Sign in

ఈవారం ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 6 మూవీస్ ఇవే.. రెండు బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ సినిమాలు కూడా..

ఈవారం ఓటీటీల్లోకి ఎన్నో ఇంట్రెస్టింగ్ మూవీస్ వస్తున్నాయి. వీటిలో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 6 సినిమాలేవో ఇక్కడ తెలుసుకోండి. వీటిలో రెండు బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకోండి.

Published on: Oct 14, 2025, 17:30:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ వారం కూడా చాలా సినిమాలే వస్తున్నాయి. ఈ దీపావళి లాంగ్ వీకెండ్ చూడటానికి చాలా మూవీసే అందుబాటులోకి రానున్నాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలు మాత్రం చాలా ఆసక్తి రేపుతున్నాయి. జియోహాట్‌స్టార్, జీ5, ఆహా వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ మూవీస్ రానున్నాయి.

ఈవారం ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 6 మూవీస్ ఇవే.. రెండు బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ సినిమాలు కూడా..
ఈవారం ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 6 మూవీస్ ఇవే.. రెండు బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ సినిమాలు కూడా..

కిష్కింధపురి - జీ5 ఓటీటీ

తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురి ఈవారమే ఓటీటీలోకి వస్తోంది. జీ5 ఓటీటీలోకి ఈ సినిమా అక్టోబర్ 17న అడుగుపెట్టనుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.30 కోట్ల వరకూ వసూలు చేసింది.

ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ - జియోహాట్‌స్టార్

ఫైనల్ డెస్టినేషన్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఆరో సినిమా ఇది. ఈ సినిమా అక్టోబర్ 16 నుంచి జియోహాట్‌స్టార్ లోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.2700 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ పై ఆసక్తి నెలకొంది.

లోకా ఛాప్టర్ 1 - జియోహాట్‌స్టార్

అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీ లోకా ఛాప్టర్ 1 కూడా అక్టోబర్ 17నే జియోహాట్‌స్టార్ లోకి అడుగుపెట్టనుంది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ ఫిమేల్ సూపర్ హీరో సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో నటించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల మార్క్ దాటగానే మేకర్స్ ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

ఆనందలహరి - ఆహా వీడియో ఓటీటీ

ఆహా వీడియో ఓటీటీలోకి అక్టోబర్ 17న అడుగుపెడుతున్న సినిమా ఆనందలహరి. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈస్ట్ గోదావరి అబ్బాయి, వెస్ట్ గోదావరి అమ్మాయి పెళ్లితో ఒకటైతే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. అభిషేక్, భ్రమరాంబిక ఈ సినిమాలో నటించారు.

సంతోష్ - లయన్స్‌గేట్ ప్లే ఓటీటీ

బ్రిటీష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్య సూరి డైరెక్ట్ చేసిన సినిమా సంతోష్. ఇదొక క్రైమ్ డ్రామా. ఇండియాలో థియేటర్లలో రిలీజ్ కు సెన్సార్ బోర్డు నిరాకరించింది. అయితే ఇప్పుడు లయన్స్‌గేట్ ప్లే ద్వారా ఓటీటీలోకి వస్తోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. అక్టోబర్ 17న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

భగవత్ ఛాప్టర్ 1 - జీ5 ఓటీటీ

హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ భగవత్ ఛాప్టర్ 1 మూవీ జీ5 ఓటీటీలోకి అక్టోబర్ 17న వస్తోంది. కనిపించకుండాపోయిన ఓ బాలిక కేసును పరిష్కరించే క్రమంలో ఓ వ్యభిచార రాకెట్ ను బయటపెట్టే పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ ఇది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More