OTT Weekend: ఇవాళ సండే- ఓటీటీలో చూడాల్సిన టాప్ 5 సినిమాలు- అన్నీ తెలుగులోనే- ఒక్కోటి ఒక్కో రకం- ఒకేదాంట్లో స్ట్రీమింగ్!
OTT Telugu Movies To Watch On Weekend: వారాంతంలో వినోదం కోసం వెతికే ఓటీటీ ప్రియుల కోసం కచ్చితంగా చూడాల్సిన టాప్ 5 సినిమాల జాబితాను సిద్ధం చేశాం. ఒక్కోటి ఒక్కో రకంగా ఉండే ఈ సినిమాలన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఒక్క ఓటీటీలోనే ఈ మూవీస్ అందుబాటులో ఉండటం విశేషం.
Top 5 OTT Telugu Movies To Watch On Weekend: వారమంతా పనులతో బిజీగా గడిపేసిన జనాలకు శని, ఆదివారాలు వచ్చాయంటే చాలు కాస్త రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. థియేటర్లకు వెళ్లే ఓపిక లేని వారు ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో మంచి కంటెంట్ చూసేందుకు ఆసక్తి చూపిస్తారు.

అలాంటి ఓటీటీ ప్రేక్షకుల కోసమే ఇవాళ సండే (జూలై 12) వీకెండ్ సందర్భంగా ఒక్క ఓటీటీలోనే చూడాల్సిన టాప్ 5 సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఒక్కోటి ఒక్కో రకంగా ఉండే ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో లుక్కేద్దాం.
1. సూపర్ సుబ్బు (Super Subbu) - ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.4
ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది 'సూపర్ సుబ్బు' అనే తెలుగు ఓటీటీ సిరీస్. తెలుగుతో పాటు హిందీ ఆడియో కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఒక గ్రామంలోని పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించాల్సిన బాధ్యత హీరోపై పడుతుంది. ఈ క్రమంలో తన కోపిష్టి తండ్రి కంట పడకుండా, అతని నుంచి తప్పించుకుంటూ ఆ హీరో తన బాధ్యతను ఎలా పూర్తి చేశాడనేది కథాంశం. మొత్తం 7 ఎపిసోడ్లతో సాగే ఈ సిరీస్ వినోదాన్ని పంచుతూనే మంచి సందేశాన్ని ఇస్తుంది.
2. పెద్ది (Peddi) - ఐఎమ్‌డీబీ రేటింగ్: 5.7
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం 'పెద్ది' ఈ లిస్ట్‌లో రెండవ స్థానంలో నిలిచింది. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని ఒక మారుమూల గ్రామానికి చెందిన అథ్లెట్, తన ఊరికి గుర్తింపు తీసుకురావడం కోసం చేసిన పోరాటమే ఈ సినిమా.
ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉన్న పెద్ది చిత్రం త్వరలోనే హిందీలోనూ రానుంది. రామ్ చరణ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
3. బ్లాస్ట్ (Blast) - ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.4
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ క్రైమ్ డ్రామా చిత్రం 'బ్లాస్ట్'. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం అనుకోకుండా ఒక డేంజరస్ గ్యాంగ్‌స్టర్‌తో గొడవలో ఇరుక్కుంటుంది.
ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడటానికి ఆ కుటుంబంలోని మార్షల్ ఆర్ట్స్ ప్రతిభ ఎలా ఉపయోగపడిందనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ యాక్షన్ థ్రిల్లర్ బ్లాస్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
4. సింగ్ గీతం (Sing Geetham) - ఐఎమ్‌డీబీ రేటింగ్: 6.4
సామాజిక అంశాల నేపథ్యంతో సాగే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం 'సింగ్ గీతం'. అహల్యా బామ్రూ, అయాన్, శాలిని కొండెపూడి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కథాంశం చాలా హిలేరియస్‌గా ఉంటుంది.
డబ్బు పిచ్చి ఉన్న ఒక వ్యక్తి తన సొంత గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత, అక్కడ దాగి ఉన్న గుప్త నిధి (బంగారం) వివాదంలో ఎలా చిక్కుకున్నాడనేది ఆసక్తికరంగా చూపించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో సింగ్ గీతం ఓటీటీ రిలీజ్ అయింది.
5. గుర్తుకొస్తున్నాయి (Gurthukostunnayi) - ఐఎమ్‌డీబీ రేటింగ్: 9.4
అత్యధిక ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో దూసుకుపోతున్న సరికొత్త తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి'. విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా.. వివా రాఘవ్, రోహిణి హట్టంగడి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.
సంతోష్ అనే యువకుడు తన చిన్ననాటి స్నేహితురాలు వైశాలిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. కానీ, సరిగ్గా పెళ్లికి ముందే అతను తన జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. ఆ తర్వాత జరిగిన సిల్లీ అండ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ ఈ సిరీస్‌ను బెస్ట్ వీకెండ్ వాచ్‌గా మార్చేశాయి. ఇది వరకు ఈటీవీ విన్ లో రిలీజ్ అయిన గుర్తుకొస్తున్నాయి సిరీస్ తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


