీటీ

పెద్దితోపాటు పాటు అంతర్జాతీయ కంటెంట్‌ను తెలుగులో చూడాలనుకునేవారి కోసం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ మరో క్రేజీ సిరీస్‌ను తీసుకొచ్చింది. 'లిటిల్ హౌస్ ఆన్ ది ప్రయిరే' అనే ఇంగ్లీష్ హిస్టారికల్ ఫిక్షన్ రొమాంటిక్ అడ్వెంచర్ వెబ్ సిరీస్‌ను తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి తెచ్చారు. చారిత్రక కథాంశంతో సాగే సాహసాలు, ప్రేమకథలు ఇష్టపడే తెలుగు వీక్షకులను ఈ ఓటీటీ సిరీస్ అలరించనుంది.

సన్ నెక్ట్స్ ఓటీటీలో భయపెట్టే 'త్రికాల'

తెలుగు ప్రేక్షకులకు మైథలాజికల్, హారర్ థ్రిల్లర్ జోనర్లంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గతంలో వచ్చిన విరూపాక్ష, కార్తికేయ-2 లాంటి చిత్రాలను మనవాళ్లు ఎంతలా ఆదరించారో తెలిసిందే. ఇప్పుడు అదే తరహా ఉత్కంఠను పంచేందుకు శ్రద్ధా దాస్ నటించిన త్రికాల - స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ ఓటీటీలోకి వచ్చేసింది.

సన్ నెక్ట్స్‌ ఓటీటీలో ఈరోజు నుంచి త్రికాల స్ట్రీమింగ్ అవుతోంది. దైవిక అంశాలు, భయానక వాతావరణం కలగలిపిన ఈ మిస్టరీ థ్రిల్లర్ కచ్చితంగా సరికొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

హాలీవుడ్ కామెడీ డ్రామాలను ఇష్టపడే వారి కోసం జియో హాట్‌స్టార్‌లో 'ది ఫైవ్ స్టార్ వీకెండ్' అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ జూలై 9న ఓటీటీ రిలీజ్ అయింది. వారాంతంలో కాస్త సరదాగా, తేలికపాటి హాస్యంతో సాగిపోయే కథలను ఇష్టపడే వారికి ఇది బాగా కనెక్ట్ అవుతుంది.

చౌపల్ ఓటీటీ సినిమా

మరోవైపు ప్రాంతీయ భాషా చిత్రాలపై ఆసక్తి ఉన్న వీక్షకుల కోసం చౌపల్ ఓటీటీలో 'కాకా జమ్ పేయ' అనే పంజాబీ కామెడీ డ్రామా చిత్రం విడుదలైంది. పంజాబీ స్టైల్ మార్క్ హాస్యం, కుటుంబ కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.

తెలుగులో 3 స్ట్రీమింగ్

మొత్తానికి ఈ గురువారం (జూలై 9) ఓటీటీల్లో అటు మాస్ యాక్షన్, ఇటు హారర్ థ్రిల్లర్లతో పాటు సరికొత్త వినోదంతో 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు ముస్తాబయ్యాయి. వీటిలో మూడు తెలుగులోనే ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More