OTT Crime Thrillers: 2 ఓటీటీల్లోకి ఒక్కరోజే వచ్చిన 4 క్రైమ్ థ్రిల్లర్స్- ఒక్కో భాషలో ఒక్కోటి- ఒకేదాంట్లో 3- ఎక్కడంటే?
OTT Crime Thrillers In Telugu Tamil Kannada Hindi: ఈ వీకెండ్‌ను థ్రిల్‌తో ఎంజాయ్ చేసేందుకు 2 ఓటీటీల్లోకి నాలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవి తెలుగు, కన్నడ, తమిళం, హిందీ ఇలా ఒక్కో భాషలో ఒక్కోటి ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్ ఏంటో చూద్దాం.
OTT Crime Thrillers In Telugu Tamil Kannada Hindi: ఎండల తీవ్రత పెరగడంతో బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే కూర్చుని ఓటీటీ కంటెంట్ చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అలాంటి వారికోసం థ్రిల్‌ను పంచేందుకు క్రైమ్ థ్రిల్లర్స్ ఓటీటీలోకి వచ్చేశాయి.

ఒక్కదాంట్లోనే 3
ఒక్క శుక్రవారం (మే 22) నాడు రెండు ఓటీటీల్లో నాలుగు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ వంటి ఒక్కో భాషలో ఒక్కోటి ఉంది. అంతేకాకుండా ఒక్క ఓటీటీలోనే ఏకంగా 3 క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ అవడం విశేషం. మరి విభిన్నమైన కథాంశాలతో కూడిన ఆ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
'వారెంట్'.. సాధు స్వభావం వెనుక దాగున్న క్రూరత్వం!
తమిళంలో సూపర్ హిట్ అయిన విలంగు ఓటీటీ వెబ్ సిరీస్ ప్రపంచం (Universe) నుంచి వచ్చిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ 'వారెంట్'. వారెంట్ ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ ది విలంగు అనేది పూర్తి టైటిల్. కోట్టై కరుప్పసామి అనే ఒక సాధు స్వభావం గల, దయా హృదయుడైన కానిస్టేబుల్ కథ ఇది.
అతని మంచితనాన్ని చూసి చుట్టుపక్కల వారు, తోటి సిబ్బంది హేళన చేయడంతో అతనిలో మార్పు మొదలవుతుంది. ఆ అవమానాల నుంచి అతను ఒక క్రూరమైన, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే రక్షకుడిగా ఎలా మారాడనేది దర్శకుడు ఆసక్తికరంగా చూపించారు. అధికారం, అణచివేత అనే అంశాల చుట్టూ సాగే ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వారెంట్ ఓటీటీ రిలీజ్ అయింది. మే 22 నుంచి జీ5లో వారెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
'శేష 2016'.. ఒకే రాత్రిలో సాగే మరణ శాసనం!
కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన బైలింగ్వల్ క్రైమ్ థ్రిల్లర్ 'శేష 2016'. ప్రదీప్ అరసికెరె దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకే ఒక్క రాత్రిలో జరిగే మనుగడ సాగించే పోరాటం, నైతిక విలువల చుట్టూ ఈ కథ నడుస్తుంది.
ఇందులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) పాత్రలో దేవరాజ్, ఏఎస్ఐ ఆంథోనీ వర్గీస్ పాత్రలో ప్రమోద్ శెట్టి, ఎస్ఐ దాస్ పాత్రలో జాన్ కైప్పల్లిల్ పవర్‌ఫుల్ నటనను కనబరిచారు. సస్పెన్స్, హై డ్రామా ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఎంపిక. మే 22 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT)లో శేష 2016 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ క్రైమ్ థ్రిల్లర్ అయిన శేష 2016 మలయాళంలో కూడా అందుబాటులో ఉంది.
సత్రంగి బద్లే కా ఖేల్ ఓటీటీ రిలీజ్
హిందీ క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారి కోసం సత్రంగి: బద్లే కా ఖేల్ ఓటీటీలోకి వచ్చేసింది. హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయిన సత్రంగి పగ, ప్రతీకారాల నేపథ్యంలో థ్రిల్లర్ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తుంది. జీ5 ఓటీటీలోనే మే 22 నుంచి సత్రంగి బద్లే కా ఖేల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
పందెం కోడి చుట్టూ తిరిగే నవ్వుల పండగ!
తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ థ్రిల్ పంచేందుకు వచ్చిన సరికొత్త క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కామెడీ వెబ్ సిరీస్ 'మేము కాప్‌లం'. తెలుగు రాష్ట్రాల్లో కోడి పందెలాకు ఉండే క్రేజ్ వేరు. అదే తరహాలో ఒక పెద్ద కోడి పందాల పోటీకి ముందు 'సలార్ రాజు' అనే పందెం కోడి హఠాత్తుగా మాయమవుతుంది. ఆ కోడిని వెతికే బాధ్యతను గ్రామంలోని ఇద్దరు అమాయక పోలీసు కానిస్టేబుళ్లు రవి సొటారి, మోహన్ సొటారిలకు అప్పగిస్తారు.
జీ5 ఓటీటీలో
ఒక సాధారణ కోడి దొంగతనం కేసు కాస్తా, ఊహించని మలుపులు తిరిగి ఎలాంటి పెద్ద కుట్రకు దారితీసిందనేది ఈ ఓటీటీ సిరీస్ కథాంశం. గ్రామీణ నేపథ్యంలో సాగే వ్యంగ్యం, కామెడీతో ఈ థ్రిల్లర్ మిస్టరీ సిరీస్‌ను చాలా చక్కగా మలిచారు. నాగబాబు, గెటప్ శ్రీను నటించిన మేము కాప్‌లం జీ5లో మే 22న ఓటీటీ రిలీజ్ అయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


