OTT Review: కానిస్టేబుల్ కనకం 2 రివ్యూ- థియేటర్లలోకి సీజన్ 3- ఓటీటీలోని ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సీజన్ 2 ఎలా ఉందంటే?

ఓటీటీలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కానిస్టేబుల్ కనకం. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అదిరిపోయే ట్విస్ట్ లతో ఆడియన్స్ కు థ్రిల్ అందిస్తుంది. ఇప్పటికే రెండు సీజన్లో సూపర్ హిట్ గా నిలిచాయి. సీజన్ 3 నేరుగా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో సీజన్ 2 రివ్యూపై ఓ లుక్కేయండి.  

Jan 23, 2026, 20:39:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వెబ్ సిరీస్: కానిస్టేబుల్ కనకం సీజన్ 2

కానిస్టేబుల్ కనకం సీజన్ 2 రివ్యూ
కానిస్టేబుల్ కనకం సీజన్ 2 రివ్యూ

నటీనటులు: వర్ష బొల్లమ్మ, రాజీవ్ కనకాల, మేఘ లేఖ, అవసరాల శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ తదతరులు

డైరెక్టర్: ప్రశాంత్ కుమార్ దిమ్మల

మ్యూజిక్: సురేష్ బొబ్బిలి

ఓటీటీ: ఈటీవీ విన్

రిలీజ్ డేట్: జనవరి 8, 2026

ఓటీటీలో చాలా వెబ్ సిరీస్ లు వస్తుంటాయి. వాటికి కొత్త సీజన్లూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్, మిస్టరీ, ఎమోషన్.. ఈ అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో అదగొడుతోంది.

కానిస్టేబుల్ కనకం సీజన్ 1 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సీజన్ లోని ట్విస్ట్ లు భలే మజాను అందించాయి. ఇక సీజన్ 2 అంతకంటే ఎక్కువ కిక్ ఇచ్చింది. ఈ సారి ట్విస్ట్ లు పెరిగాయి. ఉత్కంఠ పెరిగింది. కానిస్టేబుల్ కనకం సీజన్ 3ని డైరెక్ట్ గా థియటర్లలో రిలీజ్ చేస్తామన్న నేపథ్యంలో ఈటీవీ విన్ లో సీజన్ 2 ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.

కథ

కానిస్టేబుల్ కనకం స్టోరీ విషయానికి వస్తే తప్పిపోయిన తన ఫ్రెండ్ చంద్రిక (మేఘ లేఖ) కోసం తపనపడుతూ, ఎలాగైనా ఆచూకీ కనుక్కోవాలని ప్రయత్నించే కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి (వర్ష బొల్లమ్మ) కథే ఈ సిరీస్. సీజన్ 1లో అడవిగుట్టలో తప్పిపోయిన అమ్మాయిలను క్షుద్ర పూజల కోసం ప్రెసిడెంట్ (అవసరాల శ్రీనివాస్) చప్పాడని తెలిసిపోతుంది. కానీ చంద్రిక ఆచూకీ మాత్రం దొరకదు.

అందరూ చంద్రిక చనిపోయిందని అనుకుంటారు. కానీ కనకం మాత్రం చంద్రిక బతికే ఉందని బలంగా నమ్ముతుంది. అందుకే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. చంద్రిక వాళ్ల ఇంటికి వెళ్తే అక్కడ ఓ చున్నీ దొరుకుతుంది. ఇక చంద్రిక మనీ ఆర్డర్ పంపే అడ్రెస్ కు వెళ్తే కనకం షాక్ అవుతుంది. మరి అక్కడ చంద్రిక ఉందా? అసలు సహస్ర ఎవరు? కనకం తల్లికి ఈ కథకు ఏంటీ సంబంధం? అన్నది సీజన్ 2లో చూడాల్సిందే.

విశ్లేషణ

ఓటీటీలో థ్రిల్లర్లకు మంచి డిమాండ్ ఉంది. ఇక ట్విస్ట్ లతో కూడిన, సస్పెన్స్ తో ఊపేస్తూ, థ్రిల్ పంచే వెబ్ సిరీస్ లకు కచ్చితంగా ఆదరణ ఉంటుంది. కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ఈ ఫార్ములానే ఫాలో అయింది. అందుకే హిట్ కొట్టింది. సీజన్ 2లో నాలుగు ఎపిసోడ్లే ఉన్నా అవి అందించే థ్రిల్ మాత్రం వేరే లెవల్. ఒకదానికి మించి ఒక ట్విస్ట్ ఉంటుంది.

చంద్రిక కోసం వెళ్లిన కనకానికి సహస్ర గురించి తెలియడం, సహస్రను ఎవరు చంపారో కనిపెట్టడం, చివరకు కనకం తల్లి ఎవరు అనే ట్విస్ట్ మైండ్ బ్లాక్ అవుతుంది.

యాక్టింగ్

నటన పరంగా చూస్తే కానిస్టేబుల్ కనకం సీజన్ 2లో వర్ష బొల్లమ్మకు నూటికి నూరు మార్కులు పడతాయి. సీజన్ మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని మోసింది. ఈ సీజన్ లో మొత్తం ఆమెనే కనిపిస్తుంది. చంద్రిక కోసం ఆమె పడే తపన, చంద్రిక కనిపించాక ఎమోషన్, చంద్రికను చంపింది ఎవరో తెలుసుకున్నాక పలికించే బాధ, చివర్లో తన తల్లి ఎవరన్నది రివీల్ అయ్యాక కలిగే సంఘర్షణ.. ఇలా వర్ష బొల్లమ్మ నట విశ్వరూపమే చూపించింది. ఇక చంద్రికగా మేఘలేఖకు, రాజీవ్ కనకాల తదితరులకు ఈ సీజన్ లో ఎక్కువ స్కోప్ దక్కలేదు.

ఫైనల్ గా

ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్లను చూడాలనుకునే ఆడియన్స్ కు కానిస్టేబుల్ కనకం సీజన్ 2 మంచి ట్రీట్ లాంటి సిరీస్. ముఖ్యంగా కథను దర్శకుడు డిజైన్ చేసుకున్న విధానం, నడిపించిన తీరు కచ్చితంగా నచ్చుతుంది.

రేటింగ్: 3.75/5

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More